BigTV English

Bigg Boss Buzz : ఎట్టకేలకు నిజం ఒప్పుకున్న సోనియా.. ఇంత కథ నడిపిందా..?

Bigg Boss Buzz : ఎట్టకేలకు నిజం ఒప్పుకున్న సోనియా.. ఇంత కథ నడిపిందా..?

Bigg Boss Buzz.. బిగ్ బాస్ సీజన్ 8.. బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఎనిమిదవ సీజన్ వచ్చేసింది. అయితే ఇందులో 4 వారాలు పూర్తయ్యాయి. మొదటి వారంలో భాగంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ బెజవాడ బేబక్క ఎలిమినేట్ అవ్వగా, రెండవ వారం శేఖర్ బాషా మూడవ వారం అభయ్ నవీన్ ఎలిమినేట్ అయ్యారు. ఇక నాలుగో వారం ఆడ పులి అని, టాప్ 5 కి వెళ్తుంది అని, హౌస్ లో మంచి కంటెంట్ ఇస్తోంది కాబట్టి ఖచ్చితంగా ఎలిమినేట్ అవ్వదు అంటూ చాలామంది అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కానీ ఈమె చేసిన ఓవరాక్షన్ పర్ఫామెన్స్ లేకపోవడం వల్ల ఈ వారం బయటకు వచ్చింది. ఆమె ఎవరో కాదు సోనియా ఆకుల (Sonia Aakula).


ఇక బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేట్ అయిన తర్వాత కచ్చితంగా బిగ్ బాస్ బజ్ లోకి రావాల్సిందే. ఇక్కడికి వచ్చి ఆడియన్స్ ప్రశ్నలకు, హోస్ట్ అడిగే ప్రశ్నలకు కచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి. ఈ నేపథ్యంలోనే మాటల్లో పెట్టి అసలు గుట్టు రట్టు చేశారు హోస్ట్ అంబటి అర్జున్. మొత్తానికి అయితే బిగ్ బాస్ సీజన్ 7 లో తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో ఎంతో మంది హృదయాలను దోచుకున్న అర్జున్.. ఇప్పుడు బిగ్ బాస్ బజ్ కి హోస్ట్గా వ్యవహరిస్తూ అసలు నిజాన్ని కంటెస్టెంట్స్ నుంచి బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఆడియన్స్ ఏమనుకుంటున్నారు.. ? హౌస్ లో ఉన్న వారి పరిస్థితి ఏంటి..? అనే విషయాలను లాగుతున్నారు. ఈ క్రమంలోనే సోనియా హౌస్ లో వేసే వేషాల గురించి చెబుతూ ఇబ్బంది పెట్టేసారు.

బిగ్ బాస్ బజ్ లో సోనియా గుట్టు రట్టు..


ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ గా మారుతోంది. ఇక ప్రోమో విషయానికి వస్తే.. నా స్టైల్ లో ఫస్ట్ వీక్ నుంచి మాట్లాడుకుందాం అని అర్జున్ అనగా.. సోనియా బట్ నా స్టైల్ లో సమాధానం చెబుతాను అంటూ కామెంట్ చేసింది. హౌస్ లో బెస్ట్ బాండింగ్ ఎవరితో అయ్యింది అని అర్జున్ ప్రశ్నించగా.. అభయ్, నిఖిల్, పృథ్వీ అంటూ తెలిపింది. వెంటనే అర్జున్, నిఖిల్ పై మీ ఫీలింగ్ ఏంటి? అని ప్రశ్నించగా.. మా అన్న లాగా ఇంట్లో వాళ్ళ లాగా ఫీల్ అయ్యాను అంటూ తెలిపింది. దీంతో అర్జున్.. హౌస్ లో వారిని మ్యానుప్లేట్ చేసినట్లు బజ్ లో నన్ను మ్యానుప్లేట్ చేయమాకు అక్క అంటూ కామెంట్ చేశాడు.

వెనకుండి నడిపింది నేనే అంటూ నిజం ఒప్పుకున్న సోనియా..

పృథ్వీ ను మీరు వెపన్ లాగా వాడుకున్నారు.. ముందుండి ఆట పట్టిస్తున్నారని మీరు అనుకున్నారు. వెనకాల ఉండి ఆట నడిపిస్తున్నారని మా ఆడియెన్స్ అనుకుంటున్నాడు. అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో సోనియా నేను అనాలసిస్ చెప్తాను నా వరకు అంతే అని చెప్పగా.. దీంతో అర్జున్ చేయాల్సిందంతా చేసి.. నాకేం తెలియదు అన్నట్టు కంఫర్ట్ జోన్లోకి వెళ్లి పోతారు. మీరొక పెద్ద కపట నాటక సూత్రధారి అంటూ సోనియాపై కామెంట్ చేశారు. హౌస్ లో వీక్ పర్సన్ ఎవరు అనుకుంటున్నారు అనగా నైనిక అంటూ సోనియా చెప్పగా.. దీంతో అర్జున్ కాదు నిఖిల్ అని మేము అనుకుంటున్నాము అని అన్నాడు. టాప్ 3 లో ఎవరుంటారు అంటే.. కచ్చితంగా నిఖిల్ ఉంటాడు అని చెప్పింది సోనియా. ఇప్పుడు మీరు బయటకు వచ్చారు కదా మీ గైడెన్స్ లేకుండా నిఖిల్ ముందుకెళ్తాడా అంటే నాకు తెలియదు అని చెప్పింది. ఒకవేళ మీరు వుంటే ఆయన టాప్ 3 కి వెళ్లేవాడా అంటే.. ఆ మాత్రం గైడెన్స్ ఇచ్చాను కాబట్టి అక్కడి వరకు వెళ్ళాడు అంటూ నిజం ఒప్పుకొని అందర్నీ ఆశ్చర్యపరిచింది. నిఖిల్ కి ఆఫర్ ఇచ్చారు కదా. ఏది అడిగినా ఇస్తానని.. సమాధానం చెబుతారా లేక బ్లాంక్ వెయ్యాలా అంటూ బాంబ్ పేల్చారు అర్జున్. మొత్తానికైతే ఈమె గుట్టు రట్టు చేసి అసలు రూపాన్ని బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అర్జున్ అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Related News

Bigg Boss Agnipariksha : ఓరి నాయనో.. ఈ అమ్మాయి మామూల్ది కాదు.. ఓటు కోసం ఏకంగా..

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ 9 రాకకు సర్వం సిద్ధం… లాంచింగ్ ఎపిసోడ్ ఆరోజే!

Bigg Boss 9: అగ్నిపరీక్ష ప్రోమో రిలీజ్.. బలపరీక్షలో కసితీరా?

Bigg Boss 9 Telugu : జానీ మాస్టర్ అసిస్టెంట్ కు పోటీగా వెంకీ గర్ల్ ఫ్రెండ్..రచ్చ రచ్చే..

Navadeep: తప్పుగా అర్థం చేసుకున్నారు.. ఐయామ్ సారీ అంటూ నవదీప్ వీడియో

Bigg Boss telugu: నన్ను దూరం పెట్టారు.. అతడే జడ్జ్ గా ఎందుకు?

Big Stories

×