E-Paper
Advertisement

Bigg Boss 9 Finale: రూ. 15 లక్షల సూట్‌కేస్‌తో డిమోన్‌ బయటకు.. ఇక టాప్‌2 వీరిద్దరే!

Bigg Boss 9 Finale: రూ. 15 లక్షల సూట్‌కేస్‌తో డిమోన్‌ బయటకు.. ఇక టాప్‌2 వీరిద్దరే!
Advertisement

Bigg Boss 9 Telugu Finale: బిగ్‌ బాస్‌ విన్నర్‌ ఎవరా అంత ఉత్కంఠ ఎదురుచూస్తున్నారు. ఈసారి ట్రోఫి ఎవరి కైవసం అవుతుందనేది ఎవరూ అంచనాకు అందడం లేదు. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్‌ ప్రకారం కళ్యాణ్ పడాల, తనూజలో ఒకరు టైటిల్‌ గెలిచే అవకాశం ఉంది. కానీ, విన్నర్‌ ఎవరనేది మాత్రం ఖచ్చితంగా తేల్చడం లేదు. అయితే తాజాగా విడుదలైన ప్రొమో ప్రకారం టాప్‌ 5లో లీస్ట్‌ ఉన్న వారిని హౌజ్ నుంచి బయటకు తీసుకువచ్చేందుకు గెస్ట్‌గా వచ్చిన శ్రీకాంత్‌ హౌజ్‌లోకి వెళ్లాడు. లోపలికి వెళ్లిన ఆయన సంజనని ఎలిమినేట్‌ చేసి బయటకు తీసుకువచ్చారట. ఆ తర్వాత టాప్‌ 4లో ఇమ్మాన్యుయేల్‌ ఎలిమినేట్‌ అయినట్టు టాక్‌ వినిపిస్తుంది.

రూ. 15లతో డిమోన్ జంప్

Advertisement

ఇక హౌజ్‌లో టాప్‌ 3 ఉండగా.. వారిలో ఒకరు కాసేటికి క్రితమే బయటకు వచ్చారు. కళ్యాణ్‌ పడాల, తనూజ, డిమోన్‌లో టాప్‌ 3లో ఉన్నారు. లేటెస్ట్‌ వినిపిస్తున్న బజ్‌ ప్రకారం డిమోన్‌ పవన్‌ సూట్‌ కేస్‌ తీసుకుని బయటకు వచ్చినట్టు సమాచారం. మొదటి సూట్‌కేసులో రూ. 10 లక్షలు ఉందట. టాప్‌ 3ని ఆకర్షించేందుకు సూట్‌కేస్‌ ప్రైజ్‌ని రూ. 10 లక్షల నుంచి రూ. 15 లక్షలకు పెంచారు. దీంతో డిమోన్‌.. వెనక్కి తగ్గి సూట్‌కేస్‌ తీసుకుని కాసేటి క్రితమే హౌజ్ నుంచి బయటకు వచ్చినట్టు టాక్‌ వినిపిస్తుంది. దీంతో ప్రస్తుతం హౌజ్‌లో టాప్‌ 2లో కళ్యాణ్‌, తనూజలు ఉన్నారు. కాసేపట్లో వీరిలో విన్నర్‌ ఎవరనేది కాసేపట్లో తేలనుంది.

సూట్ కేస్ తో రవితేజ ఎంట్రీ 

కాగా బిగ్ బాస్ ఫినాలే కోసం మాస్ మహారాజ రవితేజ అతిథిగా వచ్చి సందడి చేశారు. తన లేటెస్ట్ మూవీ భర్త మహశయులకు విజ్ఞప్తి మూవీ ప్రమోషన్స్ కోసం తన మూవీ హీరోయిన్ ఆషికా రంగనాథన్ తో కలిసి బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చారు. ఈ సందర్బంగా రవితేజ, ఆషికాలు బ్రీఫ్ కేస్ తీసుకుని లోపలికి వెళ్లారు. టాప్ 3లో ఉన్న వారిలో ఒకరికి ఈ  షూట్ కేస్ ఆఫర్ చేశారు. తమదే టైటిల్ అని గట్టి నమ్మకంతో ఉన్న తనూజ, కళ్యాణ్ పడాలు రవితేజ్ ఆఫర్ తిరస్కరించినట్టు తెలుస్తోంది. దీంతో డిమోన్ ఈ ఆఫర్ యాక్సెప్ట్ చేసి సూట్ కేస్ తీసుకున్నాడు. దీంతో టాప్ 3 ప్లేస్ నుంచి డిమోన్ రూ. 15 లక్షల సూట్ కేస్ హౌజ్ నుంచి బయటకు వచ్చారు. ప్రస్తుతం టాప్ 3లో ఉన్న తనూజ, కళ్యాణ్ పడాల మధ్య రణరంగం మొదలైంది. మరి వీరిలో అత్యధిక ఓట్లు తెచ్చుకుని బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ టైటిల్ గెలిచేది ఎవరనేది కాసేపట్లో రివీల్ కానుంది. వీరిద్దరి తనూజ విన్నర్ అయ్యే అవకాశం ఎక్కువ ఉందంటున్నారు. 

Advertisement

Also Read: Bigg Boss 9 Finale Promo: బిగ్‌ బాస్‌ ముగింపు.. సైమన్‌ లుక్‌లో నాగ్ ఎంట్రీ.. హౌజ్‌లోనే విన్నర్‌ అనౌన్స్‌మెంట్స్‌.. అదిరిన ప్రొమో

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×