BigTV English

Bigg Boss 9 Telugu: 5వ వారం నామినేషన్స్ లో ట్విస్ట్.. డబుల్ ఎలిమినేషన్ ఉందా..?

Bigg Boss 9 Telugu: 5వ వారం నామినేషన్స్ లో ట్విస్ట్.. డబుల్ ఎలిమినేషన్ ఉందా..?

Bigg Boss 9 Telugu: బుల్లితెర టాప్ ఇలాంటి షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ప్రస్తుతం 9 వ సీజన్ ను జరుపుకుంటుంది. ఈ సీజన్ మొదలయ్యి కూడా నాలుగు వారాలు పూర్తి అయ్యింది. గత వారం అనూహ్యంగా మాస్క్ మ్యాన్ హరీష్ హరిత హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఇక ఐదో వారం నామినేషన్స్ ప్రక్రియ గురించి సర్వత్రా చర్చ నడుస్తుంది. ఐదవ వారము హౌస్ నుంచి ఎవరు బయటికి వెళ్తారా అన్న ఆసక్తి ఇప్పటి నుంచే కొనసాగుతుంది. అయితే ఈ ఎలిమినేషన్ ప్రక్రియ గురించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..


బిగ్ బాస్ సీజన్ 9 లో ట్విస్ట్..

బుల్లితెర టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 4 వారాలు పూర్తిచేసుకుని ఐదో వారంలోకి అడుగుపెట్టింది. ఈ వారం నామినేషన్స్ ప్రేక్షకులను ఉత్కంఠ గా మార్చేశాయి.. జనాల అంచనాలు తారుమారు అయ్యేలా నామినేషన్స్ జరిగాయి. పెద్ద బెడ్ ని గార్డెన్ లో ఏర్పాటు చేసి, ఫ్లోరా మరియు రాము తప్ప, మిగిలిన కంటెస్టెంట్స్ అందరినీ ఆ బెడ్ పైన నిల్చోబెట్టాడు బిగ్ బాస్. ఈ వారం మీరంతా నామినేట్ అయ్యారు, ఈ నామినేషన్ నుండి ఇమ్మ్యూనిటీ పొందే అవకాశం మీకు బిగ్ బాస్ ఇస్తున్నాడు. చివరి వరకు ఎవరు ఆ బెడ్ మీద ఉంటారో వాళ్ళు నామినేషన్స్ నుంచి సేఫ్ అవుతారు అని బిగ్ బాస్ అంటాడు. అయితే మహేష్ రాథోడ్,శ్రీజ, ఇమ్మానుయేల్ మరియు పవన్ కళ్యాణ్ తప్ప మిగిలిన అందరూ నామినేషన్స్ లో ఉన్నట్లు తెలుస్తుంది.. మరి ఎవరు వెళ్తారో చూడాలి..

డబుల్ ఎలిమినేషన్?

ప్రతి సీజన్లో ఎలిమినేషన్ అనేది కామన్ గా ఉంటుంది. అయితే డబల్ ఎలిమినేషన్ కూడా ఉందన్న విషయం తెలిసిందే. ఒకరిని ముందుగా హౌస్ నుంచి పంపించి మరొకరు తర్వాత రోజు ఎలిమినేట్ చేసి బయటకు పంపిస్తారు. ఇప్పటివరకు ఈ సీజన్లో ఒక్కొక్కరుగా బయటకు వెళ్లారు. అయితే ప్రస్తుతం డబుల్ ఎలిమినేషన్ వద్దు వచ్చినట్లు ఓ వార్త బయటకు వచ్చింది.. మహేష్ కెప్టెన్ అవ్వడం వల్ల, భరణి ని సేవ్ చేసి, తనూజ ని నామినేషన్స్ లోకి పంపినట్టు తెలుస్తుంది. రీతూ చౌదరి కి ప్రస్తుతం అందరికంటే తక్కువ ఓటింగ్ ఉంది. ఆమెతో పాటు దమ్ము శ్రీజ నామినేషన్స్ లోకి వచ్చేసింది. అయితే ఈ వారం ఓటింగ్ ను బట్టి డబుల్ ఎలిమినేషన్ ఉందా? లేదా అన్నది చూడాలి.. ఈ సీజన్ లో కామనర్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ కంటెంట్ పెద్దగా దొరకలేదు అని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇప్పటికైన వైల్డ్ కార్డు తో కొత్త వాళ్లను బిగ్ బాస్ దింపుతాడేమో అని ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. చూద్దాం ఏం జరుగుతుందో..


Related News

Bigg Boss 9 Promo: కలిసిపోయిన రీతూ , కళ్యాణ్.. మండిపడ్డ శ్రీజ!

Bigg Boss Buzzz : వొంగోపెట్టి పుంగి బజా… మాస్క్ మ్యాన్‌కు క్లాస్ పీకిన శివాజీ..

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 మాస్క్ మ్యాన్ అవుట్.. నాలుగు వారాల రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss 9 Elimination: హరీష్ అవుట్.. భరణి నిజస్వరూపం ఇదే, తనూజ అచ్చం నాలాగే.. మాస్క్ మ్యాన్ షాకింగ్ కామెంట్స్

Bigg Boss 9: సేఫ్ గేమర్స్ కి నాగార్జున షాక్.. ఎట్టకేలకు వారి బండారం బట్టబయలు..

Bigg Boss 9 Promo: సండే.. ఫన్‌డే.. మగవాళ్లకు మాత్రమే.. ఓడిన ఓనర్స్‌ టీం, ఐస్‌ క్యూబ్స్‌తో కితకితలు!

Srija Dammu Father: నేను ఇంటింటికి వెళ్లి చెత్త తీస్తా.. శ్రీజ దమ్ము ట్రోల్స్‌పై తండ్రి ఎమోషనల్‌

Big Stories

×