BB Telugu 8: బిగ్ బాస్ (Bigg Boss)తెలుగు సీజన్ 8 ఆఖరి ఘట్టానికి చేరుకుంది. ఇక ఈ సీజన్లో ఆఖరి నామినేషన్ కూడా ముగిసిన విషయం తెలిసిందే. టికెట్ టు ఫినాలే రేస్ గెలిచి మొదటి ఫైనలిస్టుగా నిలిచిన అవినాష్ (Avinash) మినహా 6 మంది నామినేషన్స్ లోకి వచ్చారు వారిలో రోహిణి, ప్రేరణ, విష్ణు ప్రియ, నబీల్ , నిఖిల్, గౌతమ్ ఇలా మొత్తం 6 మంది నామినేషన్స్ లోకి వచ్చారు. ఇకపోతే ఓటింగ్ అలా ప్రారంభం అయ్యిందో లేదో డేంజర్ జోన్ లో పడింది అరుంధతి గా పేరు దక్కించుకున్న రోహిణి. ఇక ఓటింగ్లో నిఖిల్ ని సైతం ఓడించేసి ప్రేరణ ముందంజలో ఉంది.
సోమవారం జరిగిన ఎపిసోడ్ లో గౌతమ్ తో జరిగిన గొడవ కారణంగా నిఖిల్ కి బాగా ప్లస్ అయింది. యష్మీ ని వాడుకున్నావు అంటూ నిఖిల్ పై గౌతమ్ ఆధారం లేని ఆరోపణలు చేయడంతో నిఖిల్ గట్టిగానే గొడవ పెట్టుకున్నాడు. అతడు మాట్లాడిన పాయింట్స్ కూడా కాస్త జెన్యూన్ గా ఉండడంతో నిఖిల్ కి ఓటింగ్ పెరిగిపోయింది. ఇక టాస్కుల్లో గెలవడం కూడా నిఖిల్ కి ప్లస్ అయిందని చెప్పాలి. దీంతో నిఖిల్ మరోసారి గౌతమ్ కి గట్టి పోటీ ఇచ్చాడు. సెకండ్ ప్లేస్ లో నిలిచాడు. అలాగే ఓటింగ్ లో కూడా ఇద్దరి మధ్య చాలా తక్కువ తేడా ఓట్లు ఉండడంతో ఇద్దరిలో ఎవరు విజేత అవుతారనే ఉత్కంఠ కూడా నెలకొంది.
ఇకపోతే మంగళవారం టాస్క్ ల్లో నిఖిల్ ని ఓడించడం ప్రేరణకు బాగా కలిసి వచ్చింది. మంగళవారం టాస్కుల్లో ప్రేరణ గెలిచి ఓటింగ్లో నాలుగో స్థానంలో నిలిచింది. ఇక ఐదవ స్థానంలో నిలిచిన విష్ణు ప్రియ ఇంకా గట్టిగా ఆట ఆడాల్సి ఉంటుందని నెటిజన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే డేంజర్ జోన్ లో పడింది రోహిణి. ఈ వారం ఈ వీక్ ఎలిమినేట్ కాబోతున్నట్లు వార్తలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి. ఈవారం నామినేషన్స్ లో ఉన్న వారిలో రోహిణికి మాత్రమే తక్కువ ఓట్లొచ్చాయి. ఎందుకంటే ఈ సీజన్లో వైల్డ్ కార్డు ద్వారా అడుగుపెట్టినా, ఇప్పటివరకు ఈమె నామినేషన్స్ లోకి రాలేదు. దీంతో ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చేసరికి ఓట్లు కూడా పెద్దగా పడడం లేదు. దీంతో ఈవారం ఎలిమినేట్ కాబోతుందని సమాచారం.
ఇకపోతే టక్ టకా టక్ అనే టాస్క్ లో నిఖిల్.. ప్రేరణతో పాటు రోహిణి పాల్గొన్నారు. విష్ణుప్రియ తన ప్లేస్ ను కూడా త్యాగం చేసింది. ఈ టాస్క్ లో నిఖిల్ రోహిణీలను ఓడించి, ప్రేరణ ఓట్లు అప్పీల్ చేసే ఛాన్స్ కూడా కొట్టేసింది. ఇక దీన్ని బట్టి చూస్తే బిగ్ బాస్ హిస్టరీలో ఫస్ట్ ఫిమేల్ విన్నర్ గా నిలవాలని ఉందని, మీరు ఓట్లు వేసే సపోర్ట్ చేస్తే.. ఆ కలను నెరవేర్చుకుంటానని అందర్నీ రిక్వెస్ట్ చేసింది ప్రేరణ. మరి ప్రేరణ రిక్వెస్ట్ ను ఏ మేరకు ఆడియన్స్ సఫలం చేస్తారో చూడాలి.