E-Paper
Advertisement

Bigg Boss 9 Elimination: ఈ వీకెండ్‌ ఇద్దరు అవుట్‌.. సంజనతో పాటు అతడు కూడా..!

Bigg Boss 9 Elimination: ఈ వీకెండ్‌ ఇద్దరు అవుట్‌.. సంజనతో పాటు అతడు కూడా..!
Advertisement

Bigg Boss 9 Telugu Elimination: బిగ్ బాస్ 9 చివరి ఘట్టంకు చేరుకుంది. రేపటితో ఈ రియాలిటీ షోకు ఎండ్‌ కార్డ్‌ పడనుంది. ఇక సీజన్‌ టైటిల్ ఎత్తేది ఎవరా ఆడియన్స్‌ అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం హౌజ్ లో టాప్‌ 5 కంటెస్టెంట్స్‌గా కళ్యాణ్‌ పడాల, తనూజ, డిమోన్‌ పవన్‌, ఇమ్మాన్యుయేల్‌, సంజన గల్రానీలు ఉన్నారు. ఈ టైటిల్​ పోరులో ఉన్న టాప్​ 5 కంటిస్టెంట్లు ‘నువ్వా–నేనా?‘ అంటున్నారు. అయితే వీరిలో విజేత ఎవరనేది ఉత్కంఠ నెలకొంది. మెజారిటీ ఆడియన్స్‌ మాత్రం తనూజ–కళ్యాణ్‌ పడాలకే ఓటేస్తున్నారు. వీరిద్దరిలో ఎవరోకరు విన్నర్‌ అని డిసైడ్‌ చేస్తున్నారు.

విన్నింగ్ రేసులో ఇద్దరు

Advertisement

ప్రస్తుతం ఉన్న సోషల్‌ మీడియా బజ్ ప్రకారం చూస్తే టైటిల్‌ విన్నర్‌ రేసులో తనూజ, కళ్యాణ్‌ పడాలు నువ్వా–నేనా అన్నట్టు పోటీ పడుతున్నారు. ఎప్పటికప్పుడు ఓటింగ్‌లు తారుమారు అవుతున్నారు. టాప్‌ 2 వీరిద్దరి పేర్లు తారుమారు అవుతున్నాయి. దీంతో రోజు రోజుకు బిగ్‌ బాస్‌ విన్నర్‌పై ఉత్కంఠ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇక బిగ్‌ బాస్‌ షోకి ముగింపు దగ్గరికి వచ్చేసింది. ఈ రోజు వీకెండ్‌ ఎపిసోడ్ (శనివారం) ఇద్దరిని ఎలిమినేషన్‌కి బిగ్‌ బాస్‌ స్కేచ్‌ వేశాడు. అయితే ఇందులో ఆ ఇద్దరు ఎవరనేది ఆడియన్స్‌లో అమితాసక్తి నెలకొంది. మరి ఈ శనివారం వెళ్లిపోతున్న ఆ ఇద్దరు ఎవరు? ఎవరన్నది ఇప్పుడు చూద్దాం.

ఓటింగ్ లో ట్విస్ట్

ఈ వారం ఓటింగ్‌లో లీస్ట్‌లో ఉన్న ఇద్దరిని హౌజ్ నుంచి బయటకు పంపనున్నారు. ఇప్పటికే నేటి ఎపిసోడ్‌కి సంబంధించిన షూటింగ్‌ కూడా పూర్తయినట్టు తెలుస్తోంది. విన్నర్​ కోటాలో కల్యాణ్ పడాల, తనూజను పక్కన పెట్టగా.. మిగిలిన ముగ్గురిలో హౌజ్​ ను వీడబోయేది ఎవరనేదానిపై తీవ్ర చర్చ జరుగుతుంది. చాలా మంది ఈ వారం ఎలిమినేట్‌ అయ్యే వారిలో సంజన ఉందని అంటున్నారు. ఓటింగ్‌ జాబితాలో లీస్ట్‌లో తనే ఉన్నట్టు సమాచారం. ఈ టాప్‌ 5లో ఉన్న వారిలో అందరు స్ట్రాంగ్‌ కంటెస్టెంట్సే. మిగతా నలుగురితో పోలిస్తే సంజనే కాస్తా వీక్‌. మిగిలిన నలుగురు విన్నింగ్‌ కంటెస్టేంట్స్‌.

సంజన, ఇమ్మాన్యుయేల్ అవుట్

Advertisement

అయితే కళ్యాణ్‌, తనూజల తర్వాత విన్నర్‌ కంటెస్టెంట్స్‌ లో ఇమ్మాన్యుయేల్‌, డిమోన్‌లు ఎవరంటే తేల్చడం కష్టమే. ఇక ఇప్పుడు లీస్ట్‌ కంటెస్టెంట్‌లో కూడా వీరిద్దరిని ఆడియన్స్‌ తేల్చలేకపోతున్నారు. దీంతో సంజన తర్వాత ఈ వారం ఎలిమినేట్ అయ్యే మరో వ్యక్తి ఎవరనేది అంచనాకు రావడం లేదు. ఓటింగ్‌ ప్రకారం చూస్తే వీరిద్దరి మధ్య గట్టి పోటీ కొనసాగుతుంది. కానీ, ఈ సీజన్‌ మొదటి నుంచి అంచనాలను తారుమారు చేసే ట్విస్టులు ఎదురవుతున్నాయి. దీంతో ఆడియన్స్‌ కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. సంజనతో పాటు ఇమ్మాన్యుయేల్‌ కూడా ఈ రోజు ఎలిమినేట్‌ అవుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ రోజు ముందుగా సంజన ఎలిమినేట్‌ అవ్వగా.. ఆ తర్వాత ఇమ్మాన్యుయేల్ హౌజ్ ని విడనున్నారట.

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×