E-Paper
Advertisement

Bigg Boss Buzz: అతను మేల్ చంద్రముఖి, ఆమెకు గేమ్ ఆడడం రాదు, వాళ్లేం జ్ఞానులు కాదు.. అభయ్ నవీన్ వ్యాఖ్యలు

Bigg Boss Buzz: అతను మేల్ చంద్రముఖి, ఆమెకు గేమ్ ఆడడం రాదు, వాళ్లేం జ్ఞానులు కాదు.. అభయ్ నవీన్ వ్యాఖ్యలు
Advertisement

Bigg Boss Buzz Promo: బిగ్ బాస్ సీజన్ 8లో మూడోవారం అభయ్ నవీన్ ఎలిమినేట్ అయిపోయాడు. బిగ్ బాస్‌పై నెగిటివ్ వ్యాఖ్యలు చేయడం వల్లే తనను మేకర్స్ ఎలిమినేట్ చేశారని చాలామంది ప్రేక్షకులు అనుకుంటున్నారు. అది మాత్రమే కాకుండా చీఫ్ అయిన తర్వాత అభయ్‌లో వచ్చిన మార్పులు కూడా తనపై ఆడియన్స్‌లో నెగిటివ్ ఒపీనియన్ వచ్చేలా చేశాయి. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు, ఎలిమినేట్ అయ్యి స్టేజ్‌పైకి వచ్చేసిన తర్వాత అందరి గురించి మంచిగా మాట్లాడిన అభయ్.. బిగ్ బాస్ బజ్‌లోకి ఎంటర్ అవ్వగానే ఇతర కంటెస్టెంట్స్‌పై తనకు ఉన్న అసలు అభిప్రాయాలను బయటపెట్టాడు. ఆ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది.

తనకే తెలియదు

Advertisement

బిగ్ బాస్ ప్రోమో మొదలవ్వగానే ముందుగా సోనియా ఫోటోతో ఉన్న బెలూన్‌ను పగలగొట్టి ‘‘అన్నీ తనకే తెలుసు అనుకుంటుంది’’ అంటూ తనపై అభిప్రాయం వ్యక్తం చేశాడు అభయ్ నవీన్. ‘‘తనలో ఉన్న లాయర్ అప్పుడప్పుడు బయటికి వస్తుంటుందా’’ అని అర్జున్ అడగగా.. ‘‘అప్పుడప్పుడు కాదు చాలాసార్లు వస్తుంటుంది’’ అని క్లారిటీ ఇచ్చాడు. సీత గురించి చెప్తూ.. తను చాలా ఎమోషనల్, అది పక్కన పెడితే కచ్చితంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. విష్ణుప్రియా గురించి మాట్లాడుతూ.. తను స్ట్రాంగా, వీకా అని తనకే తెలియదని వ్యంగ్యంగా ఉన్నాడు. యష్మీ గురించి చెప్తూ.. ‘‘గేమ్ జోన్‌లో ఆడదామనే ఆలోచనలో ఉంటుంది కానీ ఆడదు’’ అని అన్నాడు అభయ్.

Also Read: నిఖిల్ కోసమే ఈ త్యాగం.. ఎలిమినేట్ అవ్వడంలో బాధ లేదంటున్న అభయ్

Advertisement

ఆలోచన లేదు

పృథ్వి గురించి చెప్తూ.. ‘‘కొన్ని విషయాల్లో ఒక్క క్షణం కూడా ఆలోచించడు’’ అని చెప్పుకొచ్చాడు అభయ్ నవీన్. నిఖిల్ గురించి మాట్లాడుతూ.. ‘‘నేను వాడి అన్నగా వాడిని ఫైనల్‌లో చూడాలనుకుంటున్నాను’’ అంటూ మనసులోని మాటను బయటపెట్టాడు. నాగ మణికంఠకు ‘మేల్ చంద్రముఖి’ అంటూ ట్యాగ్ ఇచ్చాడు. ‘‘ఆ రకంగా ఫ్లిప్ అయ్యే క్యారెక్టర్‌ను నేను ఇప్పటివరకు చూడలేదు’’ అని అన్నాడు. ఇక కంటెస్టెంట్స్ గురించి మాట్లాడడం అయిపోయిన తర్వాత తన గురించి, తన ఆట గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు అభయ్. తన ఓవర్స్ కాన్ఫిడెన్స్ గురించి మాట్లాడుతూ.. ‘‘కొన్నిసార్లు అది నెగిటివ్ అవుతుంది, కొన్నిసార్లు పాజిటివ్ అవుతుంది’’ అని చెప్పాడు.

పదేళ్ల నుండి పరిచయం

ఎగ్స్ టాస్క్‌లో జరిగిందంతా గుర్తుచేసుకున్నాడు అభయ్.. ‘‘మణికంఠపైకి పృథ్వి వచ్చిన విధానం చూస్తే భయమేసింది’’ అనేశాడు. ఇక బిగ్ బాస్ గురించి తాను చేసిన వ్యాఖ్యల గురించి స్పందిస్తూ.. ‘‘లోపల ఉన్నవాళ్లు జ్ఞానులు కాదు. నేను అజ్ఞాని కాదు’’ అంటూ కంటెస్టెంట్స్‌పై డైరెక్ట్‌గా కౌంటర్ వేశాడు. ‘‘ఆడకుండా ఉండడం నీ స్ట్రాటజీనా? బిగ్ బాస్‌ను తిట్టడం నీ స్ట్రాటజీనా?’’ అని అర్జున్ అడిగాడు. ‘‘నాకు ఆ మనస్థత్వం ఉంటే వేరేలాగా ఉండేది’’ అంటూ సైలెంట్ అయిపోయాడు అభయ్. ఇక ఈ బిగ్ బాస్ ప్రోమోలో సోనియా.. అభయ్‌కు పదేళ్ల నుండి తెలుసు అనే విషయం బయటపడింది.

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×