BigTV English

Intinti Ramayanam Today Episode : పల్లవి డ్రామా అవనికి తెలిసిపోయిందా? చక్రధర్ నిజస్వరూపం తెలుసుకున్న రాజేశ్వరి..

Intinti Ramayanam Today Episode : పల్లవి డ్రామా అవనికి తెలిసిపోయిందా? చక్రధర్ నిజస్వరూపం తెలుసుకున్న రాజేశ్వరి..

Intinti Ramayanam Today Episode September 30 th : గత ఎపిసోడ్ విషయానికొస్తే.. కమల్ శ్రీకర్ కోసం డ్రెస్సులు తీసుకొని వెళ్లి ఇస్తాడు. శ్రీకర్ ఏదోకటి అని వేసుకుంటాడు. నాకు బాగా ఆకలి వేస్తుంది. నేను వెళ్తున్న నువ్వు ఆడవాళ్ళ లాగా రెడీ అవ్వకుండా త్వరగా వచ్చేయి అని వెళ్తాడు. ఇక శ్రీకర్ షర్ట్ వేసుకొని శ్రియా ఫోన్ చేస్తే మాట్లాడుతూ ఉంటాడు.. ఇక్కడ ఏ సమస్య లేదు అని అంటాడు. అప్పుడు వెనకాల పల్లవి వస్తుంది. ఏ సమస్య లేదునా ఇప్పుడే నీకు చెబుతాను అని అంటుంది. ఫోన్ పెట్టినప్పుడు వెనకాల నుంచి కమల్ బావ అని హగ్ చేసుకుంటుంది. పల్లవి నేను శ్రీకర్ ను కమల్ ను కాదు అంటాడు. దానికి షాక్ అయిన పల్లవి కావాలనే అంతా చేస్తుంది. నువ్వు కమల్ డ్రెస్సు వేసుకున్నావేంటి అంటుంది. నాకు వేసుకోవడానికి డ్రెస్సులు లేవు అవని వదిన కమల్ డ్రెస్సు వేసుకోమని చెప్పింది అంటుంది. అవునా ఎంత పెద్ద తప్పు జరిగిపోయింది.. నేను కావాలని చెయ్యలేదు అని పెద్ద రచ్చ చేస్తుంది. దానికి నువ్వు కాదమ్మా వెళ్ళాల్సింది వీడు. వీడు లేకుండా ఉంటే ఇలాంటి జరిగేది కాదు అంటాడు. వీడి మోహం చూడాలంటే నాకు అసహ్యం వేస్తుంది అంటాడు. అందరు షాక్ అవుతారు. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. పల్లవి శ్రీకర్ ను హగ్ చేసుకున్న విషయాన్ని పెద్ద రాద్ధాంతం చేస్తుంది. దానికి పల్లవిని సపోర్ట్ చేస్తూ నువ్వు కాదు వీడు వెళ్లాలమ్మా అని అంటాడు. అక్షయ్ కేసు కోసం వీడిని ఇక్కడ ఉండమని అన్నాను. కేసు గెలిచాడు.. ఇక వీడి అవసరం ఎవరికీ లేదు ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటాడు. అందరు శ్రీకర్ పంపించవద్దని అంటారు. మీ ఈ విషయం గురించి మాట్లాడితే ఇక నేను ఇంట్లోనుంచి వెళ్ళిపోతాను అని అంటాడు. ఇక పల్లవి అవని దగ్గరకు డ్యాన్స్ చేసుకుంటూ వస్తుంది.. తన ప్లాన్ శ్రీకర్ ను పంపించడం కోసం ఇంత డ్రామా ఆడావా అని అడుగుతుంది. అవును నేను ఆట మొదలు పెట్టాను ఇది కేవలం శాంపిల్ మాత్రమే ముందుంది అసలు పండగ అంటుంది. నీకు ఎంత చెప్పినా వినవా అని అవని పల్లవికి వార్నింగ్ ఇస్తుంది. అప్పుడే అవినీ వాళ్ల అత్తయ్య అక్కడకు వచ్చి శ్రీకర్ వెళ్లిపోవడం ఏంటి? ఇలా జరిగిందేంటి? అని ఎమోషనల్ అవుతుంది.

