BigTV English
Advertisement

Bigg Boss 8 Telugu: నిఖిల్ కోసమే ఈ త్యాగం.. ఎలిమినేట్ అవ్వడంలో బాధ లేదంటున్న అభయ్

Bigg Boss 8 Telugu: నిఖిల్ కోసమే ఈ త్యాగం.. ఎలిమినేట్ అవ్వడంలో బాధ లేదంటున్న అభయ్

Bigg Boss 8 Telugu Elimination: బిగ్ బాస్ సీజన్ 8లో మూడో ఎలిమినేషన్ ముగిసింది. మొత్తానికి అభయ్ నవీన్ బయటికి వచ్చేశాడు. సినిమాల్లో కామెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అలరించిన అభయ్.. బయట ఎలా ఉంటాడో చాలామంది ప్రేక్షకులకు తెలియదు. కానీ బిగ్ బాస్ వల్ల అసలు అభయ్ నవీన్ ఎవరో చాలామందికి తెలిసింది. టాస్కుల్లో బాగా ఆడుతూ మొదటి రెండువారాలు మంచి ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్నాడు అభయ్. కానీ మూడో వారంలో మొత్తం మారిపోయింది. తన ప్రవర్తన, తన మాటలు.. చాలామంది ప్రేక్షకులకు నచ్చలేదు. అందుకే బయటికొచ్చేశాడు. వెళ్తూ వెళ్తూ తన ఎలిమినేషన్ గురించి తాను ఎలా ఫీల్ అవుతున్నాడో చెప్పే వెళ్లాడు అభయ్.


సెల్ఫ్ నామినేషన్

బిగ్ బాస్ సీజన్ 8లో మూడోవారం చీఫ్‌గా ఎంపికయ్యాడు అభయ్ నవీన్. హౌస్‌లోని కంటెస్టెంట్స్ అంతా కలిసి తనను చీఫ్ చేశారు. కానీ చీఫ్ అయినా తర్వాత అభయ్ ప్రవర్తన చాలా మారిపోయింది. వెంటనే అందరినీ శాసించడం మొదలుపెట్టాడు. ఆఖరికి బిగ్ బాస్ రూల్స్‌ను కూడా ఎదిరించి మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇక నామినేషన్స్ సమయానికి నిఖిల్, అభయ్ చీఫ్స్‌గా ఉండగా ఇద్దరిలో ఒకరు నామినేట్ అవ్వాలని, ఆ నామినేట్ అయ్యేది ఎవరో అని కూడా వారినే డిసైడ్ చేసుకోమని బిగ్ బాస్ తెలిపారు. దీంతో అభయ్ వెంటనే తనను తాను నామినేట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆ సెల్ఫ్ నామినేషన్ వల్ల బయట ఉన్నాడు. దానిపై బిగ్ బాస్ స్టేజ్‌పై స్పందించాడు అభయ్.


Also Read: ‘హగ్ బాస్’పై నాగార్జున స్పందన.. ఇంకొకసారి ఇలా చేస్తే బయటికి పంపిస్తానంటూ అతడికి వార్నింగ్

మేకర్స్ ప్లాన్

ఒకరోజు అభయ్ తండ్రికి సంబంధించిన వాచ్, నిఖిల్ తండ్రికి సంబంధించిన షర్ట్.. బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చాయి. ఆ రెండిటిలో ఏదో ఒక్కటే ఒక కంటెస్టెంట్‌కు దక్కే ఛాన్స్ ఉంది. దీంతో నిఖిల్ త్యాగం చేసి అభయ్‌కు తన తండ్రి వాచ్ దక్కేలా చేశాడు. అయితే ఆరోజు నిఖిల్ చేసిన సాయాన్ని గుర్తుపెట్టుకొని తనకు కూడా ఏదైనా చేయాలని అనుకున్నానని, అందుకే సెల్ఫ్ నామినేట్ చేసుకున్నానని తెలిపాడు అభయ్. మరి దానికి ఏం బాధ లేదా అని నాగార్జున అడగగా.. తాను చేసిన తప్పుల వల్ల బయట ఉన్నానని, సెల్ఫ్ నామినేట్ చేసుకోవడం వల్ల కాదని, నిఖిల్ కోసం త్యాగం చేయడం హ్యాపీ అని వివరించాడు. మొత్తానిక తను బిగ్ బాస్ మీద చేసిన నెగిటివ్ కామెంట్స్ వల్లే మేకర్స్ తనను బయటికి పంపించేశారని చాలామంది ప్రేక్షకులు అనుకుంటున్నారు.

