BigTV English

Bigg Boss: వీకెండ్స్ లో నాగ్ ధరించే షర్ట్స్ ఖరీదు తెలిస్తే షాక్.. రెండు కుటుంబాల వార్షికాదాయం..!

Bigg Boss: వీకెండ్స్ లో నాగ్ ధరించే షర్ట్స్ ఖరీదు తెలిస్తే షాక్.. రెండు కుటుంబాల వార్షికాదాయం..!

Bigg Boss… ప్రస్తుతం తెలుగులో 8వ సీజన్ ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బిగ్ బాస్ రియాల్టీ షో కి ఎంత పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలామంది ఈ షో కోసం ఏడాది పొడవునా ఎదురు చూస్తారని చెప్పవచ్చు. ఇకపోతే బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 నుంచి హోస్ట్ గా అక్కినేని నాగార్జున వ్యవహరిస్తున్నారు. తన మాట తీరుతో ఆట తీరుతో అందరిని మెప్పిస్తూ.. హోస్ట్ కు ఉండాల్సిన అన్ని లక్షణాలను తనలో ఉనికి పుచ్చుకొని, కంటెస్టెంట్స్ ని కంట్రోల్ చేస్తూ ఉంటారు.


సక్సెస్ ఫుల్ హోస్ట్ గా గుర్తింపు..

Bigg Boss: If you know the cost of the shirts worn by Nag in the weekends, you will be shocked.. The annual income of two families..!
Bigg Boss: If you know the cost of the shirts worn by Nag in the weekends, you will be shocked.. The annual income of two families..!

ఇకపోతే మొదటి సీజన్ కి ఎన్టీఆర్ హోస్టుగా చేయగా, రెండవ సీజన్ కి నాని హోస్ట్ గా చేశారు. ఇక మూడవ సీజన్ నుంచి నాగార్జున హోస్ట్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆయన హోస్టింగ్ పై మధ్య మధ్యలో విమర్శలు వచ్చినా అతనే బెస్ట్ అని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటున్నారు. ఇదే సమయంలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తో కూడా ఉన్న అగ్రిమెంట్ ప్రకారమే హోస్ట్ గా రన్ అవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రన్ అవుతుండగా ఇప్పటికే మూడు వారాలు పూర్తి చేసుకుంది.


వీకెండ్స్ లో నాగ్ దుస్తుల పైనే అందరి దృష్టి..

బిగ్ బాస్ షో కి వీకెండ్స్ లో మాత్రమే నాగార్జున వస్తారు
అంటే శని , ఆదివారాలు మాత్రమే వచ్చి హౌస్ మేట్స్ తో మాట్లాడుతారు. వారి తప్పొప్పులను చెబుతూ వారు చేసిన తప్పులకు వార్నింగ్ కూడా ఇస్తారు. ఎవరైనా గేమ్ ఆడితే వారిపై ప్రశంసలు కురిపిస్తాడు. ఆడిస్తాడు. పాడిస్తాడు. సండే అంటే ఫన్ డే అంటూ కంటెస్టెంట్స్ తో పాటు ఆడియన్స్ కి కూడా మంచి వినోదాన్ని పంచుతాడు. అయితే ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ వీకెండ్స్ లో అందరిని అట్రాక్ట్ చేసే అంశం మరొకటి ఉంది అదే నాగార్జున ధరించే షర్ట్. నాగార్జున ప్రతి వారములో రెండు రోజులు కూడా డిఫరెంట్ కాస్ట్యూమ్స్ ధరిస్తారు. ఆయన షర్ట్స్ , ధరించే వాచ్, గ్లాసెస్ , షూస్ అన్నీ కూడా చాలా డిఫరెంట్ గా స్పెషల్ గా నిలుస్తుంటాయి. ఆయన హోస్టింగ్ తో పాటు ఆయన ధరించే దుస్తులు , గాడ్జెట్స్ ని కూడా ఆడియన్స్ చాలా క్యూరియస్ గా చూస్తూ ఉంటారు. మరి ప్రతి వారం వీకెండ్స్ లో ఆయన ధరించే దుస్తులు, గాడ్జెట్స్ కి సంబంధించిన కాస్ట్ అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి ఆయన మూడవ వారం ధరించిన షర్ట్స్ విషయానికి వస్తే.. రెండు డిఫరెంట్ షర్ట్లు ధరించారు.

ఒక్కో షర్ట్ విలువ రూ.15 వేల పైనే..

స్టైలిష్ గ్లాసెస్ కూడా ధరించారు. ప్రస్తుతం వీటి ధరలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. బిగ్ బాస్ షో కి నాగ్ ధరించే షర్టు విలువ సుమారుగా రూ.15,000 పై మాటే. ఇక శనివారం రోజు డార్క్ బ్లూ పైన డార్క్ గ్రీన్ తలపించే షర్ట్ ను ఆయన ధరించారు. ఇది జస్ట్ క్యాజువల్ గా అనిపించింది అని చెప్పొచ్చు. కానీ దీని విలువ రూ.14,500. అలాగే స్కాచ్ సోడా మోడల్ కి చెందిన షర్టు ధరించారు. ప్రస్తుతం ఈ ధరలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. అంతేకాదు ఈయన యంగ్ గా స్టైలిష్ గా కనిపించడానికి బాల్మైన్ మోడల్ గ్లాసెస్ ధరించారు. వీటి విలువ అక్షరాల రూ.82, 000. ఈ లెక్కను చూసుకుంటే నాగ్ వీకెండ్స్ లో రావడానికి ఒక్క రోజుకి సుమారుగా లక్ష రూపాయలు ఖర్చు అవుతుందని సమాచారం. దీన్ని బట్టి చూస్తే ఈజీగా రెండు పేద ఫ్యామిలీలకు వార్షికాదాయమని చెప్పవచ్చు.

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×