BigTV English

BB Telugu 8 Promo:అవినాష్ టాలెంట్ కి హోస్ట్ నాగార్జున సైతం ఫిదా.. గ్రేట్ అంటూ.?

BB Telugu 8 Promo:అవినాష్ టాలెంట్ కి హోస్ట్ నాగార్జున సైతం ఫిదా.. గ్రేట్ అంటూ.?

BB Telugu 8 Promo: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్. తెలుగులో ఎనిమిదవ సీజన్ కూడా చివరి దశకు చేరుకుంది. డిసెంబర్ 15వ తేదీన చాలా గ్రాండ్ గా గ్రాండ్ ఫినాలే జరగబోతోంది. ఈ మేరకు ఈసారి ఎవరు విజేతగా నిలవనున్నారు అనే విషయం మరింత హైలెట్ గా మారిన విషయం తెలిసిందే. ఒకవైపు నిఖిల్ , మరొకవైపు గౌతమ్ ఇద్దరూ కూడా పోటాపోటీగా పోటీ పడుతూ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గా పేరు దక్కించుకున్నారు. ఇకపోతే చాలామంది గౌతమ్ వైల్డ్ కార్డు అయినప్పటికీ టైటిల్ విజేతగా ప్రకటించి బిగ్బాస్ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాలని కోరుతుంటే, మరికొంతమంది హౌస్ లో మొదటినుంచి ఉన్న నిఖిల్ కి టైటిల్ ఇవ్వాలని కోరుతున్నారు.


దీనికి తోడు చాలామంది ఆడియన్స్ కూడా గౌతమ్ కి టైటిల్ ఇవ్వాలని కోరుతున్నారు. ఏది ఏమైనా ఇద్దరిలో ఎవరికి టైటిల్ ఇవ్వనున్నారు అనే విషయం తెలియాలి అంటే డిసెంబర్ 15 వరకు ఎదురు చూడాల్సిందే. ఇదిలా ఉండగా ప్రస్తుతం హౌస్ లో 6 మంది మాత్రమే ఉన్నారు. నిన్న 14వ వారం ఎలిమినేషన్ లో భాగంగా లేడీ శివంగిగా పేరు దక్కించుకున్న రోహిణి ఎలిమినేట్ అయింది. ముఖ్యంగా ఎనిమిది వారాలు హౌస్ లో ఉన్న ఈమె తన స్ట్రాటజీ ఏంటో నిరూపించుకుంది.విష్ణుప్రియ లాంటి వారు ఈమెను బ్యాడ్ చేసి మాట్లాడినా సరే.. తన స్ట్రాటజీతో, తన వ్యక్తిత్వంతో అందరి మనసులను గెలుచుకుంది రోహిణి.

ఇకపోతే ప్రస్తుతం హౌస్ లో 6 మంది ఉన్నారు. ప్రేరణ, విష్ణుప్రియ, నిఖిల్, గౌతమ్, అవినాష్, నబీల్. ప్రస్తుతం టికెట్ టు ఫినాలే టాస్క్ గెలిచి మొదటి ఫైనలిస్టుగా నిలిచారు అవినాష్. ఇక ఈరోజు విష్ణు ప్రియ ఎలిమినేట్ కాబోతోంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు. ఇక ప్రస్తుతం వచ్చే వారానికి 5 మంది టాప్ ఫైవ్ కి వెళ్తారా లేక టాప్ సిక్స్ గా ఉంటారా అన్నది తెలియాల్సి ఉంది. ఆదివారం 98వ రోజుకు సంబంధించి ప్రోమో ని విడుదల చేశారు. ఈ ప్రోమోలో అవినాష్ టాలెంట్ కాస్త బయటపడింది.


తాజాగా రివర్స్ గేర్ అంటూ ఒక ఫన్ టాస్క్ ఇచ్చారు నాగార్జున. అందులో బిగ్ బాస్ ఒక పాట ప్లే చేస్తే దానికి రివర్స్లో తాను ఇచ్చే థీమ్ లో డాన్స్ చేయాలని తెలిపారు నాగార్జున. అరుంధతి సినిమా నుండి టైటిల్ సాంగ్ అయినా “త్యాగం అంటే నీదమ్మా” అంటూ సాగే పాటకి బెల్లీ డాన్స్ చేయమని అవినాష్ తో తెలిపాడు నాగార్జున. ఇక చాలా అద్భుతంగా బెల్లీ డాన్స్ చేసి చూపించారు అవినాష్. ఎక్కడ కూడా తడబడకుండా ఏమాత్రం వెనుకడుగు వేయకుండా తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నారు. ఎక్స్పర్ట్స్ తప్ప ఈ బెల్లీ డాన్స్ వేయడానికి ఆస్కారం ఉండదు అలాంటిది ఈయన అవలీలగా వేయడంతో నిజంగా నువ్వు గ్రేట్.. నీలో ఈ టాలెంట్ కూడా ఉందా అంటూ ప్రశంసించారు నాగార్జున. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారింది.

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×