Bigg Boss Buzzz : బిగ్ బాస్ సీజన్ 9 ఈ వారం ఇద్దరు ఎలిమినేట్ అయిపోయిన సంగతి తెలిసిందే. ఫైర్ స్ట్రోమ్ లో భాగంగా ఆరుగురు కంటెస్టెంట్లు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. వారిలో దువ్వాడ మాధురి, రమ్య మోక్ష, నిఖిల్ , గౌరవ్ గుప్తా, శ్రీనివాస్ సాయి వీళ్లు ఎంటర్ అయ్యారు. అయితే ప్రస్తుతం వీళ్ళందరూ కూడా బయటకు వచ్చేసారు.
ఎలిమినేట్ అయిపోయిన తర్వాత శివాజీ ఇంటర్వ్యూ చేసే విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. దీనికి బిగ్ బాస్ బజ్ అనే పేరు పెట్టారు. ఈ వారం నిఖిల్ మరియు గౌరవ్ ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి ఇద్దరూ కలిసి ఎపిసోడ్లో జాయిన్ అయ్యారు. మామూలుగా శివాజీ చేసే ఎపిసోడ్ ఇప్పుడు సీరియస్ గా ఉంటుంది. కానీ ఇది కంప్లీట్ గా ఫన్ అని చెప్పాలి. ప్రోమో కూడా అలానే కట్ చేశారు.
మీ ఇద్దరినీ చూస్తుంటే గుండమ్మ కథలో ఏఎన్ఆర్ ఎన్టీఆర్ లా అనిపిస్తున్నారు. నిఖిల్ హౌస్ లో హైడెన్ సీక్ చాలా బాగా ఆడావు. స్టార్టింగ్ లో వెళ్ళావ్ మళ్ళీ ఇప్పుడే కనిపించావు మధ్యలో అంతా హైడ్ అయిపోయావు.
గౌరవ్ మీరేంటి బేసిగ్గా ఆర్టిస్ట్ కదా మరి హౌస్ లో ఎందుకు జర్నలిస్టుల బిహేవ్ చేశారు. ఆడియన్స్ ని గెలవాలి అంటే హౌస్మేట్స్ ని గెలవాలి. దీనికి సమాధానంగా నేను ఆడియన్స్ ని గెలిచాను అందుకే 5 వారాలు నామినేషన్ లో రాలేదు నేను. వాళ్లకి పాయింట్స్ ఏమీ లేవు కాబట్టి నేను బయటికి వచ్చేసాను. పాయింట్స్ ఉండాలి అంటే నువ్వు కనిపించాలి అని శివాజీ సమాధానం ఇచ్చాడు. ఇదే విషయాన్ని పక్కనుంచి గౌరవ్ కరెక్ట్ అన్నాడు.
ఇంకా గౌరవ్ ప్రశ్నిస్తూ ప్రతిదానికి గొడవ పెట్టుకుంటున్నావ్ అని శివాజీ అడిగారు. నాకేం తెలీదు అని గౌరవ సమాధానం చెప్పాడు. అదే కదా నేను అంటున్న నీకు అసలు ఏమీ తెలియదు అని అన్నాడు శివాజీ. మధ్యలో శ్రీకాకుళం యాసను కూడా మాట్లాడాడు. మొత్తానికి సీరియస్ గా సాగాల్సిన బిగ్ బాస్ బజ్ ఎంటర్టైన్ గా సాగింది.
మొత్తానికి ఫైర్ స్ట్రోమ్ లో భాగంగా వెళ్ళిన వాళ్లంతా కూడా అంతే ఫైర్ తో బయటికి వచ్చేసారు. ఇదంతా చూస్తుంటే బిగ్ బాస్ స్క్రిప్ట్ లో బాగా అనే డౌట్ కూడా వస్తుంది. ఒకసారిగా అందరినీ లోపలికి పంపించడం ఎందుకు ఇలా డబల్ ఎలిమినేషన్ ఎందుకు అనే డౌట్ చాలా మందికి ఇప్పటికే వచ్చింది.
Also Read: Bigg Boss 9 : ఈ రీతూ పాప ఓవర్ యాక్టింగ్ తట్టుకోలేకపోతున్నాం, ఎవరిని చూసినా ఫ్యాన్ అంటుంది