BigTV English

Pushpa 2 Movie : ఇంకా వేడి తగ్గలేదు పుష్పా…

Pushpa 2 Movie : ఇంకా వేడి తగ్గలేదు పుష్పా…

Pushpa 2 Movie : పుష్ప 2 రిలీజ్ అవ్వడమేంటో కానీ, సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ అయితే అంతా ఇంత కాదు. ఫ్యాన్స్ పచ్చి బూతులు మాట్లాడుతూ రెచ్చిపోతున్నారు. రేపు రాత్రి 9:30కి ప్రిమియర్స్ స్టార్ట్ కాబోతున్నాయి. టాక్ ఎలా ఉందో తెలీదు కానీ, అప్పుడే మెగా ఫ్యాన్స్ నెగిటివ్ ప్రచారం అయితే స్టార్ట్ చేశారు. సినిమా టాక్ బాలేదు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇక ఆంధ్ర ప్రదేశ్‌లో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇప్పటికే అక్కడ బాయ్ కాట్ ట్రెండ్ నడుస్తుంది. మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఇతర హీరోల ఫ్యాన్స్ కూడా ఈ ట్రెండ్‌లో పాల్గొంటున్నారు.


ఈవెంట్ రచ్చ ఇంకా తగ్గలే…

సోమవారం సాయంత్రం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ టైంలో సోషల్ మీడియాలో చాలా హంగామా చోటు చేసుకుంది. ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి వస్తున్నారు అంటూ ప్రచారం జరిగింది. దీంతో మెగా అభిమానలు ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. టైం దొరికిన ప్రతి సారి అల్లు అర్జున్ మెగా హీరోలను అవమానిస్తున్నట్టు ప్రవర్తిస్తున్నారు.. ఇలాంటి టైంలో చిరంజీవి ఎలా వెళ్తారు ఈవెంట్ కి అంటూ కొంత మంది మెగా అభిమానులు సీరియస్ అయ్యారట. ఈవెంట్ కి వెళ్తే మెగా కుటుంబానికి దూరమవుతామని కూడా హెచ్చరించారని ఇండస్ట్రీలో టాక్ వచ్చింది. దీనిలో ఎంత వరకు నిజం ఉందో తెలీదు కానీ, ప్రస్తుతం అది ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది.


అల్లు అర్జున్ కూడా అదే రేంజ్‌లో…

బయట ఇంత రచ్చ జరుగుతుంటే… అల్లు అర్జున్ వల్ల అవి మరింత పెరుగుతున్నాయి. నిన్న సాయంత్రం పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈవెంట్‌లో బన్నీ దాదాపు 25 నిమిషాలు మాట్లాడారు. కానీ, ఈ స్పీచ్‌లో మెగా హీరోల గురించి కానీ, చిరంజీవి గురించి కానీ, ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ కి డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గురించి కనీసం ఒక ముక్క కూడా మాట్లాడలేదు. ఇది మెగా ఫ్యాన్స్‌ను మరింత రెచ్చగొట్టేలా తయారు చేసింది.

సినిమా ప్రభావం ఎంత..?

ఈ పరిణామల వల్ల పుష్ప 2పై, ఆ సినిమాకు రాబోయే కలెక్షన్‌పై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని ట్రెండ్ పండితులు అంచనా వేస్తున్నారు. కొంత మంది సినిమా చూడకపోవడమే కాకుండా, సినిమాపై నెగిటివ్ ప్రచారం కూడా చేస్తున్నారు. అలాగే ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని వాయిస్ మెసేజ్‌లు తెగ వైరల్ అయ్యాయి. పుష్ప 2 సినిమా రిలీజ్ అయిన తర్వాత వీడియో మొత్తం వీపీఎన్‌లు యూజ్ చేసి మరీ ట్విట్టర్‌లో లీక్ చేస్తాను అంటూ ఆ వాయిస్ మెసేజ్‌ల్లో మాట్లాడు. దీనితో సినిమాపై, అల్లు అర్జున్‌పై ఎంత వ్యతిరేకత ఉంది అన్న విషయం ఒకటి అర్థమైతే మరో విషయం ఏంటంటే.. సినిమాకు లీక్ భయం కూడా ఉందని కూడా తెలుస్తుంది. దీంతో నిర్మాతలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి.

అల్లు అర్జున్ ఆర్మీ నుంచే విమర్శలు

ఇదింత ఒకటి అయితే… అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ ను ఎంతో ప్రేమగా పిలిచే ఆర్మీ నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. అది కూడా నిన్న అత్యంత గ్రాండ్‌గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈ విమర్శల మాటలు వినిపించాయి. ఈవెంట్‌లో నిర్మాతలు మాట్లాడుతున్న టైంలో క్రౌడ్ నుంచి టికెట్ ధర 1200 మరి ఎక్కువ అంటూ అభిమానులు అరిచారు. దీంతో టికెట్ల ధరలను అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా వ్యతిరేకిస్తున్నారు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

వీటి అన్నింటినీ ఎదుర్కుని బన్ని సినిమా ఫస్ట్ డే 250 కోట్ల కలెక్షన్లను రాబట్టే ఛాన్స్ ఉందా…?

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×