Bigg Boss 9: తెలుగు బిగ్ బాస్ సీజన్ 9.. 8వ వారం మొదలైన విషయం తెలిసిందే.ఈ వారం కూడా నామినేషన్స్ ప్రక్రియ ఎప్పటిలాగే మొదలైంది కానీ ఈ నామినేషన్ ప్రక్రియలో సరికొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ వారం మాధురి ఎలిమినేట్ అవ్వడం పక్కా అంటూ కొంతమంది నెటిజన్స్ కామెంట్లు చేస్తుంటే.. ఆమె కావాలనే సెల్ఫ్ ఎలిమినేట్ అవ్వాలనుకుంది. కానీ అలా చేయకుండా ఒక స్క్రిప్టెడ్ గా.. పక్కా ప్లానింగ్ తోనే ఈ వారం పంపించనున్నారు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఇకపోతే ఈ వారం నామినేషన్ కాస్త భిన్నంగా సాగినట్లు తెలుస్తోంది. హౌస్ నుంచీ ఎలిమినేట్ అయిన వాళ్ళు మళ్ళీ హౌస్ లోకి వచ్చి హౌస్ లో ఉన్న వారిని నామినేట్ చేసి వెళ్ళిపోయారు. అలా మనీష్ , దమ్ము శ్రీజ, ప్రియా శెట్టి, ఫ్లోరా షైనీ హౌస్ లోకి వచ్చి నామినేషన్స్ ప్రక్రియను పూర్తి చేశారు. ఇందులో తనూజ, కళ్యాణ్, రీతు చౌదరి, డెమోన్ పవన్ లతోపాటు గౌరవ్, రాము రాథోడ్ , సంజన, దివ్వెల మాధురి ఇలా మొత్తం ఎనిమిది మంది నామినేట్ అయ్యారు. ఇదిలా ఉండగా మరొకవైపు స్పెషల్ పవర్ ద్వారా నేరుగా దివ్వెల మాధురిని తనూజ నామినేట్ చేసింది. ఈమె నామినేషన్ మాత్రమే కాదు ఈ వారం జరగబోయే ఎలిమినేషన్ కూడా ఒక్క స్క్రిప్ట్ ప్రకారమే జరగబోతోంది అనడానికి పలు కారణాలు కూడా కనిపిస్తున్నాయి.
ALSO READ:Tollywood : ఐరన్ లెగ్ శాస్త్రి అలాంటివాడా.. విస్తుపోయే నిజాలు బయటపెట్టిన కొడుకు!
అసలు విషయంలోకి వెళ్తే.. నిన్నటి ఎపిసోడ్లో తనూజ టాస్క్ గెలిచిన తర్వాత గోల్డెన్ పవర్ ను దక్కించుకుంది. దాని ద్వారా నాగార్జున ఈమెకు మూడు ఆప్షన్లు ఇచ్చారు. అందులో ఒకటి డైరెక్ట్ నామినేషన్.. ఇంకొకటి బాత్రూం – గార్డెన్ క్లీనింగ్.. మూడవది మాట్లాడకుండా ఇన్ విజిబుల్ కేప్ ధరించడం.. ఈ మూడు ఆప్షన్లు తనుజాకి ఇచ్చారు. ఇందులో నువ్వు ఎవరికి ఏ ఆప్షన్ ఎంచుకొని ఇవ్వబోతున్నావు అని అడగగా.. తనూజ క్షణం ఆగకుండా మాధురి పేరు చెప్పింది. ఆ టైంలో చూస్తే మాధురి వైపు చూసి నవ్వుతూ డైరెక్ట్ నామినేషన్ చేస్తాను సార్ అనగా.. అటు మాధురి కూడా కన్నుకొడుతూ చిరునవ్వు చిందిస్తూ తనను నామినేట్ చేయమని చెప్పింది. నిజానికి తనూజ, మాధురి ఇప్పుడు చాలా క్లోజ్ అయిపోయారు. అలాంటిది ఆమెను డైరెక్ట్ గా నామినేట్ చేయడం ఏంటి? ఎక్కడో కొడుతోంది ? అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఈవారం హౌస్ నుంచి మాధురి వెళ్ళిపోవాలని అనుకుందని.. అందుకే పక్కాగా నామినేషన్స్ లో ఉంటే ఆమెను ఎలిమినేట్ చేయవచ్చు అనే కారణంతోనే ఇదంతా చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఇవన్నీ కేవలం పుకార్లు మాత్రమే.. ఎందుకంటే మరో రెండు వారాలలో దువ్వాడ శ్రీనివాస్ హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారు. అలాంటప్పుడు ఈమె ఎందుకు ఎలిమినేట్ అవుతుంది అంటూ కూడా కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.. మరి ఈ నామినేషన్ వెనుక ఉన్న అసలు కథ ఏమిటి అనే విషయం తెలియాలి అంటే ఈ వారం వీకెండ్ వచ్చేవరకు ఎదురు చూడాల్సిందే