BigTV English
Advertisement

Bigg Boss 9: కెప్టెన్సీ టాస్క్.. ఇమ్మానుయేల్, భరణి పరువు తీసిన కామనర్!

Bigg Boss 9: కెప్టెన్సీ టాస్క్.. ఇమ్మానుయేల్, భరణి పరువు తీసిన కామనర్!

Bigg Boss 9: తాజాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కి సంబంధించిన ఐదవ ఎపిసోడ్ మొదటి ప్రోమోని నిర్వాహకులు విడుదల చేశారు. ఇందులో కెప్టెన్సీ కోసం టాస్కులు నిర్వహిస్తూ ఉండగా.. కామనర్స్ , సెలబ్రిటీల మధ్య టాస్క్ నిర్వహించారు. అందులో భాగంగానే తాజాగా తమ స్ట్రాటజీని నిరూపించుకోవడానికి ఒక టాస్క్ నిర్వహించగా.. అందులో ఎవరు కూడా నిజాయితీగా ఆడడం లేదు అంటూ ప్రియా శెట్టి అసహనం వ్యక్తం చేసింది. మాటలే అనుకున్నాను.. ప్రవర్తనలో కూడా నిజాయితీగా లేరు.. తొక్కలో గేమ్ అంటూ ఫైర్ అయ్యింది ప్రియా శెట్టి.


సెలబ్రిటీస్ పరువు తీసిన కామనర్..

ఇక గేమ్ తర్వాత కామనర్ హరీష్ మాట్లాడుతూ.. ఏకంగా సెలబ్రిటీలైన భరణి శంకర్, ఇమ్మానుయేల్ పరువు తీసేశారు ఇన్ని రోజులు తనూజ , భరణి, ఇమాన్యుయల్ .. ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి అనుకున్నాను. కానీ ముగ్గురు అమ్మాయిలే అంటూ ఒక్కసారిగా వారి పరువు తీసేశారు. దీంతో హరీష్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. గేమ్ లో ఎవరు కూడా ఫెయిర్ గా ఆడడం లేదు అని అంతా మోసం చేస్తున్నారు అంటూ కామెంట్లు చేయడం గమనార్హం.

బిగ్ బాస్ ఫిఫ్త్ ఎపిసోడ్ ఫస్ట్ ప్రోమో..


ప్రోమో విషయానికి వస్తే.. కెప్టెన్సీ టాస్క్ నిర్వహించగా అందులో సంచాలక్ గా మర్యాద మనీష్ వ్యవహరించారు. ఇక రాము రాథోడ్ వాల్ కి ఏర్పాటు చేసిన రాడ్ ను పట్టుకొని వేలాడుతూ ఉండగా.. మనీష్ ఏదో అనగానే ఆమె తిరిగింది కదా బ్రో అంటూ ప్రియా శెట్టిని అన్నాడు. దీంతో ఆమె తాను పట్టుకున్న రాడ్ ను కూడా వదిలేసి, తొక్కలో గేమ్.. ఫెయిర్ గా ఆడరు. కనీసం ఫెయిర్ గా కూడా మాట్లాడరు అంటూ అసహనం వ్యక్తం చేసింది. ఇక తర్వాత ఇమ్మానియేల్ శంకర్ దగ్గర మాట్లాడుతూ నన్ను బాడీ షేమింగ్ చేశారన్నా.. అసలు అలా ఎలా అనుకుంటారు వాళ్ళు అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ప్రియా వచ్చి నేనేమో హెల్ప్ చేశాను మీరు మాత్రం అన్ఫేర్ ఆడుతున్నారు అంటుంది.. ఎవరో ఒకరు తీస్తేనే కదా గేమ్ విన్ అయ్యేది అంటూ ఇమ్మానియేల్ తెలిపారు. ఆ తర్వాత హరీష్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు భరణి, ఇమ్మానియేల్, తనూజ ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలతో ఫైట్ చేశానని ఇన్ని రోజులు అనుకున్నాను. కానీ ఇప్పుడే తెలిసింది ముగ్గురు అమ్మాయిలతో నేను ఫైట్ చేశాను అని అంటూ వారి పరువు తీశారు. మొత్తానికి అయితే హరీష్ చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

 

Related News

Bigg Boss 9: దివ్య మళ్లీ బంధాన్ని కొనసాగించాలి అని చూస్తుందా? గౌరవ్ గుప్తాతో ఆర్గ్యుమెంట్ అవసరమా?

Bigg Boss 9: ఈ వారం నామినేషన్ లో మొత్తం 8 మంది.. వాళ్లు ఎవరెవరంటే

Bigg Boss 9 : నాన్న మారిపోయాడు.. దివ్యని అవైయిడ్ చేసి తనూజతో.. అసలేం జరిగింది

Bigg Boss 9 day 51: శ్రీజ దెబ్బకు ఏడ్చిన మాధురి.. రీఎంట్రీ లో ట్విస్ట్.. తనూజపై ఇమ్మూ గాసిప్స్

Bigg Boss 9 : బిగ్ బాస్ యాజమాన్యం సంచలన నిర్ణయం, హోస్ట్ గా నాగార్జున ఇక లేనట్లేనా?

Bigg Boss 9 Promo : అన్నా చెల్లి.. ఓ తెలుగు రాని అబ్బాయ్, దివ్య స్మార్ట్ గేమ్ ఆడుతుందా?

Bigg Boss 9 Bharani: హౌస్‌లో భరణికి తీవ్రగాయాలు.. అర్ధరాత్రి హాస్పిటల్‌కు తరలింపు

Bigg Boss 9 Promo : మాధురి vs శ్రీజ… ఆ నోళ్ల మోతను భరించాల్సిందేనా…

Big Stories

×