Siri Hanumanth : బుల్లితెర ప్రేక్షకులకు సిరి హనుమంతు పేరు గురించి తెలిసే ఉంటుంది. ఈమధ్య జబర్దస్త్ కి యాంకర్ గా చేసిన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో హైపర్ ఆక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది. అందం అభినయం ఉన్న సరే పెద్దగా అవకాశాలు లేకపోవడంతో ఈమె అంతగా క్రేజీ హీరోయిన్ గా మారలేదు. అయితే సిరి కూడా సినిమాల్లో అవకాశాలు అందుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈమధ్య పలు సినిమాలలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. సిరి యాంకర్ గా, నటిగా మాత్రమే కాదు. సోషల్ మీడియాలో ఈమెకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మరి నెలకు ఈ కుర్ర బ్యూటి ఎంత సంపాదిస్తుంది.? సోషల్ మీడియా ద్వారా ఈమె ఆదాయం ఎంత అన్నది ఇప్పుడు మనం కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..
సోషల్ మీడియాని నమ్ముకొని ఎంతోమంది బాగా సంపాదిస్తున్నారు. ఒకవైపు పేరును మాత్రమే కాదు. డబ్బులు కూడా బాగానే తీసుకుంటున్నారు.. అలా సోషల్ మీడియా ఇన్ఫ్లెన్సర్ గా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న ముద్దుగుమ్మ సిరి హనుమంతు.. యూట్యూబర్ షణ్ముఖ యశ్వంత్ తో కలిసి ఈమె చేసిన వీడియోలు మంచి టాక్ ని సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ఆమె నెలకు దాదాపు 6-7 లక్షల వరకు సంపాదిస్తుందని తెలుస్తుంది.. మరోవైపు తనకున్న యూట్యూబ్ ఛానల్ ద్వారా నెలకు దాదాపు పది లక్షల వరకు సంపాదిస్తుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఎటువంటి సినిమాలు సీరియల్స్ చేయకుండానే సోషల్ మీడియా ద్వారా లక్షల్లో సంపాదించడం మామూలు విషయం కాదు. సిరి హనుమంతు మంత్రం అది సాధించి చూపించింది. ఈమధ్య జబర్దస్త్ లో యాంకర్ గా చేసింది కానీ అది పెద్దగా ఆమెకు వర్కౌట్ అవలేదు. ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉందని తెలుస్తుంది..
Also Read :బిగ్ బాస్ యష్మీ చేసిన బిగ్ మిస్టేక్..సీరియల్స్ కు గుడ్ బై..?
ఈ అమ్మడు ఆంధ్రాకు చెందిన అమ్మాయి. తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో సిరి ఆలనాపాలనా తల్లే చూసుకుంది. చిన్ననాటి నుంచి యాక్టివ్‌గా ఉంటుంది. టిక్ టాక్ వీడియోలు, షార్ట్ యూట్యూబ్ వీడియోల ద్వారా బాగా పాపులర్ అయింది. బిగ్‌బాస్‌లో షణ్ముక్‌తో ప్రేమాయణం నడిపి నెగిటివిటీ మూటగట్టుకుంది. ఇక బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన దగ్గరి నుంచి తన యూట్యూబ్ లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కూడా చేసింది అంటూ ఆ మధ్య వార్తలు వినిపించాయి. ఇప్పుడు వీడియోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. ఇక పాప సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలుసు. ట్రెండ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సిరి హాట్ లుక్ లో ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది.. గ్లామర్ డోర్స్ ని పెంచుతూ ఆమె దిగుతున్న ఫోటోలు క్షణాల్లో ట్రెండ్ అవుతూ వస్తున్నాయి. కొన్నిసార్లు ఆమె ఫోటోషూట్లపై ట్రోల్స్ వినిపిస్తున్న సరే వాటిని పట్టించుకోకుండా తన పని ఏదో తాను చేసుకుంటుంది.. తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడన్న విషయం తెలిసిందే. త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అంటూ మరో వార్త ఇటీవల బాగా వినిపిస్తుంది.. మరి ఆ గుడ్ న్యూస్ కూడా చెబుతుందేమో చూడాలి..