BigTV English
Advertisement

Bigg Boss 8 Telugu: ‘హగ్ బాస్’పై నాగార్జున స్పందన.. ఇంకొకసారి ఇలా చేస్తే బయటికి పంపిస్తానంటూ అతడికి వార్నింగ్

Bigg Boss 8 Telugu: ‘హగ్ బాస్’పై నాగార్జున స్పందన.. ఇంకొకసారి ఇలా చేస్తే బయటికి పంపిస్తానంటూ అతడికి వార్నింగ్

Bigg Boss 8 Telugu Latest Updates: బిగ్ బాస్ సీజన్ 8 చూడడానికి ఫ్యామిలీ ఆడియన్స్ కాస్త అసౌకర్యంగా ఫీల్ అవుతున్నారు. దానికి కంటెస్టెంట్స్ ప్రవర్తనే కారణం. బాధ కలిగినప్పుడు, ఏడుస్తున్నప్పుడు దగ్గర తీసుకొని ఓదార్చడం వేరు. కానీ అనవసరంగా హగ్గులు, కిస్సులు అంటూ పలుమార్లు పలువురి కంటెస్టెంట్స్ ప్రవర్తన శృతిమించుతోంది. ప్రస్తుతం బిగ్ బాస్ 8కు సంబంధించిన సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ హగ్గుల గురించే మీమ్స్ కనిపిస్తున్నాయి. అందుకే ఈసారి సీజన్ చూసిన తర్వాత బిగ్ బాస్ కాస్త హగ్ బాస్ అయిపోయిందని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. దానిపై ఫైనల్‌గా నాగార్జున స్పందించాడు.


హగ్ బాస్

ముందుగా నిఖిల్, సోనియా మధ్య కెమిస్ట్రీతో ప్రేక్షకులు అసౌకర్యంగా ఫీల్ అవ్వడం మొదలుపెట్టారు. సోనియా కాస్త బాధలో ఉందని, ఎక్కువ ఆలోచిస్తుందని అనిపిస్తే చాలు.. అభయ్, పృథ్వి, నిఖిల్ తనను హగ్ చేయడానికి ముందుకొచ్చేస్తున్నారు. సరే వీళ్లు ఇంతే అని ఆడియన్స్ కూడా ఫిక్స్ అయిపోయారు. కానీ అనూహ్యంగా మణికంఠ కూడా అదే కేటగిరిలోకి వెళ్లడం చాలామంది ప్రేక్షకులు నమ్మలేకపోతున్నారు. గతవారం ప్రసారమయిన ఎపిసోడ్‌లో తాను బాధగా ఉన్నానని సోనియాను వెళ్లి నేరుగా హగ్ అడిగాడు. ఆ తర్వాత ప్రేరణ సారీ చెప్పడానికి వస్తే తనను హగ్ చేసుకొని అస్సలు వదల్లేదు. దీంతో నాగ మణికంఠ ప్రవర్తనపై నాగార్జున పర్సనల్‌గా స్పందించక తప్పలేదు.


Also Read: ఆర్జీవీ పార్టీలో తాగిపడిపోయిన ‘బిగ్ బాస్’ సోనియా.. ఆ రోజు ఏం జరిగింది?

అమ్మాయిల ఆట అదుర్స్

శనివారం ప్రసారమయిన ఎపిసోడ్‌లో వారం రోజుల్లో కంటెస్టెంట్స్ చేసిన తప్పులను వారితో స్పష్టంగా చర్చించారు నాగార్జున. బిగ్ బాస్‌ను ఎదిరించినందుకు అభయ్‌కు వార్నింగ్ ఇచ్చారు. తనను హౌస్ నుండి పంపించేస్తానన్నారు. కానీ మొత్తానికి హౌస్‌మేట్స్ అంతా కలిసి రిక్వెస్ట్ చేయడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. అలాగే అమ్మాయిలంతా కలిసి చాలా బాగా ఆడారని చెప్తూ ప్రైజ్ మనీలో మరో రూ.6 లక్షలు యాడ్ చేశారు. ప్రేరణ, విష్ణుప్రియా మధ్య మనస్పర్థలను తీర్చే ప్రయత్నం చేశారు. ఇక మణికంఠ విషయానికి వచ్చేసరికి మాత్రం తనతో సెపరేట్‌గా మాట్లాడాలనే ఉద్ధేశ్యంతో కన్ఫెషన్ రూమ్‌కు రమ్మన్నారు.

సరిహద్దులు లేవు

నాగ మణికంఠ కన్పెషన్ రూమ్‌లోకి రాగానే తనకు ఒక వీడియో చూపించాడు. నామినేషన్స్ అయిన తర్వాత యష్మీ కోపంగా ఉండడంతో తనను వెళ్లి హగ్ చేసుకున్నాడు మణి. తను వదలమని చెప్తున్నా వినకుండా అలాగే పట్టుకున్నాడు. దీంతో యష్మీ వెళ్లి పృథ్వితో కంఫర్ట్‌గా లేకపోయినా వచ్చి హగ్ చేసుకున్నాడని చెప్పింది. ఈ వీడియో చూసిన తర్వాత తను చేసిన తప్పేంటో మణికి అర్థమయ్యింది. తను ఇంతకాలం మనుషుల మధ్య ఉండలేదని, ఒకేసారి ఇంతమంది దగ్గరయ్యేసరికి తన ఎమోషన్స్‌కు హద్దులు ఉండడం లేదని అన్నాడు. అయినా ఇప్పటినుండి అలా జరగదని మాటిచ్చాడు. అయినా నాగార్జున మాత్రం అవతలి వాళ్ల హద్దులను కూడా గౌరవించాలని, మళ్లీ ఇలా జరిగితే బయటికి పంపించేస్తానని వార్నింగ్ ఇచ్చారు. అయితే ఇంకా పలువురు కంటెస్టెంట్స్‌కు ఇలాగే వార్నింగ్ ఇస్తే బాగుంటుందని ప్రేక్షకులు ఫీలవుతున్నారు.

Related News

Bigg Boss 9: చివరిలో చేజారిన తనూజ కెప్టెన్సీ.. అతడే కొత్త కెప్టెన్!

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ లో ఉండటం ఆ కంటెస్టెంట్ కు ఇష్టం లేదా..? ఈ వారం ఇతనే ఎలిమినేట్..?

Bigg Boss 9 Promo: రీతూ Vs దివ్య.. చిచ్చుపెట్టిన సాయి!

Bigg Boss 9 Telugu : గౌరవ్ కు గట్టిదెబ్బ… ఇదేందయ్యా ఇదీ… కట్టప్ప కన్నా తనూజా – ఇమ్మాన్యుయేల్ వెన్నుపోటే దారుణం

Bigg Boss 9 Telugu Day 60 : ఇమ్మూను బోల్తా కొట్టించిన రీతూ… తనూజా వల్ల గౌరవ్ కు తీరని అన్యాయం… దివ్య దిక్కుమాలిన ప్లాన్ సక్సెస్

Bigg Boss 9 Madhuri: వాళ్లు రెమ్యునరేషన్‌ ఇచ్చేదేంటి.. నాకే నెలకు కోటి వస్తుంది.. దివ్వెల మాధురి

Bigg Boss 9 Promo: కెప్టెన్సీ వార్‌.. హీటెక్కిన ఆరేంజ్‌ టీం డిస్కషన్‌, తగ్గేదే లే అంటున్న గౌరవ్!

Bigg Boss 9 Promo: సీక్రెట్ టాస్క్.. అడ్డంగా బుక్కైన ఇమ్మూ !

Big Stories

×