Gundeninda GudiGantalu Today episode December 4th : నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రభావతి, మీనాక్షిలు ఇంట్లో భోజనం చేసి రవిని కలవడానికి బయటకు వెళ్తారు. రవికి రమ్మని ఫోన్ చేస్తారు. రవి అక్కడకు వస్తాడు. ఈ సమయంలో ప్రభావతి ఎక్కడలేని ప్రేమను రవిపై ఓలకపోస్తోంది. శృతి, నువ్వు ఇద్దరి కలిసి ఇంటికి రమ్మని రిక్వెస్ట్ చేస్తుంది. తాను ఇంట్లో వారితో మాట్లాడుతానని హామీ ఇస్తుంది. రవి సంతోషపడుతాడు. బాలు ఇంట్లోకి రానివ్వడని, గతంలో తనపై రెండుసార్లు దాడి చేశాడని చెప్తాడు. రవి వదినకు నా పెళ్లికి ఏ సంబంధం లేదని చెప్తాడు. కామాక్షి మీనాను ఎప్పుడు నిందించడం మీ అమ్మకు అలవాటే కదా అని అంటుంది. మీనా ఫైనాన్సర్ ను కలవడానికి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంతలోనే ఫైనాన్సర్ బాడీగార్డ్స్ వచ్చి.. వాస్తవానికి అన్నకు నిన్ను కలవడం ఇష్టం లేదని, నువ్వు వెయిట్ చేస్తా అంటే ఉందని అన్నాడు. కానీ, ఇక్కడ ఉండి ప్రయోజనం లేదని వారు చెబుతారు. ఆ విషయాన్నీ మరోసారి సేటుకు చెప్తారు. కానీ సేటు కలవనని విసుక్కుంటాడు. అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మీనా ఎంతగా చెప్పినా వినిపించుకోడు. బాలు ఇంటికి వెళ్ళగానే తన తండ్రి కూడా భోజనం చేయడానికి కూర్చుంటాడు. బాలు, తన తండ్రి ఇద్దరూ కలిసి భోజనం చేయాలని, సిద్దమవుతారు. అంతలోనే సాంబార్లో బల్లి పడ్డ విషయాన్ని బాలు గమనిస్తాడు. వెంటనే దగ్గర నుండి ప్లేటు లాగేసుకుని సాంబార్లో బల్లి పడిందని కోప్పాడుతాడు. ప్రభావతి ఇంటికి చేరుకుంటుంది.. ఎక్కడికి వెళ్ళావు అసలు అంటే కామాక్షితో బయటకు వెళ్లాను అంటుంది. మీనా పై మరో నింద వేస్తుంది. అంతలోనే మీనా కూడా ఇంటికి చేరుతుంది. ప్రభావతి బాలు మీనా పై అరుస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఇంట్లో ఎవరు లేకుండా వెళ్లారు. బాగోలేని మనిషిని వదిలేసి వెళ్లారు అని బాలు ప్రభావతిని, కామాక్షిని అరుస్తాడు. ఇక అప్పుడే మీనా ఇంట్లోకి వస్తుంది. మీనా ఇంటికి రాగానే సాంబార్ లో ఏం వేశావని బాలు నిలదీస్తాడు. తాను సాంబార్లో ఏం వెయ్యలేదని, వంట చేసి అన్ని జాగ్రత్తగా మూతలు పెట్టి, బయటకు వెళ్లాలని చెబుతోంది. కానీ, మీనా చెప్పిన మాటలు బాలు పట్టించుకోకుండా తిడతాడు. ఈ సమయంలో ప్రభావతి మరింత రెచ్చిపోతుంది. ఇంట్లో వారందరినీ చంపాలని ప్రయత్నిస్తున్నావా? అంటూ మీనాను నిందిస్తుంది. అదే సాంబార్ ను మనోజ్ తీసుకువెళ్లాడని, వాడు తిన్నాడా ఏమో అని కంగారు కంగారుగా ప్రభావతి ఫోన్ చేయడానికి రూమ్ లోకి వెళుతుంది. అప్పుడే కామాక్షి ఆ ఫోన్ లాక్కొని అసలు విషయం చెప్తుంది. మనోజ్ బాక్స్ కట్టుకపోయినప్పుడు బల్లి పడలేదు మనం తిన్నప్పుడు కూడా బల్లి పడలేదు సాంబార్ మీద మూత తీసింది ఎవరో ఒకసారి ఆలోచించు అనేసి ప్రభావతికి చెప్తుంది. ఈ విషయం బాలు దగ్గర చెప్పి ఉంటే నీకు ఏమీ ఏదో ఆలోచించు అందుకే అక్కడ నీ పరువు పోగొట్టుకున్న ఇక్కడ చెప్తున్నాననేసి కామాక్షి అంటుంది.
