E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu Promo : రీతూ vs ఇమ్మూ.. నామినేషన్ లో మళ్లీ రచ్చ.. పవన్ నువ్వు సూపర్ అంతే..

Bigg Boss 9 Telugu Promo : రీతూ vs ఇమ్మూ.. నామినేషన్ లో మళ్లీ రచ్చ.. పవన్ నువ్వు సూపర్ అంతే..
Advertisement

Bigg Boss 9 Telugu Promo : తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ మరికొద్ది రోజుల్లో పూర్తి కానుంది.. ఈ సీజన్ చివరి అంకానికి వచ్చిన నేపథ్యంలో బిగ్ బాస్ ప్రతి ఎపిసోడ్ కి ఏదో ఒక ట్విస్ట్ ఇస్తూనే ఉన్నాడు. 12వ వారం ఎలిమినేషన్స్ అందరూ ఊహించినట్టుగానే దివ్య హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయింది.. అయితే గత వారం డబల్ ఎలిమినేషన్ ఉంటుందని అందరూ అనుకున్నారు.. కానీ దివ్య మాత్రమే హౌస్ నుంచి వెళ్ళిపోయింది.. ఇక ఈ వారం నామినేషన్ ప్రక్రియ మొదలైంది.. ఇవాళ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో ని బిగ్ బాస్ రిలీజ్ చేశారు.. ఎప్పటిలాగే నామినేషన్స్ రచ్చ రచ్చగా సాగినట్లు ప్రోమో చూస్తే కనిపిస్తుంది. మరి ఎవరు ఎవరిని నామినేట్ చేశారు అన్నది ప్రోమోలో చూసేద్దాం..

ఇమ్మూ vs రీతూ గొడవ.. 

గత రెండు వారాలుగా నామినేషన్స్ లో ఇమ్మానుయేల్, రీతు గొడవ పడుతున్న విషయం తెలిసిందే.. ఈవారం కూడా వీరిద్దరి గొడవతోనే నామినేషన్స్ మొదలైనట్లు ప్రోమోలో కనిపిస్తుంది.. ఇప్పటినుంచి మీరు మాట్లాడే మాట, ఆడే ఆట ఫైనల్ కు చేరువయ్యేలా చేస్తాయా? హౌస్ నుంచి వెనుతిరిగి పంపిస్తాయా? అన్నది నిర్ణయించయిబోతున్నాయని బిగ్ బాస్ అంటాడు. అనంతరం ఇమ్మూ, రీతూను నామినేట్ చేస్తాడు.. నాగ్ సార్ అడిగినప్పుడు వెనకడుగు వేయడం తప్పే అని ఇమ్ము అనగానే రీతు రెచ్చిపోతుంది.. అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట మాట్లాడడం మంచిది కాదు అని అంటుంది.. దాంతో వీరిద్దరి మధ్య పెద్ద రచ్చ జరుగుతుంది. ఇమ్మాన్యుయేల్ రీతూ చౌదరిని కారణం చెప్పి నామినేట్ చేసి బీర్ బాటిల్ ను తలపై పగలగొడతాడు..

హిటెక్కించిన 13వ వారం బిగ్ బాస్ నామినేషన్స్.. 

Advertisement

12 వారాలు సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ 13వ వారంలోకి అడుగు పెట్టింది.. ఈవారం అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్లు కావడంతో ఎవరు హౌస్ నుంచి ఎలిమెంట్ అవుతారా అన్న ఆసక్తి జనాల్లో కనిపిస్తుంది.. గతవారం దివ్య ఎలిమినేట్ అవ్వగా.. సంజన సేఫ్ అయింది. ఇవాళ సోమవారం ఎపిసోడ్లో నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది.. తాజాగా ఇవాళ ఎపిసోడ్ ప్రోమోను బిగ్ బాస్ రిలీజ్ చేశాడు. ఈ ప్రోమో ప్రకారం చూస్తే.. రీతుని నామినేట్ చేస్తాడు ఇమ్మానుయేల్.. భరణి నా మెడిసిన్స్ ని దొంగతనం చేయడం మీరు ఫన్ అనుకుంటున్నారా అని సంజన ను నామినేట్ చేస్తాడు.. ఆ తర్వాత రీతూ, సుమన్ శెట్టిని నామినేట్ చేస్తుంది.. భరణి ఎప్పుడైతే మనం ఫోకస్ గా ఉండలేమో.. అప్పుడు 100 శాతం ఎఫర్ట్ పెట్టలేము.. నువ్వు నీ గేమ్ మీద ఫోకస్ చెయ్యమని భరణి పవన్ ను నామినేట్ చేసి తలపై బాటిల్ ని పగలగొట్టేస్తాడు.

హౌస్ మెట్స్ కు పవన్ ఛాలెంజ్..

భరణి పవన్ ని నామినేట్ చేసిన తర్వాత పవన్ మాట్లాడుతూ.. ఐయామ్ చాలెంజింగ్ ఎవరీ వన్.. ఈ వీక్ టికెట్ టు ఫినాలే కొట్టేది నేనే గుర్తుపెట్టుకోండి అని పవన్ హౌస్ మేట్స్ తో ఛాలెంజ్ చేస్తాడు. దాంతో ప్రోమో ఎండ్ అవుతుంది. మొత్తానికి ప్రోమోను చూస్తే.. ఈ వీక్నామినేషన్స్ వాడీ వేడిగా జరుగుతున్నాయి.. మరి ఇప్పటివరకు నామినేట్ అయిన వారిలో ఎవరు ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారో చూడాలి..

Advertisement

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×