Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు ఫైనల్స్‌కు ఇంకా ఒక్కవారమే సమయం ఉంది. అందుకే ప్రస్తుతం హౌస్‌లో ఉన్న ఏడుగురు కంటెస్టెంట్స్‌కు ఈ వారమంతా సేవ్ అవ్వడం చాలా ముఖ్యం. అందుకే ప్రతీ సీజన్‌లాగానే ఈ సీజన్‌లో కూడా ఆడియన్స్‌క ఓటు అప్పీల్ చేసే అవకాశాన్ని కంటెస్టెంట్స్‌కు కల్పించారు బిగ్ బాస్. దానికోసమే కంటెస్టెంట్స్ మధ్య పోటీలు మొదలయ్యాయి. ఇక గతవారం జరిగిన టాస్కుల్లో గెలిచి మొదటి ఫైనలిస్ట్ అవ్వడంతో అవినాష్ చాలా బిందాస్‌గా ఉన్నాడు. గతంలో కంటెస్టెంట్స్ చేసిన తప్పులను గుర్తుచేసుకొని మరీ వారిపై విరుచుకుపడుతున్నారు. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది.
నబీల్‌తో గొడవ
టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోక ముందు తను ఫైనలిస్ట్ అవ్వడం కోసం అవినాష్, రోహిణి కలిసి తనకు అవకాశం ఇచ్చారు. ఆ విషయాన్ని నబీల్ కూడా సపోర్ట్ చేశాడు. ముందుగా సపోర్ట్ చేసి తర్వాత తనకు అలా చేయడం నచ్చలేదని అన్నాడు. దీంతో నబీల్ అలా మాటలు మార్చడం కరెక్ట్ కాదంటూ తనపై సీరియస్ అయ్యాడు అవినాష్. అప్పుడెప్పుడో జరిగిపోయిన విషయాన్ని గుర్తుచేసి మరీ తనతో గొడవ పెట్టుకున్నాడు. ఇక అవినాష్ ఏం చేసినా సపోర్ట్ చేసే రోహిణి.. ఈ విషయంలో కూడా తనకు సపోర్ట్ చేస్తూ నబీల్‌పై సీరియస్ అయ్యింది. ఇద్దరూ కలిసి నబీల్‌ను టార్గెట్ చేసి ఆ తర్వాత నబీల్ ఎలాంటి వాడు అని వెనక మాట్లాడుకున్నారు.
Also Read: ప్రేమ పెళ్లికి సిద్ధం అంటున్న పృథ్వీ.. విష్ణుప్రియ లైన్ క్లియర్.?
జంటలుగా విడిపోయి
‘‘నబీల్ నాకు నచ్చుతాడు కానీ మాట్లాడేటప్పుడు మాత్రం మనం చెప్పే పాయింట్ వినడు. అందరిలో గుడ్ ఉన్నట్టే బ్యాడ్ కూడా ఉంటుంది’’ అంటూ అవినాష్‌తో నబీల్ గురించి చెప్తుంది రోహిణి. ‘‘ఓటు అప్పీల్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ బిగ్ బాస్ ఇస్తున్న మొదటి ఛాలెంజ్.. నా టవర్ ఎత్తైనది’’ అంటూ టాస్క్ గురించి వివరించారు బిగ్ బాస్. ఇందులో కంటెస్టెంట్స్ అంతా జంటలుగా కలిసి ఈ ఆట ఆడాలి. రోహిణి – విష్ణుప్రియా, నిఖిల్ – ప్రేరణ, గౌతమ్ – నబీల్ తమ ఒక కాలిని మరొకరి కాలితో కట్టేసి అలాగే వెళ్లి ఇటుకలను తెచ్చుకొని వాటితో టవర్ కట్టాలి. అది కట్టడం పూర్తయిన తర్వాత జంటల్లో ఒకరు వెళ్లి ఇతరుల టవర్స్‌ను పడగొట్టే ప్రయత్నం చేయాలి.
రోహిణి కంప్లైంట్స్
మొదటి టాస్క్‌లో గౌతమ్, నబీల్ ఓడిపోయారు. రోహిణి, విష్ణుప్రియా గెలిచినా కూడా ఇద్దరిలో ఒకరు మాత్రమే రెండో టాస్క్ ఆడి ఓటు అప్పీల్ చేసుకునే రేసులో నిలబడగలరు అని చెప్పగానే విష్ణుప్రియా తనకు తానుగా తప్పుకుంది. దీంతో రోహిణికి రెండో టాస్క్ ఆడే అవకాశం వచ్చింది. అలా నిఖిల్, ప్రేరణ, రోహిణి బిగ్ బాస్ ఇచ్చిన తదుపతి ఛాలెంజ్ టక్ టకా టక్ కోసం సిద్ధమయ్యారు. ఈ టాస్క్‌లో తమ బాక్స్‌లో ఉన్న డిస్కులను అవతలి వారి బాక్స్‌ల్లోకి తోసేయాలి. ఆ టాస్క్ మొదలయినప్పటి నుండి ప్రేరణ సరిగ్గా ఆడడం లేదంటూ కంప్లైంట్స్ ఇస్తూనే ఉంది రోహిణి. చివరికి రోహిణినే ఓటు అప్పీల్ చేసుకోవడానికి గెలిచిన మొదటి కంటెస్టెంట్ అని ప్రోమో చూస్తే అర్థమవుతోంది.