ప్రభావతి తన తప్పు తెలుసుకుంటుంది. కానీ, మీనా ఇంట్లో ఉండి ఉంటే.. బల్లి పడి ఉండేది కాదు కదా అంటూ మళ్ళీ మీనాని నిందించడం ప్రారంభిస్తుంది. అసలు విషయం బాలుకి చెప్తానంటూ మీనాక్షి.. ప్రభావతిని భయపెట్టిస్తుంది. వాటికి ఈ విషయం తెలిస్తే నన్ను చంపేస్తాడంటూ భయపడుతుంది ప్రభావతి. తనని కాదని వెళ్ళిపోయిన శృతి పై రివేంజ్ తీర్చుకోవాలని చూస్తాడు సంజు.. రవి లేని సమయంలో ఇంట్లోకి దూరి శృతి పై హత్య ప్రయత్నం చేద్దామని ట్రై చేస్తాడు. మత్తుమందును తన కర్చీఫ్ లో చల్లుకొని.. శృతి దగ్గరికి వెళ్తాడు. అంతలోని సడన్ గా కాలింగ్ బెల్ మోగుతుంది. దీంతో ఒక్కసారిగా శృతి లేవడంతో సంజు ప్లాన్ ఫెయిల్ అవుతుంది. రవికి కనిపించకుండా దాచుకుంటాడు. రవి, శృతిలు లోపలికి వెళ్ళగానే సంజు బయటకు వెళ్లడానికి ప్రయత్నిస్తాడు. మొత్తానికి ఎలాగోలా ఎవరికీ కనిపించకుండా పారిపోతాడు. ఈసారి మాత్రం శృతిని వదిలేది లేదని మనసులో అనుకుంటాడు.
ఇక శృతికి గుడ్ న్యూస్ అంటూ రవి తన తల్లి వచ్చినా విషయాన్ని చెబుతాడు. తనను కలవడానికి తన తల్లి వచ్చిందని, త్వరలోనే ఇంట్లో మాట్లాడి తీసుకువెళ్తానని హామీ ఇచ్చిందని రవి సంతోషపడతాడు. దీంతో శృతి కూడా చాలా సంతోషపడుతుంది. కానీ, రవిని ఆటపట్టించడానికి.. మీరు మీరు అంతా ఒకటే అయిపోయారు. నన్ను విడిచి పెడతావా? అంటూ ఫీల్ అవుతుంది. దీంతో రవి అలుగుతాడు. ముందు ఆ సీరియల్స్ కు డబ్బింగ్ చెప్పడం మానేయ్ లేనిపోని ఆలోచనలు వస్తున్నాయంటూ సీరియస్ అవుతాడు. ఇక ఆట పట్టించాలని అలా చేసాను అని శృతి అంటుంది. ఇద్దరు ఇంట్లో వాళ్ళు రమ్మన్నారని సంబరపడిపోతారు.
తరువాత రోజు ఉదయం మీనా త్వరగా లేచి.. వంటలన్నీ పూర్తి చేస్తుంది. ప్రభావతి వచ్చి తనకు కాఫీ కావాలని అడుగుతుంది. కాఫీ ఎప్పుడో చేసి అక్కడ పెట్టానని అంటుంది మీనా. వంటలను చూసి తొందరగానే ప్రిపేర్ చేశావ్.. ఈరోజు కూరల్లో ఏం వేసావ్ అంటూ మీనాను ప్రభావతి హేళన చేస్తుంది. దీంతో మీనాక్షికి మండుతుంది.. ఇంటిల్లిపాదిని పిలిచి.. తాను చేసిన కూరలను చూపిస్తుంది. ఇంట్లో ఒక మామ తప్ప నన్ను ఎవరు అర్థం చేసుకోలేదని బాధపడుతుంది. నేను బయటకు వెళ్తున్నాను అనేసి అనగానే ప్రభావతి ఎక్కడికి వెళ్తున్నావ్ రోజు ఇదే పనా అని అడుగుతుంది. కార్తీక మాసం కదా గుడికి వెళ్తే పూజారి మంచిదని చెప్పారు అందుకే వెళ్తున్నా అనేసి అంటుంది. దానికి ప్రభావతి కౌంటర్ వేస్తుంది. రోజు కూడికెళ్తున్నావ్ ఏం కోరుకుంటున్నావు అని రోహిణి ప్రభావతి అడుగుతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో బాలు దగ్గర కారు లేదన్న విషయం ఇంట్లో చెప్పేస్తుంది రోహిణి. మీనా నిజం చెప్పబోతుంటే బాలు ఆపుతాడు. మరి ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూడాలి..