Brahmamudi serial today Episode: కావ్య కోపంగా ఇంటికి వచ్చి అపర్ణను మా ఇంట్లో ఉండొద్దని మీ ఇంటికి వెళ్లమని చెప్తుంది. దీంతో అపర్ణ.. ఏంటి కనకం నీ కూతురు నన్ను ఇంట్లోంచి గెంటివేసేలా ఉంది అంటుంది. నేను కలగజేసుకుంటే నా ఇంట్లోంచి నన్నే గెంటివేసేలా ఉందని కనకం అంటుంది. నా మాట విని మామయ్యగారికి ఫోన్ చేసి ఈ విడాకుల విషయం వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పండి అని కావ్య చెప్పగానే అపర్ణ కోపంగా ఇంక నువ్వు ఆపు ఏం చేస్తున్నానో నాకు క్లారిటీ ఉంది. అంతా నేను చూసుకుంటాను అని వెళ్లిపోతుంది. కనకం వెళ్లిపోతుంటే.. కావ్య తిడుతుంది. విడాకులు తీసుకోమని అత్తయ్యకు సలహా ఇస్తావా..? అంటూ వెళ్లిపోతుంది.
తన ఫ్యామిలీ ఫోటో చూస్తూ రాజ్ అపర్ణ పంపిన విడాకుల నోటీసు గురించి ఆలోచిస్తూ.. నేను బతికి ఉండగా మిమ్మల్ని విడిపోనివ్వను.. ఈ కుటుంబం ముక్కలు కానివ్వను అనుకుంటాడు. ఇంతలో ఎవరో ఫోన్ చేయగానే.. పేపర్స్ రెడీ చేశారా..? రేపు ఉదయం వరకు అన్ని రెడీ చేసి పంపించండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. కావ్య పూజ చేసి అపర్ణ ఆశీస్సులు తీసుకుంటుంది. రాజ్‌కు నీకు దూరం పోయి ఇద్దరూ హ్యాపీగా కలిసి ఉండాలని.. గంపెడు పిల్లలను కని పెట్టాలని దీవిస్తున్నాను అంటుంది అపర్ణ. ఇంతలో రాజ్ పేపర్స్ తీసుకుని కనకం ఇంటికి వస్తాడు. రాజ్‌ను చూసిన అపర్ణ చూశావా..? వాళ్ల నాన్నకు నోటీసులు పంపించగానే రాజ్ దిగి వస్తున్నాడు అంటుంది.
ఆయన ముఖం చూస్తుంటే దిగి వచ్చినట్టు లేడు.. ఉగ్రరూపం కనిపిస్తుంది అంటుంది కావ్య. లోపలికి వచ్చిన రాజ్‌ను అపర్ణ ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. నేను ఎందుకు వచ్చానో నీకు తెలియదా..? అంటాడు రాజ్. ఎందుకు నీకూ తెలియదా..? సంస్కారంతో పాటు చదువు కూడా మర్చిపోయావా..? చదువుకోలేదా..? అని అపర్ణ అడుగుతుంది. దీంతో చదువుకున్నాను.. ఆ పేపర్స్ లో ఏముందో ఆ పేపర్స్ పంపించడం వెనక అంతరార్థం అంతా అర్థం చేసుకుని వచ్చాను అంటాడు రాజ్. నువ్వేం అర్థం చేసుకున్నావో నాకు అర్థం కాలేదు అంటుంది అపర్ణ. ఈ పేపర్స్ చూస్తే అందరికీ అర్థం అవుతుంది అంటాడు రాజ్.
