Bigg Boss 9 Telugu : బుల్లితెరపై టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 9 రోజురోజుకి ఆసక్తికరంగా మారుతుంది.. నాలుగు వారాలు పూర్తి చేసుకున్న ఈ షో ఐదో వారం ఎలిమినేషన్ పై ఆసక్తి నెలకొంది. నామినేషన్స్ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో నెక్స్ట్ ఎలిమినేషన్ లో ఎవరు ఉన్నారు? హౌస్ నుంచి బయటికి వెళ్ళేది ఎవరు అన్నది జనాలకు అంతు చిక్కని ప్రశ్న లాగా మిగిలిపోయింది. గత నాలుగు వారాలుగా జనాలు అంచనాలు తప్పుతూనే ఉన్నాయి. ఒకరి ఎలిమినేట్ అవుతారు అనుకుంటే మరొకరు ఎలిమినేట్ అవ్వడంతో బిగ్ బాస్ అంచనాలు ఎలా ఉన్నాయో చెప్పడం కష్టమే అని ఆడియన్స్ అంటున్నారు.. నాలుగో వారం హౌస్ నుంచి బయటికి వచ్చినా మాస్క్ మ్యాన్ హరీష్ హరిత పలు చానల్స్ కి ఇంటర్వ్యూ లిస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన బిగ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రీతు చౌదరి గురించి సంచలన విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది.
నాలుగవ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన హరిత హరీష్ అలియాస్ మాస్క్ మాన్ పలు టీవీ చానల్స్ కి ఇంటర్వ్యూ లిస్టు వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ న్యూస్ ఛానల్ బిగ్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో హౌస్ లో జరుగుతున్న ప్రతి విషయాలను ఆయన పంచుకున్నారు. హౌస్ లో ఆట తీరు గురించి ఆసక్తికర విషయాలను షేర్ చేశారు.. ఆట ఆడకుండా ఉంటే జనాలు మూడు వారాలు ఉంచారు కదా అని కుండబద్దలు కొట్టే నిజాలను బయట పెట్టారు.. రీతూ చౌదరి లవ్ స్టోరీస్ నిజమే అని చెప్పడంతో జనాలు షాక్ లో ఉన్నారు. అయితే ఆ అమ్మాయి చాలా తెలివైనది. తను ఎలాగైనా సరే సేఫ్ గేమ్ ఆడి తనని తాను సేవ్ చేసుకుంటుంది అని రీతు చౌదరి గురించి సంచల విషయాలను హరీష్ పంచుకున్నారు. నెక్స్ట్ ఫ్లోరా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉన్నట్లు ఇన్ డైరెక్ట్ గా హరీష్ అన్నారు.
Also Read : ప్రదీప్ చేతిలో రజినీ, కమల్ మూవీ… యంగ్ డైరెక్టర్ రియాక్షన్ ఏంటంటే ?
ఈ ఇంటర్వ్యూలో హరీష్ తన భార్యతో పాల్గొన్నారు.. ఆమె మాట్లాడుతూ ఆయన అప్పుడే బయటికి రావడం కాస్త బాధగా అనిపించినా కూడా.. తనని తాను నిరూపించుకున్నారు అంటూ సంతోషాన్ని వ్యక్తం చేసింది.. ఆయన బిగ్ బాస్ కి వెళ్లడం బాగానే ఉంది అని ఆమె ఎన్నో విషయాలను పంచుకున్నారు. ఇకపోతే వైల్డ్ కార్డు ద్వారా మళ్ళీ ఎంట్రీస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా అని యాంకర్ అడగ్గా.. ఆ ఛాన్స్ వస్తే మళ్లీ ఆయన కచ్చితంగా వెళ్తారు అని ఆమె చెప్పారు. మరి వైల్డ్ కార్డు ద్వారా ఈయన మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తారో లేదో చూడాలి.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..