BigTV English
Advertisement

Jani Master Case : జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్.. Big Tv తో జానీ మాస్టర్ భార్య అయేషా..

Jani Master Case : జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్.. Big Tv తో జానీ మాస్టర్ భార్య అయేషా..

Jani Master Case : ప్రముఖ టాలీవుడ్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం చంచల్ గూడా జైల్లో రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. అసిస్టెంట్ గా ఉన్న తనను బలవంతంగా అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు స్టేట్‌మెంట్‌ను ముందు ఉంచి జానీ మాస్టర్‌ను నార్సింగి పోలీసులు విచారించారు. అయితే పోలీసుల విచారణలో బాధితురాలే తనను వేధించిందని జానీ మాస్టర్ చెప్పినట్లు సమాచారం. దీంతో ఈ కేసు మరో మలుపు తిరగబోతుందని తెలుస్తుంది.. కస్టడీలో ఉన్న జానీ మాస్టర్ ను ఆయన భార్య నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి కలిసింది. అనంతరం ప్రముఖ మీడియా ఛానెల్ బిగ్ టీవీ తో మాట్లాడింది. ఈ క్రమంలో సంచలన నిజాలను మీడియా ముఖంగా అయేషా చెప్పారు.


Big Tv తో జానీ మాస్టర్ భార్య అయేషా..

మూడో రోజు విచారణలో భాగంగా జానీ మాస్టర్ ను నార్సింగ్ పోలీసులు విచారణ కోసం నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఆయనకు తన భార్య ఫుడ్ ను తీసుకొని వచ్చారు. జానీ మాస్టర్ ను కలిసిన అనంతరం ఆయేషా బిగ్ టీవీ తో మాట్లాడారు.. ఆమె మాట్లాడుతూ.. నా భర్త ను ఇలాంటి పరిస్థితుల్లో చూస్తాను అనుకోలేదు. నా భర్త ఎలాంటి తప్పు చేయలేదు.. జానీ కోసం లంచ్ బాక్స్ తీసుకొచ్చాను. తనకు ఇష్టమైన చికెన్, రసం తెచ్చానని చెప్పారు. ఇక యువతి నిరాధారమైన ఆరోపణలు చేస్తోంది. కస్టడీ లో పోలీసులకు అన్ని విషయాలు జానీ మాస్టర్ చెప్పినట్లు ఆమె చెప్పారు. న్యాయంగా పోరాడతాం. కొన్నేళ్ల పాటు మా కుటుంబంలో ఒకరిగా ఉన్న యువతి ఇప్పుడు కేసులు పెడుతోంది అంటే ఇదంతా కుట్రపూరితమే.. ఓ పెద్ద హీరో వెనక ఉండి నడిపిస్తున్నాడు అనేది అవాస్తవం. సోషల్ మీడియా లో పుట్టించిన పూకారే అని కొట్టిపారేశారు. ఇండస్ట్రీ లోని పెద్దలు కూడా మాకు అండగా ఉంటున్నారు. జానీ ఎలాంటి తప్పు చేయడని వాళ్లకు కూడా తెలుసు.. బయటి ఫుడ్ పడక.. జానీ కొంత అస్వస్థతకు లోనయ్యాడు. ఇప్పుడు ఆరోగ్యం బాగానే ఉంది.. త్వరలోనే నిర్దోషిగా తిరిగి వస్తారని ఆమె అన్నారు..


కస్టడీలో జానీ మాస్టర్ ఏం చెప్పారంటే?

నాపై బాధితురాలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవి. ఢీ షో ద్వారా తనకు తానే పరిచయం చేసుకుంది. మైనర్‌గా ఉన్న సమయంలో లైంగిక దాడి చేశాననేది అబద్ధం. తన టాలెంట్‌ను గుర్తించి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా అవకాశం ఇచ్చాను. తనని పెళ్లి చేసుకోవాలని బాధితురాలు మానసికంగా హింసించేది… ఎన్నోసార్లు నాపై ఆమె బెదిరింపులకు దిగింది. నేను పడుతున్న ఇబ్బందిని డైరెక్టర్ సుకుమార్‌ దృష్టికి కూడా తీసుకెళ్ళాను. సుకుమార్ పిలిచి మాట్లాడినా కూడా బాధితురాలిలో మార్పు రాలేదు. నన్ను కావాలనే ఇరికించాలని కుట్ర చేస్తుంది అని మాస్టర్ చెప్పారు. వెనుక ఉండి ఎవరో నాపై కుట్ర చేశారు. నా ఎదుగుదలను ఓర్వలేకనే ఈ కేసులో నన్ను ఇరికించారు. అన్ని నిజాలు బయటకు వస్తాయని మాస్టర్ విచారణలో చెప్పారు. ఈ కేసు ప్రస్తుతం మరో మలుపు తిరగనుందని తెలుస్తుంది. త్వరలోనే పూర్తి వివరాలను బయటపెడతామని పోలీసులు చెబుతున్నారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×