Ramya Moksha: బిగ్ బాస్ సీజన్ 9 లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఆల్రెడీ ఆరుగురు ఎంట్రీ ఇచ్చారు. వీళ్ళలో నలుగురు సెలబ్రిటీస్. మిగతా ఇద్దరూ కామన్ పీపుల్. సోషల్ మీడియాలో విపరీతంగా పాపులర్ అవడం వలన దువ్వాడ మాధురి మరియు రమ్య మోక్ష బిగ్ బాస్ కి ఎంట్రీ ఇచ్చారు. అయితే రమ్య మోక్ష చాలా నెగిటివ్ తో హౌస్ లోకి వెళ్ళింది. తాను హౌస్ లోకి వెళ్ళినప్పుడు కూడా చాలామంది ట్రోల్ చేశారు.
హౌస్ లోకి వెళ్లిన వెంటనే కళ్యాణ్ గురించి ఆమె చేసిన కామెంట్స్ వైరల్ గా మరి. తనుజ తో మాట్లాడే విధానాన్ని చూసి కళ్యాణ్ కి అమ్మాయిలు పిచ్చి అనే కామెంట్ పాస్ చేసింది. అయితే ఆ విషయం మీద సీక్రెట్ రూమ్ కి పిలిపించి కళ్యాణ్ కు ఆ వీడియో చూపించి ఆ తర్వాత క్లాస్ కూడా రమ్య మోక్షకి ఇచ్చారు నాగార్జున. వీడియో చూసిన కళ్యాణ్ కూడా ఆశ్చర్యపోయాడు.
అలేఖ్య చిట్టి పీకిల్స్ ద్వారా బాగా పాపులర్ అయింది రమ్య. అయితే ఎవరికీ లేని విధంగా రమ్యకి నచ్చిన ఫుడ్డు కోరుకునే పవర్ ఇచ్చారు. అలా నచ్చిన ఫుడ్ కోరుకునే పవర్ ఇవ్వడం వలన రమ్య లోపలికి ఎంట్రీ ఇచ్చి తనకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకునేది. అయితే తినేదానికన్నా ఎక్కువ ఆర్డర్ చేయడం వల్ల కూడా ఆమెకు కొన్ని నెగటివ్ కామెంట్స్ వచ్చాయి.
అయితే రమ్య అలా ఫుడ్డు కోరుకోవడం వల్ల చాలా మంది ట్రోల్ కూడా చేశారు. రమ్య ఫుడ్ ఆర్డర్ పెడుతుంటే చాలామంది బయటనుంచి నువ్వు అడిగినవన్నీ ఇవ్వాలంటే బిగ్ బాస్ ఆస్తులు అమ్ముకోవాలి అని కామెంట్స్ కూడా చేసేవాళ్ళు. అయితే రమ్య ఎలిమినేట్ అయిపోయిన సంగతి తెలిసింది. హౌస్ నుంచి బయటకు వచ్చిన రమ్య హౌస్ లో ఉన్న వాళ్ళ మీద ఒపీనియన్స్ చెప్పింది తనకోసం ఒక ప్రత్యేకమైన ఏవి ని కట్ చేశారు.
హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత నామినేషన్ ప్రక్రియలో భాగంగా తనుజా ను నామినేట్ చేసింది రమ్య. నామినేషన్ ప్రక్రియలో భాగంగా రమ్య మాట్లాడిన ప్రతి మాట కూడా నిజం. అయితే చాలామందికి ఆ నామినేషన్ తర్వాత రమ్య మీద ఉన్న ఒపీనియన్ కూడా కంప్లీట్ గా మారిపోయింది.
ప్రస్తుతం రెండు వారాల్లో తనని బయటకు పంపించేయాలని బిగ్ బాస్ యాజమాన్యం ముందే ఫిక్స్ అయింది. అందుకే అడిగిన ఫుడ్ ఇచ్చారు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఫుడ్ పార్టనర్ గా సుమన్ శెట్టి న ఎంచుకుంది రమ్య మోక్ష. అయితే గేమ్ చాలా బాగా ఆడుతుంది అనుకున్న తరుణంలో రమ్య ఎలిమినేట్ అవ్వడం అనేది ఊహించని పరిణామం. ముందు నుంచే తను ప్రతివారం ఎలిమినేషన్ లో ఉంటాను అని ఊహించింది.
Also Read: Bigg Boss 9 : ఏమి మేనేజ్మెంట్ సామీ, కంప్లీట్ సపోర్ట్ అంతా తనూజకేనా?