Bigg Boss 9 Promo: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి బిగ్ బాస్ మరో కొత్త సీజన్ తో ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. అలా 9వ సీజన్ ప్రారంభం అవ్వగా.. తాజాగా 17వ రోజుకి సంబంధించిన మొదటి ప్రోమోని నిర్వహకులు విడుదల చేశారు. ఈ వారం.. కంటెస్టెంట్స్ అందరూ కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన మెసేజ్లను, బహుమతులను, ఉత్తరాలను హౌస్ బ్యాటరీని ఉపయోగించి మరీ పొందాల్సి ఉంటుంది. ఇక అందులో భాగంగానే నిన్నటి ఎపిసోడ్ లో ఇమ్మానుయేల్ (Emmanuel ) బ్యాటరీని సేవ్ చేస్తూ.. హౌస్ మేట్స్ పరిస్థితులను అర్థం చేసుకొని తనకు వచ్చిన లెటర్, వాయిస్ మెసేజ్లను కూడా కాదని ఇతరులకు అవకాశం కలిగించారు.
అయితే ఇప్పుడు ఈరోజు ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని విడుదల చేయగా ఈ ప్రోమో చూసిన నెటిజన్స్ మాత్రం ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా విడుదలైన ప్రోమోలో తనూజ కన్ఫెషన్ రూమ్ కి వెళ్ళింది. బిగ్ బాస్ మాట్లాడుతూ.. “మీ మేనకోడల నుండి లెటర్ వచ్చింది. మీ చెల్లి నుండి ఒక ఆడియో మెసేజ్, మీకోసం హార్ట్ ఉన్న ఒక మిస్టరీ వైట్ టీ షర్ట్ వచ్చింది. ఈ మూడింటిలో మీకు ఏది కావాలి? ముఖ్యంగా మీకు వైట్ టీ షర్టు కావాలి అంటే హౌస్ బ్యాటరీ నుండి 50% తగ్గుతుంది “అంటూ బిగ్ బాస్ తెలిపారు. దీంతో కన్నీళ్లు పెట్టుకున్న తనూజ వాయిస్ మెసేజ్ వినాలని ఉంది అని చెబుతుంది. అప్పుడు బిగ్ బాస్ మీకు ఆ మిస్టరీ టీ షర్టు కూడా చాలా ఇంపార్టెంట్ అనుకుంటాను అంటూ చెబుతారు. ఇక ఏం చేయాలో తెలియక అయోమయంలో పడిపోతుంది తనూజ.
also read:Tollywood:కిస్ పెడుతూ… ఇన్‌ఫ్లుయెన్సర్‌తో పబ్‌లో అడ్డంగా దొరికిపోయిన బేబీ హీరో
సందిగ్ధంలో కంటెస్టెంట్స్..
కట్ చేస్తే సుమన్ శెట్టి కన్ఫెషన్స్ రూమ్ లో కనిపించారు. బిగ్ బాస్ మాట్లాడుతూ.. హౌస్ బ్యాటరీలో కేవలం 10 శాతం మాత్రమే మిగిలి ఉంది. బ్యాటరీ పర్సంటేజ్ పెరిగి మీ ఇంటి నుంచి వచ్చిన సందేశం ఏంటో తెలుసుకోవడానికి.. మీరు భరణిని తన దగ్గర ఉన్న బాక్స్ ఓపెన్ చేసేలా కన్విన్స్ చేయాల్సి ఉంటుంది. అంటూ చెబుతారు. దాంతో ఏం అర్థం కాక సుమన్ శెట్టి మాట్లాడుతూ..” నాకు ఇంకో ఆప్షన్ ఇవ్వండి బిగ్ బాస్” అంటూ వేడుకుంటాడు. అయినా బిగ్ బాస్ వినకపోయేసరికి చేసేదేమీ లేక సుమన్ శెట్టి భరణి దగ్గరకు వచ్చి భరణితో ఇలా చెబుతాడు. భరణి దగ్గర ఉన్న సీక్రెట్ బాక్స్ ఓపెన్ చేస్తే బ్యాటరీ పెరుగుతుందని చెప్పాడు అని సుమన్ శెట్టి చెప్పగా.. భరణి శంకర్ మాట్లాడుతూ ఎంత పెరుగుతుంది అని అడిగాడు. దానికి సుమన్ శెట్టి ఏం చెప్పలేదు అంటూ సందిగ్ధంలో పడేసాడు.. దీంతో భరణి తాను ఇష్టంగా సీక్రెట్ గా తెచ్చుకున్న బాక్సును సుమన్ శెట్టి కోసం ఓపెన్ చేస్తారా అనే సందిగ్ధత నెలకొంది. మొత్తానికైతే ఈ ప్రోమో ఇప్పుడు ఉత్కంఠ గా మారింది అని చెప్పవచ్చు.