BigTV English

Bigg Boss 9 Promo: కలిసిపోయిన రీతూ , కళ్యాణ్.. మండిపడ్డ శ్రీజ!

Bigg Boss 9 Promo: కలిసిపోయిన రీతూ , కళ్యాణ్.. మండిపడ్డ శ్రీజ!

Bigg Boss 9 Promo: తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 అలా ప్రారంభం అయ్యిందో లేదో అప్పుడే నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. దాదాపు 15 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన ఈ హౌస్ లోకి 9 మంది సెలబ్రిటీలు, 6 మంది కామనర్స్ హౌస్ లోకి అడుగుపెట్టారు. మొదటి వారమే ప్రముఖ లేడీ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ ఎలిమినేట్ కాగా.. రెండవ వారం మర్యాద మనీష్, మూడవ వారం ప్రియా శెట్టి, నాలుగవ వారం హరిత హరీష్ ఇలా వరుసగా కామనర్స్ ఎలిమినేట్ అవ్వడంతో అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా కావాలనే కామనర్స్ ను హౌస్ నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.


మొదలైన ఇమ్యూనిటీ టాస్క్..

మొత్తం ఆరు మంది హౌస్ లోకి అడుగుపెడితే.. ఇప్పుడు ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు. మరొకవైపు మధ్యలో వైల్డ్ కార్డు ద్వారా మరో కామనర్ దివ్య నిఖిత కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈసారి కూడా కామనర్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని, ముఖ్యంగా దివ్య లేదా శ్రీజ పై వేటుపడే అవకాశం ఉందని తెలుస్తోంది. వాస్తవానికి నాలుగవ వారంలో వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉండగా.. అనూహ్యంగా హరిత హరీష్ అందరి చేత నెగెటివిటీ మూటగట్టుకొని ఎలిమినేట్ అయిపోయారు.ఇప్పుడు ఐదవ వారానికి సంబంధించి ఇమ్యూనిటీ టాస్క్ నిర్వహించారు బిగ్ బాస్.

ఫీలింగ్స్ వస్తున్నాయి అంటున్న ఇమ్మానుయెల్..

గత వారంలాగే ఈ వారం కూడా ఇమ్యూనిటీ టాస్క్ లో గెలిచినవారు నామినేషన్స్ నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. తాజాగా ఐదవ వారం మొదటి రోజుకు సంబంధించిన ప్రోమోని నిర్వాహకులు విడుదల చేయగా అందులో ప్రేమ పక్షులుగా పేరు తెచ్చుకున్న రీతు చౌదరి కళ్యాణ్ కలిసి పోయారు. 29వ రోజుకు సంబంధించి రెండవ ప్రోమోలో.. ఇమ్మానుయేల్.. తనూజ దగ్గరికి వచ్చి శ్రీవల్లి ఫీలింగ్స్ వస్తాండాయి అంటూ పుష్ప డైలాగ్ కొట్టగా.. తనూజ సిగ్గు పడిపోయింది. రీతూ చౌదరి మధ్యలో మాట్లాడుతూ.. నీకు ఉదయం నుంచి సాయంత్రం వరకు వచ్చేవే అవి అంటూ కౌంటర్ వేసింది.


రీతూకి సారీ చెప్పిన కళ్యాణ్..

ఆ తర్వాత కళ్యాణ్.. రీతూచౌదరి దగ్గరకు వచ్చి నన్ను క్షమించు అంటూ సారీ చెబుతాడు. ఎందుకు సారీ చెబుతున్నావ్ ఇప్పుడు అని రీతు అడగగా.. మాట్లాడలేదు కదా అందుకే సారీ చెప్తున్నాను అంటూ చెబుతాను. రీతూ మాట్లాడుతూ.. ఇంకోసారి నా మీద అరవకు.. కావాలంటే రూమ్ లోకి తీసుకెళ్లి తిట్టు అంటూ కామెంట్ చేసింది.

భరణిపై మండిపడ్డ శ్రీజ..

కట్ చేస్తే ఇమ్యూనిటీ టాస్క్ నిర్వహించారు. అందులో ఒక పెద్ద బెడ్ ఏర్పాటు చేయగా.. అందులో ఉన్న వాళ్లు ఒక కంటెస్టెంట్ ని కిందకు తోసేయాలి..అలా బెడ్ నుంచి కింద పడిపోయిన వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. అందులో అందరూ కట్టకట్టుకొని రీతూ చౌదరిని తోసేశారు. ఇక ఆఖరి రౌండ్లో భరణి శంకర్, ఇమ్మానుయేల్, కళ్యాణ్ , శ్రీజ, తనూజ ఉన్నారు. అనుకున్నదే తడువు భరణి శంకర్ శ్రీజాను ఎత్తుకెళ్లి అవతల పడేసాడు. దాంతో మండిపడ్డ ఆమె.. అదేదో నలుగురు కలిసి తనూజక్క పేరు చెప్పారు కదా.. ఎందుకు తోయలేదు. ఇప్పటికే ఇంట్లో వాళ్ళందరూ చెబుతున్నారు రేలంగి మామయ్య లాగా భరణి నటిస్తున్నారు అంటూ మండిపడింది.. ప్రస్తుతం ఈ ప్రోమో ఇప్పుడు వైరల్ మారుతోంది.

 

also read:Pradeep Ranganathan: హీరో నాని రికార్డును సమం చేయబోతున్న యంగ్ హీరో.. ఫలితం లభిస్తుందా?

Related News

Bigg Boss Buzzz : వొంగోపెట్టి పుంగి బజా… మాస్క్ మ్యాన్‌కు క్లాస్ పీకిన శివాజీ..

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 మాస్క్ మ్యాన్ అవుట్.. నాలుగు వారాల రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss 9 Elimination: హరీష్ అవుట్.. భరణి నిజస్వరూపం ఇదే, తనూజ అచ్చం నాలాగే.. మాస్క్ మ్యాన్ షాకింగ్ కామెంట్స్

Bigg Boss 9: సేఫ్ గేమర్స్ కి నాగార్జున షాక్.. ఎట్టకేలకు వారి బండారం బట్టబయలు..

Bigg Boss 9 Promo: సండే.. ఫన్‌డే.. మగవాళ్లకు మాత్రమే.. ఓడిన ఓనర్స్‌ టీం, ఐస్‌ క్యూబ్స్‌తో కితకితలు!

Srija Dammu Father: నేను ఇంటింటికి వెళ్లి చెత్త తీస్తా.. శ్రీజ దమ్ము ట్రోల్స్‌పై తండ్రి ఎమోషనల్‌

Bigg Boss 9 Promo: ఎట్టకేలకు నిజం ఒప్పుకున్న తనూజ.. అసలు ఊహించలేదుగా?

Big Stories

×