BigTV English

Bigg Boss 8 Day 38 Promo 1: మైక్ విసిరేసిన గౌతమ్ కృష్ణ.. షాక్ లో కంటెస్టెంట్స్..!

Bigg Boss 8 Day 38 Promo 1: మైక్ విసిరేసిన గౌతమ్ కృష్ణ.. షాక్ లో కంటెస్టెంట్స్..!

Bigg Boss 8 Day 38 Promo 1.. బిగ్ బాస్ సీజన్ 8 మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైంది. అప్పుడే ఐదు వారాలు పూర్తి కాగా అందులో 6 మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. మిగిలి ఉన్నది ఎనిమిది మంది కంటెస్టెంట్స్ మాత్రమే. అయితే వీరి కి పోటీగా వైల్డ్ కార్డు ద్వారా మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ను హౌస్ లోకి తీసుకొచ్చారు బిగ్ బాస్ నిర్వాహకులు. అయితే వీరంతా కూడా మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కావడం గమనార్హం. బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన ఎనిమిది మందిని రాయల్ క్లాన్ గా, అప్పటికే హౌస్ లో ఉన్న ఎనిమిది మందిని ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ క్లాన్ గా విభజించి మొత్తం 16 మందితో ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు.


మైక్ విసిరేసిన గౌతమ్ కృష్ణ..

అందులో భాగంగానే ఈరోజు 38వ రోజుకు సంబంధించి మొదటి ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో నవ్వకుండా ఉండండి అంటూ ఒక ఛాలెంజ్ ను ఇచ్చారు బిగ్ బాస్. ఆ తర్వాత ముక్కు అవినాష్ కామెడీగా చేసిన మాటను గౌతమ్ కృష్ణ సీరియస్ గా తీసుకొని మైక్ విసిరేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంతేకాదు వెళ్లిపోమంటే షో నుంచే బయటకు పోతాను అంటూ కామెంట్ చేయడంతో కంటెస్టెంట్స్ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం.


నవ్వకుండా ఉండండి..

ప్రోమో విషయానికి వస్తే.. మొదటి ఛాలెంజ్ లో భాగంగా నవ్వకుండా ఉండండి అంటూ ఒక టాస్క్ నిర్వహించారు బిగ్ బాస్. అందులో అమ్మాయిల గ్రూప్ కి ముక్కు అవినాష్, అబ్బాయిల గ్రూప్ కి రోహిణిని లీడర్లుగా నియమించారు. అయితే ఇది చెప్పిన వెంటనే రోహిణి బిగ్ బాస్ ముక్కు అవినాష్ అబ్బాయి, నేను అమ్మాయి గుర్తుంది కదా అంటూ చెప్పగా.. నేను మర్చిపోలేదు అందుకే ఇలా చెప్పాను అంటూ బిగ్ బాస్ రోహిణికి ఝలక్ ఇచ్చారు.

ఛాలెంజ్ గెలిచిన ముక్కు అవినాష్ టీం..

అలా టాస్క్ ప్రారంభం అవ్వగానే అమ్మాయిలు నవ్వకుండా ఉండడానికి ప్రయత్నం చేయగా.. అబ్బాయిలు నవ్వించే ప్రయత్నం చేశారు. ఇక అబ్బాయిలు ఎంత ట్రై చేసినా అమ్మాయిలను నవ్వించలేకపోయారు. ఆ తర్వాత అబ్బాయిల వంతు వచ్చింది. అమ్మాయిలు నవ్వించే ప్రయత్నం చేశారు అప్పటికే అబ్బాయిలు నవ్వడం మొదలుపెట్టగా.. ఇక అమ్మాయిల తరఫు లీడర్ ముక్కు అవినాష్ రాగాలు తీస్తూ మణికంఠను నవ్వించే ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా మణికంఠ నవ్వేసి ఛాలెంజ్ ఓడిపోయారు. అమ్మాయిల గ్రూపు గెలవడంతో సంతోషంతో ముక్కు అవినాష్ అశ్వద్ధామ 2.0 వచ్చేసాడు అంటూ గట్టిగా అరిచాడు. దీంతో హర్ట్ అయిన గౌతం బ్రో అది సీజన్ సెవెన్ డైలాగ్ అక్కడితో అయిపోయింది. మళ్లీ మళ్లీ తీసి నాకు ఇరిటేషన్ తెప్పించొద్దండి.. వెళ్లిపోమంటే వెళ్ళిపోతాను అంటూ మైక్ విసిరేసి.. బిగ్బాస్ నేను టాస్క్ ఆడను అంటూ గౌతమ్ వెళ్లిపోయారు. దీంతో కంటెస్టెంట్స్ అంతా షాక్ కి గురయ్యారు.

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×