EPAPER

Bigg Boss: ఒక హోస్ట్ కు రూ. 350 కోట్లా.. ఈ రికార్డ్ ను కొట్టే మొనగాడే లేడు

Bigg Boss: ఒక హోస్ట్ కు రూ. 350 కోట్లా.. ఈ రికార్డ్ ను కొట్టే  మొనగాడే లేడు

Bigg Boss: సాధారణంగా ఒక హోస్ట్  కు రెమ్యూనరేషన్ ఎంత ఉంటుంది.   హా.. ఎంత.. చిన్న చిన్న షోస్  కు అయితే  ఒక లక్ష .. పెద్దవి అయితే రూ. 5 లక్షలు అనుకుందాం. సరే  ఇవి కాదు రియాలిటీ షోస్ కు ఎంత ఉంటాయి. కోటి నుంచి మొదలుపెట్టినా   ఒక రూ. 50 కోట్లు ఉంటుంది. అంతెందుకు  తెలుగు బిగ్ బాస్ కోసమే   నాగార్జున.. దాదాపు రూ70 కోట్లు అందుకుంటున్నాడని వార్తలు వచ్చాయి. మరి అలాంటి బిగ్ బాస్ సీజన్ కు ఒక హోస్ట్  అక్షరాలా.. ఏంటి.. అక్షరాలా  రూ. 350 కోట్లు అందుకుంటున్నాడట.  దిమ్మ తిరిగిపోతుంది కదూ.. ఆ  హోస్ట్ ఎవరనుకుంటున్నారు.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్.


బిగ్ బాస్ లాంటి ఒక రియాలిటీ షోను మొదలు పెట్టిందే సల్మాన్ ఖాన్.   ఈ షో అంచలంచెలుగా ఎదిగి ఇప్పుడు 18 వ సీజన్ లో అడుగుపెడుతుంది.   ఈ 18 సీజన్స్ కు మకుటం లేని  మహారాజులా  హౌస్ ను ఏలుతున్నాడు సల్మాన్ ఖాన్. నిజం చెప్పాలంటే ఈ బిగ్ బాస్.. సల్మాన్ ను పట్టి పీడిస్తుంది. చాలాసార్లు సల్లు భాయ్.. బిగ్ బాస్ కు గుడ్ బై చెప్పాలని చూసినా కూడా..  హోస్ట్ గా ఇంకెవరు చేయము అని చెప్పడంతో   బిగ్ బాస్ యాజమాన్యం ..  సీజన్.. సీజన్ కు రెమ్యూనరేషన్ పెంచుకుంటూ వెళ్తూ సల్మాన్ నే హోస్ట్ గా వ్యవహరించేలా చేస్తోంది.

అలా ఇప్పటికి 17 సీజన్లను సల్మాన్ విజయవంతంగా నిర్వహిస్తూ వస్తున్నాడు. ఇక ఇప్పుడు సీజన్ 18 మొదలు అయ్యింది. ఈసారి కూడా సల్మాన్ చేయను అంటూనే చేయాల్సి వచ్చిందని తెలుస్తోంది. ఇక ఈసారి సల్లు భాయ్ రెమ్యూనరేషన్.. ఆకాశాన్ని తాకినట్లు తెలుస్తోంది.


14 వారాలకు గానూ స‌ల్మాన్ మొత్తంగా రూ. 350 కోట్లు అందుకుంటున్నాడని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఇందులో నిజమెంత  అనేది తెలియదు కానీ, బిగ్ బాస్ చరిత్రలోనే  ఈ రెమ్యూనరేషన్ రికార్డ్  అని చెప్పొచ్చు.  ఈ రికార్డ్ ను బద్దలుకొట్టే మొనగాడు మళ్లీ వస్తాడు అనే  నమ్మకం కూడా ఎవరికి లేదు. ఏదిఏమైనా సల్మాన్ కు ఉన్న క్రేజ్ అలాంటిది. మరి ఈసారి ఎలాంటి కాంట్రవర్సీ లు  లేకుండా సీజన్ 18 ఎలా ముగుస్తుందో చూడాలి.

Related News

Bigg Boss 8 Telugu : అప్పుడే మొదలెట్టేశారా?.. ఈ వారం ఆమె అవుట్..?

Bigg Boss 8 Telugu Promo: ప్రేరణ vs హరితేజ.. చెల్లుకు చెల్లు.. పడింది ఇద్దరికి పెద్ద చిల్లు..

BB Telugu 8 Promo: నామినేషన్ రచ్చ మొదలు.. ఇలాంటి గొడవ ఎక్కడ చూడలేదు భయ్యా..!

Bigg Boss 8 Telugu : హోస్ట్ నాగర్జున పైనే చిరాకు పడుతున్న యష్మీ.. అసలు ఏమైందంటే..?

Bigg Boss 8 Telugu Elimination: గంగవ్వ గేమ్స్ ఆడలేదు.. వెళ్లిపోయే ముందు నయని పావని ఓపెన్ కామెంట్స్, వారిపై కూడా..

Bigg Boss 8 Telugu Promo: అవినాష్ సీక్రెట్ బయటపెట్టిన నబీల్.. డేంజర్ జోన్‌లో హరితేజ, నయని పావని

BB Telugu 8: సండే.. ఫన్ డే.. కొత్త టాస్క్ తో కొత్త రచ్చ..!

Big Stories

×