ఆ విషయం పై స్పందించిన అవని ఈ ఇంట్లో జరుగుతున్న వాటికి శని పట్టింది. చీడ పీడలు పొయ్యేలా చేసి శ్రీకర్, శ్రీయాలను ఈ ఇంటికి తీసుకొస్తానని మాట ఇస్తుంది అవని. ఇక పల్లవి పొగరు దించాలని నేనేంటో చూపిస్తాను అని వార్నింగ్ ఇస్తుంది. నువ్వు చేసిన దానికి నేను తప్పకుండ రివేంజ్ తీర్చుకుంటాను అని వెళ్తుంది. నువ్వు నాలాగా ఏమి చెప్పలేవు అని పల్లవి అంటుంది. ఇక ఈ విషయాన్ని తన తండ్రితో చెప్తుంది పల్లవి.. శ్రీకర్ శ్రీయాలను ఇంటికి తీసుకురావాలని అనుకుంటుంది అవినీ.. కానీ మామయ్యా తోనే శ్రీకర్ ను బయటకు పంపించాను అంటుంది. ఇక చక్రధర్ పల్లవికి సపోర్ట్ చేస్తాడు. ఆ కుటుంబాన్ని ముక్కలు చెయ్యాలి. ఆ ఇంట్లో సంతోషాలు లేకుండా చేస్తానని చెబుతుంది పల్లవి. ఆ గుడ్ న్యూస్ కోసమే ఎదురు చూస్తున్న అని అంటారు. ఆ విషయాన్నీ పల్లవి తల్లీ వింటుంది. నువ్వు నీ కూతురు కలిసి నా అన్నయ్య కుటుంబాన్ని నాశనం చెయ్యాలని చూస్తున్నారా అని చక్రదర్ ను నిలదీస్తుంది.


ఆ ఇంట్లోని వాళ్లు నా కూతురు జీవితాన్ని నాశనం చేశారు అని అంటాడు. శ్రీకర్ ఆ ఇంట్లోని వాళ్లు ఎవరు మన అమ్మాయి జీవితంతో ఆదుకోవాలని చూడలేదు అని అంటుంది. ఆ అమ్మాయి ప్రాణాలను కాపాడాలని వెళ్లాడు. జరిగిన తప్పును సరిద్దుకోవాలని అనుకోవాలి కానీ నా పుట్టింటివాళ్లను నాశనం చెయ్యాలని అనుకుంటారా? అని నిలదీస్తుంది. చక్రధర్, తన భార్యకు మధ్య పెద్ద మాటల యుద్ధమే జరుగుతుంది. పల్లవి జీవితం నాశనం అయ్యేలా చేస్తారా అని తల్లిగా నా కూతురు జీవితాన్ని కాపాడే బాధ్యత నాకుంది అంటూ రాజేశ్వరి అంటుంది. ఇక పల్లవి ని కంట్రోల్లో పెట్టాలని అవని ఆలోచించిస్తుంది అవని.. ఏం చేస్తే పల్లవి ఇలాంటి పనులు చెయ్యకుండా కుటుంబాన్ని ముక్కలు చెయ్యకుండా ఉంటుంది అని అవని ఆలోచిస్తుంది.. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో పల్లవిని వాళ్ల అమ్మ చెంప పగలగొడుతుంది. నువ్వు ఇలా చేస్తావా.. పెళ్ళైన తర్వాత అత్తవారి ఇల్లే నీకు పుట్టిన ఇల్లు అంటుంది. ఇప్పుడే ఇదంతా చెబుతాను అంటుంది. అమ్మా నువ్వు చెబితే నేను చేస్తాను అంటుంది. అది అవని చూస్తుంది. పిన్ని నువ్వు ఒక పని చెయ్యాలి అంటుంది. ఏంటి చెప్పు అంటూంది.. ఇక పల్లవికి వీళ్ల ప్లాన్ తెలిసిపోతుందా? అనేది రేపటి ఎపిసోడ్ లో చూడాలి..

Related News

Anchor Suma యాంకర్ సుమ ఇంటి విలువ రూ.500 కోట్లా … మామూలుగా సంపాదించలేదుగా?

Jayammu Nischayammuraa: సందీప్ ముందు ఆర్జీవీ పరువు తీసిన జగపతి… నా వోడ్కా ఎక్కడా అంటూ

Tasty Teja: వేలం పాటలో గణేష్ లడ్డు సొంతం చేసుకున్న టేస్టీ తేజ.. ఖరీదు ఎంతో తెలుసా?

Kissik Talks Show : గీతా సింగ్ పెళ్లి చేసుకోకపోవడానికి అదే కారణమా.. ఇప్పటికీ ఒంటరిగానే

Illu Illalu Pillalu Today Episode: ప్రేమ గుండెలు బద్దలయ్యే షాక్.. కళ్యాణ్ కోసం ధీరజ్ వేట.. శ్రీవల్లికి చందు దూరం..

Intinti Ramayanam Today Episode: అదంతా కలా?.. చక్రధర్ మాస్టర్ ప్లాన్.. అక్షయ్ ను ఇరికించేసిన అవని..

Big Stories

×