Bigg Boss 9 Telugu Thanuja: గత పది వారాలకు టాప్ కంటెస్టెంట్ గా కొనసాగుతుంది తనూజ. మొదటి ఓటింగ్ లో టాప్ ఉంటుంది. మరోవైపు ఈ సీజన్ టైటిల్ ఎత్తుకునేది కూడా తనే అంటూ గట్టి ప్రచారం జరుగుతుంది. ఇందులో నిజమెంతుందో తెలియదు. కానీ, బిగ్ బాస్ ముద్దుబిడ్డ అంటూ తనూజకు విపరీతమైన నెగిటివిటీ పెరుగుతోంది. ఓ వైపు పీఆర్ నుంచి ట్రోలింగ్ ఎక్కువే. మిగతా కంటెస్టెంట్స్ కంటే తనూజని హౌజ్ లో స్పెషల్ గా ట్రీట్ చేస్తున్నారంటూ ఆమెపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. అంతేకాదు టాస్క్ లోనూ బిగ్ బాస్ తనూజకి ఫెవరిటిజం చూపిస్తున్నాడని బయటి వాళ్లు మాత్రమే కాదు హౌజ్ లోని వారు కూడా గట్టిగా నమ్ముతున్నారు.
ఎలిమినేటై బయటకు వచ్చిన శ్రీజ ఆరోపణలతో తనూజకి నెగిటివిటీ మరింత ఎక్కువైంది. బిగ్ బాస్ టైటిల్ తనూజకే అని ఫిక్స్ అయినప్పుడు ఈ ఆటలు, టాస్క్ లు ఎందుకంటూ శ్రీజ దమ్ము విమర్శించింది. దీంతో ఈ సీజన్ విన్నర్ తనూజ అంటూ వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరింది. పైగా ఆమె గెలిపించేందుకు బిగ్ బాస్ టీం విశ్వ ప్రయత్నం చేస్తుందని, ఆమె చేతిలో టైటిల్ పెట్టేందుకు బిగ్ బాస్ టీం వందల కోట్లు ఖర్చు చేస్తుందనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇదంత నిజం కాదని తనూజ సపోర్టర్స్ వాదిస్తున్న యాంటి ఫ్యాన్స్ మాత్రం ఆమెను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. బిగ్ బాస్ ముద్దుబిడ్డ అంటూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు.
ఇంత ట్రోలింగ్ అవుతున్న తనూజ టాప్ కొనసాగడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. దీనికి వెనక బిగ్ బాస్ ఫెవరిజం ఉందంటూ బలంగా నమ్ముతున్నారు. అయితే తనూజ కి ఇంత ఫాలోయింగ్, ఫెవరిటిజం ముఖ్యకారణం బిగ్ బాస్ కాదు. ఆమె స్టార్ మా సీరియల్ హీరోయిన్ అనే విషయం తెలిసిందే. 2014లో అన్నపూర్ణ స్టూడియో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సీరియల్ ముద్దమందారం. సుమారు ఐదేళ్ల పాటు ఈ సీరియల్ టాప్ కొనసాగింది. టీఆర్పీ రేటింగ లోనూ ముందంజలో ఉంది. బుల్లితెర హిస్టరీలోనే ఎన్నుడు లేని విధంగా ఈ సీరియల్ సుమారు 1580 ఎపిసోడ్ లు జరుపుకుని రికార్డు క్రియేట్ చేసింది. ఇందులో తనూజ పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటించిన ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది.
దీంతో తనూజకు ఎంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఈ సీరియల్ తెలుగుతో పాటు మలయాళం, కన్నడలో భాషల్లో హిట్ అయ్యింది. దీంతో తనూజ ఫ్యామిలీ ఆడియన్స్ ఫాలోయింగ్ ఎక్కువ. అందుకే బిగ్ బాస్ లోనూ వారి సపోర్టుతోనే తనూజ టాప్ లో దూసుకుపోతుంది. చాలా కాలం తర్వాత తనూజ బుల్లితెర కనిపించడంతో ఫ్యామిలీ ఆడియన్స్ అంత తనూజ సపోర్టు ఇస్తున్నారు. బిగ్ బాస్ షో చూసేది కూడా ఫ్యామిలీ ఆడియన్సే. ముఖ్యంగా గ్రహిణిలే. కాబట్టి సీరియల్ ప్రేమికులంత కూడా బిగ్ బాస్ తనూజకే ఓటేస్తున్నారు. దీంతో పోలింగ్ ఆమె టాప్ లో ఉంటుంది. పైగా ఈసారి స్టార్ సెలబ్రిటీలు, బలమైన కంటెస్టెంట్స్ లేకపోవం కూడా తనూజ ప్లస్ అయ్యింది.
తనూజ కంటే స్ట్రాంగ్ అయిన భఱి ఆట పేలవంగా ఉండటం, ఇమ్మాన్యుయేల్ ఇప్పటి వరకు నామినేషన్ లోకి రాకపోవడం ఇమ్మూ సపోర్ట్స్ లో కొంతమంది కూడా తనూజకి ఓటేస్తున్నారు. అలా తనూజ టాప్ లో కొనసాగుతుంది. ఇలా వివిధ కారణాలతో తనూజ టాప్ దూసుకుపోతుంది తప్ప.. బిగ్ బాస్ టీం ప్రత్యేకించి ఆమె కోసం ఖర్చు చేస్తుందేమి లేదు. బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీ రూ. 50 లక్షలు ఉంటే వందల కోట్లు ఖర్చు అంటే అది మించిన ఆర్థిక భారమే. అంతగా అనుకుంటే తనూజకి మరిన్ని సీరియల్స్ లో ఆఫర్స్ ఇచ్చిన తమ ఫెవరిజం చూపించుకోవచ్చు. అంతేకాదు ఆమె గెలవడం కోసం బిగ్ బాస్ కోట్లు ఖర్చు చేస్తున్నాడన్న రూమర్స్ లో అసలు అర్థమే లేదు. కాబట్టి ట్రోలర్స్ ఇప్పటికైన కళ్లు తేరిచి తనూజని టార్గెట్ చేయడం మానుకుంటే మంచిదని ఆమె సపోర్టర్స్ అంటున్నారు.