BigTV English

Raghava lawrance : రాఘవ లారెన్స్ గొప్ప మనసుకు ఫిదా.. సొంతింటినే పాఠశాలగా…

Raghava lawrance : రాఘవ లారెన్స్ గొప్ప మనసుకు ఫిదా.. సొంతింటినే పాఠశాలగా…

Raghava lawrance : రాఘవ లారెన్స్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. సినిమాలతో తన టాలెంట్ నిరూపించుకుంటూ.. ఒక్కో మెట్టు ఎదుగుతూ ప్రస్తుతం స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారిలో ఈయన ఒకటిగా ప్రేక్షకుల హృదయాల్లో జరగని ముద్ర వేసుకున్నారు. డాన్స్ మాస్టర్ గా, డైరెక్టర్ గా, నిర్మాతగా మాత్రమే కాదు.. సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తూ ప్రజల మనసుల్లో ఆయన స్థానాన్ని ఎప్పటికీ చిరస్మరణీయంగా మార్చుకున్నాడు లారెన్స్. ఇలా ఈయన గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో పుస్తకాలు కూడా సరిపోవు. ఒక ఫౌండేషన్ ని స్థాపించి.. ఎంతోమందికి ఆసరాగా నిలబడిన ఈ హీరో తాజాగా మరోసారి గొప్ప మనసుని చాటుకున్నారు. ఆయన సొంతింటిని ఆ పని కోసం మార్చడంపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ ఆయన చేసిన ఆ గొప్ప పనేంటో ఒకసారి తెలుసుకుందాం..


సొంతింటిని పాఠశాలగా మార్చిన లారెన్స్.. 

తమిళ స్టార్ హీరో రాఘవ లారెన్స్ ఒకవైపు సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న కూడా.. మరోవైపు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను తలపెడుతూ చెరగని ముద్ర వేసుకున్నాడు. అందరి మనసులో రియల్ హీరోగా నిలిచాడు. ఎంతోమంది అనాధ పిల్లలను హక్కును చేర్చుకొని ఒక ఆశ్రమాన్ని నడుపుతున్నాడు.. వికలాంగుల పాలిట దైవంగా మారాడు. చదువుకోడానికి లేదా ఇతర వాటికి సాయంగా ఎవరైనా డబ్బులు అడిగితే కాదనకుండా వారికి అడిగినంత సాయం చేస్తూ వస్తున్నాడు. అలాంటి ఈ రియల్ హీరో తాజాగా మరోసారి గొప్ప మనసుని చాటుకున్నాడు. సొంత ఇంటిని ఒక పాఠశాలగా మార్చేందుకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తుంది. తాజాగా ఏర్పాటు చేసిన ఓ ప్రెస్ మీట్ లో లారెన్స్ స్వయంగా చెప్పడంతో ఆయన అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ..నేను డ్యాన్స్ మాస్టర్‌గా పొదుపు చేసిన డబ్బుతో కొన్న మొదటి ఇల్లు ఇది. తరువాత దాన్ని అనాథాశ్రమంగా మార్చాను. ఇప్పుడు మళ్లీ పిల్లల విద్య కోసం అంకితం చేస్తున్నాను అని లారెన్స్ తెలిపారు.. ఈ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

‘రాఘవ లారెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్’.. 

రాఘవ లారెన్స్ రియల్ హీరోనే చెప్పాలి.. ఇదే మాట అందరి నోటా వినిపిస్తుంది. రాఘవ లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ అని పేరుతో ఒక ఆశ్రమాన్ని మొదలుపెట్టారు. అనేకమందికి సహాయం చేసిన ఆయన, అనాథ పిల్లలకు పెద్దదిక్కుగా నిలిచారు. వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు స్థాపించి అనేకమందికి ఆశ్రయం కల్పించారు. ఇటీవల 80 ఏళ్ల వృద్ధుడు రాఘవేంద్ర గురించి సోషల్ మీడియాలో వచ్చిన వీడియో చూసి స్పందించారు. భార్య చేసిన స్వీట్స్‌ను చెన్నై లోకల్ రైళ్లలో అమ్ముతూ జీవనం కొనసాగిస్తున్న ఆ వృద్ధుడికి రూ.1 లక్ష సాయం చేయబోతున్నట్లు ప్రకటించారు. ఆయన వివరాలు తెలిసినవారు చెప్పాలని కోరుతూ, మీకు రైళ్లలో ఆయన కనిపిస్తే స్వీట్స్ కొనుగోలు చేసి సహాయం చెయ్యండి అని అభ్యర్థిస్తు పోస్ట్ పెట్టారు.. ఆ వీడియోని చూసిన ఆయన అభిమానులు రాఘవది గొప్ప మనసు అంటూ సోషల్ మీడియా ద్వారా కామెంట్లు పెడుతున్నారు..


Also Read : Iఅవనిని అవమానించిన అక్షయ్.. భరత్ కోసం మరో ప్లాన్.. మొగుళ్ళ కోసం తోడి కోడళ్ల ఫైట్..

సినిమాల విషయానికొస్తే.. రాఘవ లారెన్స్ ప్రస్తుతం కాంచన 4 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. షూటింగ్ సగం పూర్తయింది. ఈ సినిమాకి తీసుకున్న అడ్వాన్స్‌తో నా మొదటి ఇంటిని పిల్లల కోసం ఉచిత పాఠశాలగా మార్చుతున్నాడు. ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు క్రియేట్ అయ్యాయి. మరి రిలీజ్ అయ్యాక ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో చూడాలి…

Related News

Bollywood Actor : కదులుతున్న రైలు నుంచి దూకేసిన నటి.. అసలేం జరిగిందంటే..?

Jai Krishna : నటుడు జైకృష్ణ ఆ స్టార్ కమెడియన్ మనవడా..? అస్సలు ఊహించలేదు..

Mirai Movie: ‘మిరాయ్’ చిత్రాన్ని వదులుకున్న యంగ్ హీరో.. కారణం ఏంటంటే..?

Bigg Boss 9 Telugu Day 4 Episode : నన్ను టార్గెట్ చేశారు.. సంజన కన్నీళ్లు, ఇమ్మానుయేల్ గొడవ, శ్రీజ దమ్ము ఆర్గుమెంట్స్

Prabhas in Mirai : మిరాయ్‌లో ప్రభాస్? రెబల్ సర్ప్రైజ్ మిస్ అవ్వకండి

Trance Of Omi : ఓజీ vs ఓమి… ఏంట్రా విలన్ కి కూడా ఇంత హైప్ ఇస్తారా?

Raghava Lawrence: నా హృదయాన్ని కదిలించారు.. ప్లీజ్‌ వారి వివరాలు తెలిస్తే నాకు చెప్పండి.. రూ. లక్ష సాయానికి సిద్ధం..

Big Stories

×