వారికి సలహాలు

ఫైనల్‌గా ఇంటికి వెళ్లిపోయే ముందు హౌస్‌లో ముగ్గురికి బ్లాక్ రోజ్, ముగ్గురికి రెడ్ రోజ్ ఇవ్వాలని అభయ్‌కు చెప్పారు నాగార్జున. ముందుగా బ్లాక్ రోజ్ విష్ణుప్రియాకు ఇచ్చాడు. కొన్ని పదాలు తెలియకుండా అనేసి సారీ చెప్తుందని, ఆ అలవాటు మార్చుకోమని సలహా ఇచ్చాడు. మణికంఠకు కూడా బ్లాక్ రోజ్ ఇచ్చి అనవసరమైన గొడవలకు దూరంగా ఉండమన్నాడు. పృథ్వికి బ్లాక్ రోజ్ ఇచ్చి తన కోపాన్ని ఇతరులు వేలెత్తి చూపించొద్దని మార్చుకోమని అన్నాడు. ఇక రెడ్ రోజ్ విషయానికొస్తే.. ముందుగా దానిని నిఖిల్‌కు ఇచ్చి కొన్ని రోజుల్లోనే మంచి బాండింగ్ క్రియేట్ అయ్యిందని ఎమోషనల్ అయ్యాడు. సీతను కూడా బయటకు వచ్చాక కూడా చెల్లిలాగా చూస్తానని రాఖీ కట్టించుకున్నానని మాటిచ్చాడు. నబీల్, సోనియాలకు కూడా మంచిగా ఆడండి అంటూ రెడ్ రోజ్‌లు ఇచ్చాడు అభయ్.

Related News

Bigg Boss 9 : ఎంత నటిస్తావమ్మా? అప్పుడు పురుగుల చూసావు ఇప్పుడు ఉన్నాను అంటున్నావ్

Bigg Boss 9: అది సుమన్ శెట్టి అంటే, అందుకే ఇంత మంది ఇష్టపడుతున్నారు

Bigg Boss 9: మరోసారి తన సెల్ఫిష్ బిహేవర్ బయట పెట్టిన ఇమ్మానియేల్

Bigg Boss 9 Telugu : ముద్దుబిడ్డ తనూజాకు బిగ్ బాస్ స్పెషల్ ఆఫర్… కళ్యాణ్ బలి… ఇదేం తుప్పాస్ గేమ్ బాసూ ?

Bigg Boss 9 Telugu Day 62 : ఇమ్మూ, రీతూ ఇంత సెల్ఫిషా ? కంటెస్టెంట్స్ ఎమోషన్స్ తో ఆటాడుకున్న నాగ్… రామూ షాకింగ్ ఎలిమినేషన్

Bigg Boss Tamil: ప్రాంక్‌ పేరుతో కొట్టుకున్న కంటెస్టెంట్స్‌.. ఫైర్‌ అయిన హోస్ట్‌!

Bigg Boss 9 Elimination: డబుల్‌ ట్విస్ట్‌, డబుల్‌ ఎలిమినేషన్‌.. రాము రాథోడ్‌ అవుట్‌!

Bigg Boss 9 Promo : బిగ్ బాస్ హౌస్ లో ఆర్జీవి, అందరూ అమ్మాయిలే కావాలి అంటూ..

Big Stories

×