BigTV English

BB Telugu 8: ప్రేమ పెళ్లికి సిద్ధం అంటున్న పృథ్వీ.. విష్ణుప్రియ లైన్ క్లియర్.?

BB Telugu 8: ప్రేమ పెళ్లికి సిద్ధం అంటున్న పృథ్వీ.. విష్ణుప్రియ లైన్ క్లియర్.?

BB Telugu 8:తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ (Bigg Boss). తెలుగులో ఇప్పటికే ఏడు సీజన్ లు పూర్తి చేసుకున్న ఈ షో , ఇప్పుడు 8వ సీజన్ చివరి దశకు చేరుకుంది. 13వ వారం డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా టేస్టీ తేజ(Tasty Teja) తో పాటు పృథ్వీ (Prithviraj) కూడా ఎలిమినేట్ అయ్యారు. అయితే ఇక్కడ పృథ్వీ ఎలిమినేషన్ అన్ ఫెయిర్ అంటూ అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా 14వ వారం ప్రారంభం అయింది. ఇందులో టికెట్ టు ఫినాలే రేస్ లో గెలిచి మొదటి ఫైనలిస్ట్ గా నిలిచారు వైల్డ్ కార్డు ఎంట్రీ అవినాష్ (Avinash).. ఇక ప్రస్తుతం హౌస్ లో ప్రేరణ, విష్ణు ప్రియ, రోహిణి, గౌతమ్, నిఖిల్, నబీల్ నామినేషన్స్లోకి వచ్చారు.


ఇదిలా ఉండగా.. పృథ్వీ హౌస్ లో ఉన్నప్పుడు విష్ణు ప్రియ, పృథ్వీ వెనకాలే తిరిగేది. పృథ్వీ కేవలం స్నేహితురాలిగానే చూసినా.. విష్ణు ప్రియ మాత్రం.. తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఆయన చుట్టూనే తిరిగేది. దీనికి తోడు ఫ్యామిలీ వీక్ లో భాగంగా పృథ్వీ తల్లి హౌస్ లోకి అడుగు పెట్టినప్పుడు.. ఇక్కడ హౌస్ లో నీకు ఇష్టమైన వారు ఎవరమ్మా? అని పృథ్వీ అడగ్గా .. ఆయన తల్లి కూడా విష్ణుప్రియ అంటే ఇష్టం అని చెప్పి ఆశ్చర్యపరిచింది. దీంతో పృథ్వీ తల్లి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది కదా.. పృథ్వీ, విష్ణు ప్రియ ను వివాహం చేసుకుంటారా అంటూ అందరూ కామెంట్ చేశారు. కానీ పృథ్వి ఎప్పుడు కూడా విష్ణు ప్రియ పై తన ప్రేమ ఫీలింగ్ ను చూపించలేదు. దీనికి తోడు ‘నాగపంచమి’ సీరియల్ దర్శిని గౌడ (Darshini gouda)కూడా పృథ్వి కోసం స్టేజ్ పైకి వచ్చినప్పుడు కూడా ఆమె మాటలు చూస్తే వీరిద్దరూ ప్రేమ పక్షులని అందరూ అనుకున్నారు.

ఇకపోతే హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పృథ్వీ కోసం యష్మీ, సోనియా గ్రాండ్ పార్టీ అరేంజ్ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పృథ్వీ.. తన ప్రేమ, పెళ్లి గురించి తెలిపారు. ఇంటర్వ్యూలో భాగంగా మీరు దర్శిని గౌడ ను వివాహం చేసుకోబోతున్నారా? అని అడగగా.. ఆమె నాకు స్నేహితురాలు మాత్రమే. ఆమెతో ప్రేమ, పెళ్లి లాంటి ఆలోచనలు లేవు. ఇక విష్ణు ప్రియ కూడా అంతే. కేవలం స్నేహితురాలు మాత్రమే. ఎవరి ఫీలింగ్స్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు. కానీ ఎదుటి వాళ్లు వారి ఫీలింగ్స్ ని అంగీకరించాల్సిన రూల్ లేదు కదా.. నేను కూడా అంతే.. అయితే నేను కూడా ప్రేమ పెళ్లి చేసుకుంటాను. కాకపోతే నా ముందు కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. ముందు వాటిని పూర్తి చేశాక ఆ తర్వాత ప్రేమ పెళ్లి చేసుకుంటాను అంటూ క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి అయితే ప్రేమ, పెళ్లి చేసుకుంటానని చెప్పాడు కానీ ఎవరిని వివాహం చేసుకోబోతున్నారనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. ఏది ఏమైనా విష్ణుప్రియకు మాత్రం టోకరా పెట్టాడని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.


Related News

Bigg Boss season 9 : నాగార్జున మాస్ కౌంటర్లు, అందరికీ ఇచ్చి పడేసాడు, ఎపిసోడ్ హైలైట్స్ ఇవే

Bigg Boss 9 Promo : గుడ్డు దొంగ పరువు తీసిన నాగ్.. చూడాలని ఉందంటూ ఏడ్చేసిన ఇమాన్యూయెల్

Bigg Boss 9 : ఎలిమినేట్ అయిపోయిన మరో కామనర్, ట్రోఫీ సెలెబ్రిటీలకే అంకితమా?

Ritu Chaudhary : చెప్పు రీతు నువ్వు నన్ను మోసం చేయలేదా? రీతుకి కళ్యాణ్ తో బంధం తెగిపోయిందా?

Bigg boss emmanuel : నా బాధ మీకు తెలియదు, రోజు దుప్పటి కప్పుకుని ఏడుస్తాను

Bigg Boss 9: కెప్టెన్సీ కోసం వచ్చిన తిప్పలు, అందరూ కన్నీటి కొళాయిలు ఓపెన్ చేశారు

Bigg Boss 9 Promo2: కళ్యాణ్‌కు రీతూ వెన్నుపోటు.. మళ్లీ కుళాయి ఓపెన్ చేశాడుగా!

Bigg Boss 9 Promo: కెప్టెన్సీ టాస్క్.. రీతూ చౌదరికి ఏమైంది?

Big Stories

×