BigTV English
Advertisement

Bigg Boss 8: ఎంటర్టైన్మెంట్ హౌస్ ని కాస్త కమ్యూనిటీ హౌస్ గా మార్చేశారు కదరా..!

Bigg Boss 8: ఎంటర్టైన్మెంట్ హౌస్ ని కాస్త కమ్యూనిటీ హౌస్ గా మార్చేశారు కదరా..!

Bigg Boss 8.. కొంతమందిలో కులపిచ్చి ఏ రేంజ్ లో ఉంటుందంటే ఎక్కడికి వెళ్ళినా సరే తమ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులను వెతుక్కోవడం అలవాటుగా పెట్టుకుని ఉంటారు. ఆ కుల పిచ్చే ఆఖరికి ఎంటర్టైన్మెంట్ షో గా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ హౌస్ ను కమ్యూనిటీ హౌస్ గా మార్చేంత పెరిగిపోతే.. ఆ సంఘటన ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. తాజాగా జరిగిన సంఘటన నెటిజెన్స్ లో ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.


వైరల్ గా మారిన నబీల్ – మెహబూబ్ సంభాషణ..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 సెప్టెంబర్ ఒకటవ తేదీన దాదాపు 14 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైంది. లిమిట్ లెస్ ఎంటర్టైన్మెంట్ అంటూ మొదలైన ఈ షోలో ఊహించని మలుపులు చోటు చేసుకున్నాయి. మొత్తం 14 మందితో ప్రారంభమైన ఈ హౌస్ లో ఆరువారాలలో ఏడు మంది ఎలిమినేట్ అయ్యారు. మరొకవైపు వైల్డ్ కార్డు ద్వారా ఏకంగా ఎనిమిది మంది హౌస్ లోకి వచ్చారు. దీంతో హౌస్ మొత్తం చాలా సందడిగా సాగుతోంది. ఆరవ వారం స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకున్న సీత ఎలిమినేట్ అయింది. ఏడో వారం నామినేషన్ కూడా జరిగిపోయాయి.ఆ తర్వాత జరిగిన ఒక సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది .ఆ సంభాషణ మెహబూబ్ (Mehaboob),నబీల్ (Nabeel)మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు చర్చకు దారితీసింది.


కమ్యూనిటీ హౌస్ గా మార్చేసిన మెహబూబ్ – నబీల్..

మెహబూబ్, నబీల్ కమ్యూనిటీ గురించి మాట్లాడుకోవడం సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతోంది. నిజం చెప్పాలంటే కొన్ని కొన్ని విషయాలు బిగ్ బాస్ హౌస్ లో మాట్లాడకూడదు అనే కండిషన్ కూడా ఉంది. కానీ వారు ఏకంగా కమ్యూనిటీ గురించి మాట్లాడటంతో ఈ విషయం కాస్త చాలా హల్చల్ చేస్తోంది. వీరిద్దరి సంభాషణలో భాగంగా ముందుగా.. నబీల్ మనిద్దరం ఒకటని వాళ్లు అనుకుంటున్నారు అంటూ హౌస్ మేట్స్ ని ఉద్దేశించి నబీల్ కామెంట్ చేయగా.. మెహబూబ్ మాట్లాడుతూ.. మనకు ఒక కమ్యూనిటీ ఉంది. వారే మనకు ఓట్లు వేస్తారు. మనమిద్దరం ఒకేసారి నామినేషన్ లో లేకుండా మాత్రమే చూసుకోవాలి .ఒకవేళ ఇద్దరం నామినేషన్ లో ఉంటే మన కమ్యూనిటీ ఓట్లు మనకు డివైడ్ అవుతాయి. మనం అలా ఇద్దరూ నామినేషన్ లో ఉండకుండా చూసుకుంటే చాలు అంటూ కమ్యూనిటీ గురించి చెబుతూ చెప్పుకొచ్చాడు. మొత్తానికి అయితే వీరిద్దరూ ముస్లిమ్ అని, తమ ముస్లిం కమ్యూనిటీ ఓట్లు తమకే పడతాయి అంటూ హౌస్ లో మాట్లాడుకోవడం , అందుకు సంబంధించిన వీడియో బయటికి రావడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఇది చూసిన నెటిజన్స్ వారాంతంలో నబీల్,మహబూబ్ కి నాగార్జున ఖచ్చితంగా సీరియస్ వార్నింగ్ ఇస్తాడు అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం . ఇంకొంతమంది వీరిద్దరూ పెద్ద ప్లాన్ తోనే వచ్చారు అని కామెంట్లు చేస్తున్నారు.

దెబ్బకు నబీల్ గ్రాఫ్ పడిపోయేనా..

నిజానికి వీరి పెర్ఫార్మెన్స్ చూసి హిందువులు కూడా ఓట్లు వేస్తున్నారు. ఇక ఇప్పుడు కమ్యూనిటీ గురించి మాట్లాడడంతో ఇక ఆ ఓట్లు కూడా పడతాయా అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాదు ఇప్పుడు వరకు నబీల్ పర్సనాలిటీ నచ్చి మనవాడు అని చాలామంది ఆయనకు ఓట్లు వేశారు. ఇప్పుడు మెహబూబ్ మాటలకు నబీల్ గ్రాఫ్ కూడా దారుణంగా పడిపోయే అవకాశం కనిపిస్తోంది. ఏది ఏమైనా ఈ వీడియో విన్న కొంతమంది ఎంటర్టైన్మెంట్ హౌస్ ని కమ్యూనిటీ హౌస్ గా మార్చేశారు కదరా మీ జిమ్మడ అంటూ చాలా దారుణంగా కామెంట్లు చేస్తున్నారు.

Related News

Bigg Boss 9 Telugu Day 61 : రీతూ బంగారంరా… తనూజాపై అంత కక్షగట్టేశావ్ ఏంటి దివ్య? నక్కతోక తొక్కిన ఇమ్మూ

Bigg Boss 9 Telugu : ఇమ్మూనా మజాకా? బిగ్ బాస్ చరిత్రలోనే బిగ్గెస్ట్ రికార్డ్… కానీ ఆ బుర్ర తక్కువ పనే మైనస్ మావా

Bigg Boss 9: చివరిలో చేజారిన తనూజ కెప్టెన్సీ.. అతడే కొత్త కెప్టెన్!

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ లో ఉండటం ఆ కంటెస్టెంట్ కు ఇష్టం లేదా..? ఈ వారం ఇతనే ఎలిమినేట్..?

Bigg Boss 9 Promo: రీతూ Vs దివ్య.. చిచ్చుపెట్టిన సాయి!

Bigg Boss 9 Telugu : గౌరవ్ కు గట్టిదెబ్బ… ఇదేందయ్యా ఇదీ… కట్టప్ప కన్నా తనూజా – ఇమ్మాన్యుయేల్ వెన్నుపోటే దారుణం

Bigg Boss 9 Telugu Day 60 : ఇమ్మూను బోల్తా కొట్టించిన రీతూ… తనూజా వల్ల గౌరవ్ కు తీరని అన్యాయం… దివ్య దిక్కుమాలిన ప్లాన్ సక్సెస్

Bigg Boss 9 Madhuri: వాళ్లు రెమ్యునరేషన్‌ ఇచ్చేదేంటి.. నాకే నెలకు కోటి వస్తుంది.. దివ్వెల మాధురి

Big Stories

×