E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu Day 104 : తనూజను బెదరగొట్టిన శివాజీ… సీజన్ 10 ట్విస్ట్ తీసుకొచ్చిన శ్రీముఖి – ప్రదీప్… గాయపడ్డ కళ్యాణ్

Bigg Boss 9 Telugu Day 104 : తనూజను బెదరగొట్టిన శివాజీ… సీజన్ 10 ట్విస్ట్ తీసుకొచ్చిన శ్రీముఖి – ప్రదీప్… గాయపడ్డ కళ్యాణ్
Advertisement

Bigg Boss 9 Telugu Day 104 : బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఎవరో మరికొన్ని గంటలో తేలిపోనుంది. ఈరోజు స్ట్రీమింగ్ అయిన డే 104 ఎపిసోడ్లో టాప్ 5తో సెలబ్రిటీలు సందడి చేశారు. హౌస్ లోకి సినీయర్ హీరోయిన్ లయ, శివాజీ, రోహన్ ఎంట్రీ ఇచ్చారు. ‘సాంప్రదాయినీ సుప్పిని సుద్దపూసని’ సినిమా ప్రమోషన్లలో భాగంగా  అడుగుబెట్టిన ఈ టీం అందరి ఆట తీరును ప్రశంసించారు. ముందుగా తనూజను మెడికల్ రూమ్ కి పిలిపించి భయపెట్టారు శివాజీ. సడన్ గా ఎంట్రీ ఇచ్చి అందరినీ రోస్ట్ చేశారు. తర్వాత లయతో కలిసి తర్వాత డెమోన్ – రీతూలను ఇమిటేట్ చేశారు. తరువాత హౌస్ మేట్స్ తో బిగ్ బాస్ ఇచ్చిన వస్తువులలో ఏది నీటిలో తేలుతుందో గెస్ చేసే టాస్క్ పెట్టి, టాటా బై బై చెప్పారు శివాజీ టీం.

నిధి రాక – కళ్యాణ్ కు దెబ్బ 

అనంతరం బిగ్ బాస్ వేదికపై ‘ది రాజా సాబ్’ ప్రమోషన్లని షురూ చేశారు. అందులో భాగంగా ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటించిన నిధి అగర్వాల్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టింది. “పాపలకి పాప నిధి పాపా” అంటూ ఇమ్మానుయేల్ తెగ సందడి చేశాడు. ఇమ్మూ తనకు ముందే తెలుసని నిధి చెప్పింది. “ది రాజాసాబ్ అనేది హర్రర్ మూవీ అన్న విషయం మీకు అందరికీ తెలిసిందే. ఈ హౌస్ లో ఉన్న మోస్ట్ హర్రర్ స్టోరీ ఏంటి” అని హౌస్ మేట్స్ ని అడిగింది. వెంటనే ఇమ్మూ అందరికీ హర్రర్ స్టోరీ ఉంటుంది. మేము మాత్రం హర్రర్ ని ఈ సీజన్ మొత్తం పక్కన పెట్టుకున్నామంటూ సంజనాను చూపించాడు.

Advertisement

“మీరు విన్ అయితే ఏం చేయబోతున్నారు?” అని అడిగింది నిధి. సమాధానం చెప్పిన డిమాన్ పై సెటైర్ వేసి నవ్వించింది. మొత్తానికి సంజన తప్ప అందరూ తమ గోల్ సినిమానే అని చెప్పారు. ఆ తర్వాత బిగ్ బాస్ నిధి అగర్వాల్ సంచాలక్ గా బీన్ బ్యాగ్ – కళ్ళకు గంతలు ఆట ఆడించారు. ఈ క్రమంలో నిధితో ఇమ్మూ నెక్ట్స్ లెవెల్ ఫ్లర్టింగ్ చేసి తెగ నవ్వించాడు. అంతా సరదాగా సాగుతుండగా, కళ్యాణ్ బ్లైండ్ ఫోల్డ్ కట్టుకుని డోర్ కి గుద్దుకున్నాడు. కన్నుపై రక్తం కారడంతో అతన్ని మెడికల్ రూమ్ కి తీసుకెళ్లారు. ట్రీట్మెంట్ తరువాత బ్యాండేజ్ వేసి తీసుకొచ్చారు. ఈ టాస్క్ లో సంజన గెలిచింది.

సీజన్ 10కి అప్పుడే మెసేజులు 

తర్వాత ‘బీబీ జోడి సీజన్ 2’ ప్రమోషన్లలో భాగంగా శ్రీముఖి, యాంకర్ ప్రదీప్ మాచిరాజు హౌస్ లోకి అడుగు పెట్టారు. ముందు ప్రదీప్ ఒక్కడే వచ్చి స్క్రీన్ లో కొన్ని పిక్చర్స్ చూపించి, అందులోని జంతువులు ఎలా సౌండ్ చేస్తాయో హౌస్ మేట్స్ ను చేసి చూపించమన్నారు. అతను వెళ్లిపోయాక శ్రీముఖి అడుగు పెట్టింది. ఇక చిట్టి బాబు ఒక కేక్ ఆర్డర్ చేస్తాడు భానుమతి కోసం. దాన్ని డెలివరీ చేసేది పుష్ప అంటూ టాస్క్ ఇచ్చింది శ్రీముఖి. కళ్యాణ్ చిట్టిబాబుగా, భానుమతిగా తనూజా, ఇమ్మూ పుష్పగా నటించారు. టాస్క్ అయిపోయాక గుడ్ బై చెప్పినట్టే చెప్పి, మళ్ళీ ప్రదీప్, ‘బ్యాండ్ రుద్ర’ రుద్రతో కలిసి వచ్చింది శ్రీముఖి.

Advertisement

ఈ హౌస్ లో ఫస్ట్ టైమ్ చూసినప్పుడు ఎలా అన్పించింది? ఇప్పుడెలా ఉందో ఒక్కొక్కరుగా చెప్పమని అడిగింది శ్రీముఖి. అలా ఒక్కొక్కరూ చెబుతూ ఉంటే, బ్యాండ్ సభ్యులు దానికి తగ్గట్టుగా పాటలు వేశారు. అనంతరం సీజన్ 10లో రాబోయే కంటెస్టెంట్ కోసం మీరేం మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నారు? దాన్ని ఈ సీసాలో రాసి, ఇదే బిగ్ బాస్ హౌస్ లో పెట్టండి. వచ్చే ఏడాది కొత్త కంటెస్టెంట్లు ఆ మెసేజ్ ను చదువుతారు” అంటూ నెక్స్ట్ సీజన్ ట్విస్ట్ ఇచ్చారు శ్రీముఖి. చివరగా కేక్ కోసి ఫేర్ వెల్ పార్టీని సెలబ్రేట్ చేసుకున్నారు.

Read Also : ‘పుష్ప’ స్టెప్పులు ఇరగదీసిన డెమోన్, ఇమ్మూ… లేడీ గెటప్ లో అరాచకం… దెబ్బకు దిగొచ్చిన బిగ్ బాస్

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×