BiggBoss 10 : బుల్లితెర టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇప్పటికే తెలుగులో 9 సీజన్లు పూర్తి చేసుకుంది.. గతంలో వచ్చిన సీజన్లతో పోలిస్తే.. గతంలో వచ్చిన తొమ్మిదవ సీజన్ మాత్రం ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ని అందుకుంది. అంతే కాదు ఈ సీజన్ కి ముందు నిర్వహించిన అగ్నిపరీక్ష సీజన్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇకపోతే ప్రస్తుతం సీజన్ 10 కోసం జనాలు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ సీజన్ ప్రారంభం కాబోతుంది అని తెలుస్తుంది. బిగ్బాస్ సీజన్ 10 కి సంబంధించిన ప్రోమో అని కూడా మేకర్స్ రిలీజ్ చేయడంతో త్వరలోనే సీజన్ ప్రారంభం కాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈసారి సెలబ్రిటీల లిస్ట్ మాత్రం కాస్త డిఫరెంట్ గా ఉంటుందని తెలుస్తుంది. మరి ఎవరు ఊహించని విధంగా వివాదాలకు కేరాఫ్ గా మారిన హీరోయిన్ కంటెస్టెంట్ గా రాబోతుంది అంటూ ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో షికారు చేస్తుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నా టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ త్వరలోనే ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే.. అయితే ఈ సీజన్ కి కూడా అగ్ని పరీక్షలు త్వరలోనే నిర్వహించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సెలబ్రిటీల విషయానికొస్తే ఈమధ్య వార్తల్లో ఎక్కువగా వినిపిస్తున్న వాళ్లని మాత్రమే బిగ్ బాస్ లోకి తీసుకురా పోతున్నారని టాక్.. ఇంతకీ ఆ క్రేజీ హీరోయిన్ ఎవరో కాదు ఒకప్పుడు తెలుగులోని స్టార్ హీరోలు అందరి సరసన నటించి ప్రేక్షకులను మెప్పించిన ముద్దుగుమ్మ కస్తూరి శంకర్.. ఈమధ్య సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు సీరియల్స్ లలో నటిస్తూ వస్తుంది.. ఒకవైపు సీరియల్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న కూడా.. మరోవైపు తనకు సంబంధం లేని విషయాలలో తలదురుస్తూ నిత్యం వార్తల్లో హైలెట్ అవుతూ వస్తుంది. ఈమె బిగ్ బాస్ 10 లోకి రాబోతుంది అంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఇదైతే నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.. ఈమెకు రోజుకు దాదాపు లక్ష రూపాయలు రెమ్యూనరేషన్ ఇవ్వనున్నట్లు టాక్.. ఒకవేళ ఈమె హౌస్ లోకి ఎంటర్ అయితే మాత్రం రచ్చ రచ్చ అని బిగ్ బాస్ ఫాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.
Also Read:ఈ వారం బాక్సాఫీస్ వార్.. థియేటర్లలో సందడి చెయ్యబోతున్న చిత్రాలు..
తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ కోసం జనాలు ఎంతగా వెయిట్ చేస్తున్నారో చెప్పనక్కర్లేదు. తొమ్మిదవ సీజన్ భారీ హిట్ అవడంతో పదో సీజన్ అంతకుమించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.. ఈమధ్య బిగ్ బాస్ సీజన్ 10 కి సంబంధించిన ప్రోమో ని కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే.. ఈ సారి బిగ్ బాస్ 10 సీజన్ గత సిజన్‌కంటే భిన్నంగా ఉండనుంది. గత కొన్ని రోజుల నుంచి బీబీ సీజన్ 10కి సంబంధించిన సన్నాహాలను మొదలెట్టేశారు. అయితే ఈసారి గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ కొత్తగా ఉండేలా ప్లాన్ కూడా చేస్తున్నారు. ఎప్పటిలాగే నాగార్జుననే హాస్టల్ గా వ్యవహరిస్తున్నారు.. ఇందులో పాల్గొనబోయే కంటెస్టెంట్లు వీల్లే అంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఈసారి ఎలాంటి కంటెస్టెంట్లు హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారు చూడాలి…