E-Paper
Advertisement

Bigg Boss 8 Telugu : అప్పుడే మొదలెట్టేశారా?.. ఈ వారం ఆమె అవుట్..?

Bigg Boss 8 Telugu : అప్పుడే మొదలెట్టేశారా?.. ఈ వారం ఆమె అవుట్..?

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ 8 తెలుగు సీజన్ తొమ్మిది వారాలు పూర్తి చేసుకుంది.. తొమ్మిదో వారం అనూహ్యంగా నయని పావని హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. నయని పావని ఎలిమినేషన్‌తో హౌస్‌లో 12 మంది మాత్రమే మిగిలారు. గౌతమ్, నిఖిల్, యష్మీ, ప్రేరణ, పృథ్వీ, విష్ణు ప్రియ, హరితేజ, రోహిణి, నబీల్, గంగవ్వ, టేస్టీ తేజా, అవినాష్‌లు పదోవారంలోకి ఎంట్రీ ఇచ్చేశారు. ఇక ఉన్న వాళ్లలో గంగవ్వ ఉన్నా లేనట్టే.. ఆమెను ఊరికే ఉంచారు తప్పితే ఎందుకు ఆమె పనికిరాదు అనే మాటలను మూట కట్టుకుంది. ఇక ఈ వారం నామినేషన్స్ వాడి వేడిగా సాగాయి. 10 వ నామినేషన్స్ మొదలయ్యాయి.. గత వారంతో పోలిస్తే ఈ వారం నామినేషన్స్ లో హీట్ ఎక్కువైందని తెలుస్తుంది. ఇక వారం హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్తారో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం…

బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం నామినేషన్ లో గౌతమ్, నిఖిల్, ప్రేరణ, విష్ణు ప్రియ, పృథ్వీ, యష్మీ గౌడ, హరితేజ ఉన్నారు. వీరంతా ప్రతి వారం నామినేట్ అవుతూ వస్తున్నారు. అలాగే ఈ వారం కూడా పలు కారణాలతో నామినేట్ అయ్యారు. ఈవారం నామినేషన్స్ రొటీన్‌కి భిన్నంగా జరిగాయి. ప్రతి వారం ఒక్కో కంటెస్టెంట్ సరైన కారణాలతో ఇద్దరిద్దర్ని నామినేట్ చేయాల్సి ఉంది. అయితే సరైన కారణాలు అంటే.. బిగ్ బాస్ హౌస్‌లో పెద్ద బూతు కాబట్టి.. ప్రతి వారం పనికి మాలిన కారణాలతోనే నామినేట్ చేస్తున్నారు. వీకెండ్ ఎపిసోడ్ లో నాగ్ చెప్పే కారణాలే ఇక్కడ కూడా చెబుతూ నామినేట్ చేస్తారు. అందుకే ఎందుకు వచ్చిన పంచాయితీ అనుకున్నారేమో ఒకరు ఒకరినే నామినేట్ చెయ్యాలని చెప్పాడు బిగ్ బాస్..

ఈ వారం నామినేషన్స్ లో హరితేజ, ప్రేరణ మధ్య పెద్ద వార్ జరిగింది.. ఇక రెండో నామినేషన్ గౌతమ్ అండ్ నిఖిల్ మధ్య జరిగింది. అలాగే రోహిణి, పృథ్వి మధ్య కూడా పెద్ద యుద్ధమే జరిగింది. ఎటొచ్చీ ఈవారం డేంజర్ జోన్ అంటే.. హరితేజ, యష్మీలు. బిగ్ బాస్ హౌస్‌లోనే మోస్ట్ కన్నింగ్, ఫ్లిప్ కంటెస్టెంట్ అంటే యష్మీ.. గత 9 వారాలుగా తన కన్నింగ్ గేమ్‌తోనే నెట్టుకొస్తోంది యష్మీ. అయితే ఈవారం కూడా హరితేజ రూపంలో ఆమెకు అదృష్టం కలిసొచ్చేట్టు కనిపిస్తోంది.. గత వారం ఎలిమినేషన్ వరకు వెళ్లి సేవ్ అయ్యింది. ఇక ఈ వారం ఆమె అదృష్టం ఎలా ఉంటుందో చూడాలి.. అప్పుడే హరితేజ ఎలిమినేట్ అయ్యినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. గత వారం ఎలిమినేషన్‌లో నయనికి.. హరితేజకి ఓట్లలో పెద్దగా తేడానే లేదు. గౌతమ్‌తో అక్క మ్యాటర్‌తో నయని… వెనుకబడింది కానీ.. లేదంటే గత వారమే హరితేజ ఎలిమినేట్ కావాల్సింది. అయితే పదో వారంలో ఏదో అద్భుతం జరిగితే తప్ప.. హరితేజ ఎలిమినేషన్ నుంచి తప్పించుకోలేదు.. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి..

Related News

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

ట్రోలర్స్ ఇనయా దిమ్మతిరిగే కౌంటర్.. కాన్ఫిడెంట్ కు మెచ్చుకోవాల్సిందే..!

Bigg Boss Soniya: గిన్నీస్ బుక్ లో సోనియా కూతురికి చోటు.. ఏం చేసిందో తెలుసా..?

Demon Pawan : వివాదంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ డిమాన్.. ఆగని ట్రోల్స్..!

బిగ్ బాస్ నటితో సిరాజ్ డేటింగ్.. సంచలనం సృష్టిస్తున్న వీడియో!

Big Stories

×