ఏంటవి నేను మీ నాన్నకు పంపించిన పేపర్సా..? అని అపర్ణ అడగ్గానే కాదు నేను కళావతికి ఇవ్వడానికి తీసుకొచ్చిన పేపర్స్.. అంటాడు రాజ్. ఏంటా పేపర్స్ అని కావ్య అడగ్గానే.. మన విడాకుల పేపర్స్ అని రాజ్ చెప్తాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. అపర్ణ కోపంగా రాజ్‌ను తిడుతుంది. నువ్వు ఇక్కడ ఉండి కాన్సర్ కనకం మాటలు విని.. ఈ కళావతి డైరెక్షన్ లో నా మీద ఏదో పెద్ద అస్త్రం వదిలిన అనుకుంటున్నావు కానీ తిరుగులేని అస్త్రంలో వచ్చాను. ఇన్ని అనర్థాలకు మూలమైన ఈ కళావతికి విడాకులు ఇచ్చి శాశ్వతంగా దూరం చేసుకోవాలనే వచ్చాను అంటాడు. ఏ కోడలి కోసమైతే నువ్వు ఇంత దూరం వచ్చావో ఆ కోరిక నీ జీవితంలో నెరవేరదు అంటూ విడాకుల పేపర్స్ కావ్య చేతిలో పెట్టి వెళ్లిపోతుంటే…
సీతారామయ్య వచ్చి రాజ్‌ను కొడతాడు. సమయం ఇస్తున్నావా..? ఎవరికి ఇస్తున్నావురా.. దేనికి ఇస్తున్నావురా..? దిగజారిపోయిన నీ వ్యక్తిత్వానికి ఇంకా సమయం ఇస్తున్నావా..? మాయమైపోయిన నైతిక విలువలను వెతుక్కోవడానికా..? అంటూ తిడతాడు. రాజ్ షాకింగ్ గా చూస్తుండి పోతాడు. నీ కోసం నీ జీవితం కోసం మీ అమ్మ ఇక్కడ అజ్ఞాత వాసం చేస్తుంటే.. నవ్వు ఇంత దిగజారిపోతావా..? అంటూ నిలదీస్తాడు. నీ సంస్కారం.. నీ చదువు ఏమైపోయాయిరా..? నా వంశంలో నీలాంటి ఒక భ్రష్టుడు పుడతాడని అసలు ఊహించలేదు అంటాడు. ఇంతలో ఇందిరాదేవి.. అరేయ్ అసలు నువ్వు కావ్యను ఎందుకు వద్దనుకుంటున్నావు. ఒక్క కారణం చెప్పరా.. ఒక్క తప్పు చెప్పరా..? అని అడుగుతుంది.
దాని కళ్లలోకి సూటిగా చూసి చెప్పరా… ఏం తప్పు చేసిందిరా అది. ఏం పాపం చేసిందిరా అది. ఏం ద్రోహం చేసిందిరా అది. అంటూ రాజ్‌ను ప్రశ్నిస్తుంది. అరేయ్ నట్టింట్లో నిలబడి చెప్తున్నాను. కావ్య నాకు దేవుడిచ్చిన మనవరాలురా.. దుగ్గిరాల ఇంట్లో దీపం పెట్టడానికి వచ్చిన శ్రీమహాలక్ష్మీరా అది. నువ్వు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా.. దుగ్గిరాల ఇంట్లో కోడలిగా నా వారసురాలిగా ఉంటుంది అని చెప్తాడు సీతారామయ్య. రాజ్ అలిగి వెళ్లిపోతాడు. కనకం, మూర్తి ఏడుస్తూ సీతారామయ్యకు మొక్కుతారు. ఇప్పుడు మేం మా కష్టం ఎవరికి చెప్పుకోవాలని బాధపడుతుంటే మీరు సాక్ష్యాత్తు ఆది దంపతులలాగే మీరు దిగొచ్చినట్టు అనిపిస్తుంది.
ఆ దేవతామూర్తుల్లో ఉండే దైవత్వం మీలో కనిపిస్తుంది అంటాడు మూర్తి. దీంతో కావ్యను ఇంటికి రమ్మని ఇందిరాదేవి పిలుస్తుంది. ఇంకా నువ్వు ఇక్కడే ఉంటే ఆ ఇల్లు ముక్కలైపోతుంది. ఎవరికి వారే చెల్లాచెదురు అవుతుంది. నమ్మకంతో రా నీ నమ్మకాన్ని మేమందరం నిలబెడతాము అంటూ భరోసా ఇస్తుంది. సీతారామయ్య కూడా కావ్యను రమ్మని కావాలంటే నేను నీ కాళ్లు పట్టుకుంటాను అంటాడు. దీంతో కావ్య ఏడుస్తూ అయ్యో మీరు అలా మాట్లాడకండి తాతయ్య.. నా సంస్కారం ముందు నేను చాలా చిన్నదాన్ని.. మీరు ఇచ్చిన ఈ స్ఫూర్తితో నా కాపురం నిలబెట్టుకోవడానికి తప్పకుండా వస్తాను అని చెప్తుంది కావ్య. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?