Illegal affairs behind VRA killed: అక్రమ సంబంధాలు ఫ్యామిలీలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. క్షణికావేశంలో చేసిన తప్పుకు కుటుంబాల మధ్య చిచ్చు రేగుతోంది. ఫలితంగా ఈ లోకాన్ని విడిచి పెడుతున్నారు. అలాంటి ఘటన ఒకటి కడపలో చోటు చేసుకుంది. అక్రమ సంబంధాల ఉచ్చులో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు విలేజ్ రెవిన్యూ అసిస్టెంట్ నరసింహ.
కడప జిల్లాలో సంచలనం రేపిన వీఆర్ఏ నరసింహ హత్య కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వేముల మండలం కొత్తపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన వీఆర్ఏ నరసింహను ఓ వ్యక్తి దారుణంగా చంపేశాడు. నరసింహ నిద్రపోతున్న మంచం కింద డిటోనేటర్ పెట్టి పేల్చేశాడు ఓ వ్యక్తి. స్పాట్‌లో నరసింహ మృతి చెందాడు. ఆయన భార్యకు తీవ్రగాయాలయ్యాయి.
ALSO READ: భార్యను పరాయి పురుషుడి కౌగిట్లో చూసిన భర్త.. విషప్రయోగంతో మృతి!
ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. జరిగిన ఘటన గురించి ఆరా తీశారు. ఈ కేసులో అనుమానితుడిగా భావిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో నరసింహ భార్య సుబ్బలక్షమ్మ తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆమెని ఆసుపత్రికి తరలించారు. ఆమె అక్కడ చికిత్స పొందుతోంది. ఆమె ఇంకా స్పృహలోకి రాలేదని సమాచారం.
ఇంతకీ డిటోనేటర్‌తో నరసింహను లేపేమని ప్లాన్ చేసిందెరు? భర్తను భార్య చంపిందా? లేక ఆమె బంధువుల ప్లానా? డిటోనేటర్‌తో చంపాల్సిన పనేమొచ్చింది? ఇంతకీ డిటోనేటర్ ఎవరివి? నరసింహ ఇంట్లో ఉండటానికి కారణాలేంటి అనే చిక్కుముడిని విప్పే పనిలో ఖాకీలు పడ్డారు. ఈ ఘటనలో తీగలాగితే డొంక కదలనుంది.
👉డిటోనేటర్లు పేల్చడంతో వీఆర్ఏ మృతి
👉వైఎస్ఆర్ జిల్లా వేముల మండలం కొత్తపల్లిలో ఘటన
👉వీఆర్ఏ నరసింహ ఇంట్లో నిద్రిస్తుండగా మంచం కింద డిటోనేటర్లు పెట్టి పేల్చిన బాబు అనే వ్యక్తి
👉అక్కడికక్కడే నరసింహ మృతి, ఆయన భార్య సుబ్బలక్ష్మమ్మకు తీవ్ర గాయాలు
👉భార్యకు వేంపల్లి… pic.twitter.com/T6RQsuv62H— ChotaNews (@ChotaNewsTelugu) September 30, 2024