Bigg Boss 9 Promo: సాధారణంగా బిగ్ బాస్ అంటేనే ఎంటర్టైన్మెంట్ కి కేరాఫ్ అడ్రస్ అని చెప్పవచ్చు.ముఖ్యంగా ఇక్కడ ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు కన్నీళ్లు, ఎమోషనల్ బాండింగ్స్ కూడా ఏర్పడుతూ ఉంటాయి. హౌస్ లో లవ్ ట్రాక్స్ కూడా మొదలైన విషయం తెలిసిందే.ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ లో పరిచయమై.. ప్రేమించుకుని.. బయటకు వచ్చాక పెళ్లిళ్లు చేసుకున్న జంటలు కొన్ని అయితే.. మరికొన్ని హౌస్ లో లవ్ ట్రాక్ నడిపి బయటకు వచ్చి విడిపోయిన జంటలు కూడా ఉన్నాయి. మరికొన్ని ఏమో టీఆర్పీ రేటింగ్ కోసం లవ్ ట్రాక్ నడిపిన జంటలు కూడా లేకపోలేదు.
అలా ఇప్పటికే హౌస్ లో రెండు లవ్ ట్రాక్స్ నడిపిస్తున్న విషయం తెలిసిందే. రీతు చౌదరి – కళ్యాణ్ ఒకటి కాగా.. తనూజ, ఇమ్మానుయేల్ లవ్ ట్రాక్ కూడా అందరిని ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఇమ్మానుయేల్, తనూజ షో రేటింగ్ కోసమే లవ్ ట్రాక్ నడుపుతున్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఇప్పుడు వీళ్ళు కాస్త నిజంగానే ప్రేమికులుగా ప్రవర్తిస్తుంటే.. అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు వీళ్ళ లవ్ ట్రాక్ చాలా ఇంట్రెస్టింగ్ గా.. చూడడానికి చాలా ఎంజాయ్ చేసేలా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే తాజాగా 30వ రోజుకు సంబంధించి రెండవ ప్రోమోని నిర్వాహకులు విడుదల చేశారు.
ప్రోమో విషయానికి వస్తే.. కంటెస్టెంట్స్ అందరూ ఒకచోట చేరి హౌస్ నుండి బయటకు వెళ్ళగానే.. మీరు చూడాలనుకున్న ఫస్ట్ పర్సన్ ఎవరు? అని ప్రశ్నించగా తనూజ మాట్లాడుతూ.. “నేను బయటకు వెళ్ళగానే మొదట కలిసేది మా నాన్న.. అలాగే ఒక స్పెషల్ పర్సన్” అంటూ కామెంట్ చేయగా ఇమ్మానుయేల్ మాట్లాడుతూ..”నాన్న , అల్లుడు, కూతురు కలుస్తారంటావ్ .. ఆ అల్లుడు నేనే కదా!” అంటూ అందరికీ నవ్వు తెప్పించారు ఇమ్మానుయేల్. తనూజ డైలాగ్ కొడుతూ..” మా ఇంట్లో నన్ను పిలుస్తారు అమ్ము.. కానీ నాకు ఇష్టం ఇమ్ము “అంటూ ఒక పోయెట్రీ చెప్పేసింది. పది రోజుల్లో పడేస్తా నిన్ను అంటూ ఆమెను ఆశ్చర్యపరిచారు.
కట్ చేస్తే.. తనూజ ఇమ్మానుయేల్ దగ్గరకు వచ్చి.. నాకు మా అమ్మ కావాలి అని ముద్దుగా అడగగా.. ఇమ్మానియేల్ మాట్లాడుతూ.. ఇప్పటికప్పుడు పెళ్లి చేసుకోవాలంటే యాడ చేసుకుంటాడు అంటూ భరణిని చూపించారు ఇమ్మానియేల్. అలా కాస్త కామెడీ పండించారు ఈ జంట. తర్వాత తనూజ మాట్లాడుతూ..” మా మమ్మీ ఫేస్ తల్చుకుంటేనే ఏడుపొస్తుంది” అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆ తర్వాత సుమన్ శెట్టి ఏడ్చేశారు. అంతేకాదు సంజన, శ్రీజ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక హౌస్లో అందరూ ఎమోషనల్ అవ్వడం చూసి ఇమ్మానుయేల్ రేయ్ ఆలు కర్రీ ఎవరు చేశార్రా.. ఇంకోసారి చేయకండి అందరూ ఏడ్చేస్తున్నారు అంటూ కామెంట్ చేశారు. అలా మొత్తానికి అయితే హౌస్ లో లవ్ ట్రాక్ తో పాటు కన్నీళ్లు, నవ్వులు అన్నీ కూడా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారుతోంది.
also read: Ram Charan: రామ్ చరణ్ న్యూ లుక్ చూశారా.. వింటేజ్ లుక్ లో.. ఆ మూవీను తలపిస్తూ!