BigTV English

Bigg Boss 8 Promo : గేమ్ ఛేంజింగ్ ట్విస్ట్… విష్ణు ప్రియ హానెస్ట్, పృథ్వి ఫేక్ లవ్ స్టోరీ బయట పెట్టిన బిగ్ బాస్

Bigg Boss 8 Promo : గేమ్ ఛేంజింగ్ ట్విస్ట్… విష్ణు ప్రియ హానెస్ట్, పృథ్వి ఫేక్ లవ్ స్టోరీ బయట పెట్టిన బిగ్ బాస్

Bigg Boss 8 Promo : బిగ్ బాస్ సీజన్ 8 డే 26 కు సంబంధించిన మూడో ప్రోమో తాజాగా రిలీజ్ అయింది. ఇందులో బిగ్ బాస్ పృథ్వీ, విష్ణు ప్రియ జరుగుతున్న లవ్ స్టోరీ గురించి ఊహించని నిజాన్ని బయట పెట్టారు. అలాగే తాజాగా ఒక గోల్డెన్ బ్యాండ్ ను టాస్క్ లో పెట్టి గేమ్ చేంజింగ్ ట్విస్ట్ ఇచ్చారు.


విష్ణు ప్రియా, పృథ్వి లవ్ స్టోరీ ఫేకా?

12 మంది వైల్డ్ కార్డు ఎంట్రీలను హౌస్ లోకి రాకుండా ఆపడానికి బిగ్ బాస్ 12 టాస్క్ లను పెడుతున్న విషయం తెలిసిందే. అందులో జరిగిన బెలూన్ టాస్క్ లో బిగ్ బాస్ పృథ్వి, విష్ణు ప్రియలను ఒక్కటి చేశారు. బిగ్ బాస్ ఆదేశం మేరకు ఓ పాట పాడిన పృథ్వీ దాన్ని విష్ణు ప్రియకు అంకితం ఇచ్చారు. ఆ తర్వాత విష్ణు ప్రియ, పృథ్వి ఒకటైనట్టుగా కనిపించారు. ఇక తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో పృథ్వి ఎక్కడ ఉంటే అక్కడే తిరుగుతూ కనిపించింది విష్ణు ప్రియ. అతను వాష్ రూమ్ లో ఉంటే ఆమె కూడా అక్కడే కూర్చుని హౌస్ మేట్స్ కి షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రేరణ ‘పృథ్వి ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుందా విష్ణు ప్రియ?’ అంటూ సీతతో మాట్లాడుతూ కనిపించింది. అలాగే ‘విష్ణు ప్రియ జెన్యూన్ గానే ఇష్టపడుతోంది, కానీ పృథ్వీ అటెన్షన్ కోరుకుంటున్నాడు’ అంటూ అతని ఎమోషన్ ఫేక్ అనే విషయాన్ని బయట పెట్టింది ప్రేరణ. ఆ తర్వాత కూడా యష్మి గౌడ, కిరాక్ సీత, విష్ణు ప్రియ మధ్య పృథ్వి గురించి డిస్కషన్ వచ్చింది. అందులో భాగంగా యష్మి ‘ఏ రకంగా చూసుకున్నా పృథ్వి కంటే మణికంఠ హాట్ గా ఉంటాడు’ అని కామెంట్ చేయగా విష్ణు ప్రియ ‘నా కళ్ళతో చూడండి’ అంటూ సినిమా డైలాగులు కొట్టింది.


గేమ్ ఛేంజింగ్ ట్విస్ట్

ఇక ఆ తర్వాత ఇదే ప్రోమోలో బిగ్ బాస్ గేమ్ ఛేంజింగ్  ట్విస్ట్ ఇచ్చారు. హౌస్ మేట్స్ అందర్నీ యాక్షన్ రూమ్ లోకి పిలిచి ‘మీ ముందు ఒక గోల్డెన్ బ్యాండ్ ఉంది. ఆ బ్యాండ్ కి ఒక పవర్ ఉంది. ఆ పవర్ ని ఉపయోగించి మీరు మీ సొంత క్లాన్ లో నుంచి వేరే క్లాన్ లోకి వెళ్లొచ్చు’ అంటూ బిగ్ బాస్ ఆ టాస్క్ గురించి వివరించారు. ఆ తర్వాత ఇరువురు చీఫ్ లు ఇటు నిఖిల్ తో పాటు అటు సీత అవతలి టీం లోని కంటెస్టెంట్స్ ని తమ క్లాన్ లోకి రప్పించుకోవడానికి, ఆల్రెడీ ఉన్న కంటెస్టెంట్స్ ని అవతలి క్లాన్ లోకి వెళ్లకుండా ఆపడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నట్టుగా కనిపించారు. మరి ఈ టాస్క్ లో ఏం మార్పులు చేర్పులు జరగబోతున్నాయో,  ఎవరెవరు అవతలి క్లాన్ లోకి జంప్ అవుతారో, విష్ణు విషయంలో ఏం జరుగుతుందో తెలియాలంటే ఈరోజటి ఎపిసోడ్ వచ్చేదాకా ఆగాల్సిందే.

Related News

Bigg Boss 9 Promo: ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు.. సందిగ్ధంలో కంటెస్టెంట్స్!

Bigg Boss 9: బిగ్ బాస్ ఎంట్రీ.. కంటెస్టెంట్స్ ని ఆటాడుకున్న బాస్, ఇదేవరూ ఊహించలేదు భయ్యా!

Bigg Boss 9 Promo: ఇట్స్ ఎమోషన్స్ టైం.. దుఃఖంలో కూడా త్యాగం చేసిన ఇమ్ము!

Bigg Boss 9 Promo: హౌస్ లో మరో కొత్త లవ్ ట్రాక్.. ఒక్కొక్కరు ఇద్దరేసి!

Bigg Boss 9: గౌతమి ఎఫెక్ట్.. రీతూపై భారీ వేటు పడనుందా?

Bigg Boss 9 Telugu: రీతూకి డిమోన్ వెన్నుపోటు.. ల*త్కో*ర్ పనులంటూ.. శ్రీజ సేవ్, నామినేషన్ లో ఉన్నదేవరంటే..

Divvela Madhuri: నా రాజాను వదిలి ఉండలేను.. కానీ, వైల్డ్ కార్డ్ ఎంట్రీ పై మాధురి క్లారిటీ!

Bigg Boss 9 wildcard : వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ వీళ్లే.. ఇక హౌస్‌లో రచ్చ రచ్చే!

Big Stories

×