E-Paper
Advertisement

Naga Chaitanya : నాగ చైతన్య కార్ రేసింగ్ కు దూరం అవ్వడానికి కారణం వాళ్లేనా?

Naga Chaitanya : నాగ చైతన్య కార్ రేసింగ్ కు దూరం అవ్వడానికి కారణం వాళ్లేనా?
Advertisement

Naga Chaitanya : ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న క్రేజీ యంగ్ హీరోలలో అక్కినేని నాగ చైతన్య కూడా ఒకరు. నాగార్జున నట వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నాగ చైతన్య ఎక్కువగా కమర్షియల్ సినిమాల జోలికి వెళ్లకుండా తనదైన శైలిలో ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే ఈ హీరో తనకు చాలా ఇష్టమైన కార్ రేసును వదిలి పెట్టడానికి కారణం ఎవరో తాజాగా వెల్లడించారు.

కార్ రేస్ ను వదిలి పెట్టడానికి కారణం వాళ్లే.. 

Advertisement

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగ చైతన్య మాట్లాడుతూ తనకు చిన్నతనం నుంచి రేసింగ్ అంటే చాలా ఇష్టమని, కొత్త రకం బైకు ఎప్పుడు కనిపించినా వెంటనే డ్రైవ్ చేయాల్సిందే అన్నట్టుగా ఉండేవాడినని చెప్పుకొచ్చారు. మరి తనకు ఇంత ఇష్టమైన కార్ రేసింగ్ కు ఎందుకు దూరంగా ఉన్నాడు అనే విషయం గురించి నాగ చైతన్య మాట్లాడుతూ “నేను సినిమాల్లోకి రాకముందు అంటే జోష్ సినిమాను చేయక ముందు ఒక స్పోర్ట్స్ కార్ ను తెప్పించుకున్నాను. ఏ మాత్రం టైం దొరికినా ఆ కారుతో షికార్లు కొట్టేవాడిని. కానీ సినిమాలతో బిజీ అయ్యాక ఆ అలవాటును తగ్గించుకోవాలని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే కార్ రేసింగ్ అంటే ఎంత స్పీడ్ తో వెళ్లాల్సి ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. కానీ అంత వేగంగా ప్రయాణించడం మంచిది కాదు అని నా స్నేహితులతో పాటు శ్రేయోభిలాషులు కూడా చెప్పారు. అంతేకాకుండా నాపై ఇంత మంది నిర్మాతలు ఇన్వెస్ట్ చేసి సినిమాలు తీస్తున్నప్పుడు.. నేను ఏమాత్రం ఏమర పాటుగా ఉన్నా షూటింగ్లకు అంతరాయం కలుగుతుంది. నా పొరపాటు కారణంగా నిర్మాతలకు తీవ్ర నష్టం వాటిల్లడమే కాకుండా నా వ్యక్తిగత జీవితంపై ఎఫెక్ట్ పడుతుంది. అందుకే కారు రేస్ అనే ఆలోచన నాకు ఇప్పుడు అస్సలు రావట్లేదు. ఎప్పుడో ఒకసారి చేసినా  చాలా జాగ్రత్తగా లిమిట్స్ లో, అవసరమైన జాగ్రత్తలు తీసుకొని మరీ చేయాలని డిసైడ్ అయ్యాను” అని చెప్పుకొచ్చారు నాగ చైతన్య. అంటే అభిమానులతో పాటు నిర్మాతల కోసం నాగ చైతన్య తనకు ఇష్టమైన కార్ రేస్ ను వదిలేసారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు చై ఇంటర్వ్యూని చూసిన అభిమానులు.

సంక్రాంతి రేస్ లో ‘తండేల్’ మూవీ

Advertisement

ప్రస్తుతం అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘తండేల్’. చందూ మొండేటి మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుండగా, ఈ మూవీని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే సంక్రాంతి కానుకగా ఈ మూవీని బాక్స్ ఆఫీస్ బరిలోకి దింపబోతున్నారని ప్రచారం జరుగుతోంది. కానీ దీనిపై మేకర్స్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు అక్కినేని కుటుంబంపై కొండా సురేఖ చేసిన కామెంట్స్ వివాదం ఇంకా కంటిన్యూ అవుతోంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×