BigTV English

Egg Curry Recipe: కొబ్బరిపాలతో ఎగ్ కర్రీ.. బిర్యానీకి జతగా టేస్ట్ అదిరిపోతుంది..

Egg Curry Recipe: కొబ్బరిపాలతో ఎగ్ కర్రీ.. బిర్యానీకి జతగా టేస్ట్ అదిరిపోతుంది..

South Indian Egg Curry with Coconut Milk: సాధారణంగా చాలా మంది ఎగ్‌తో చేసిన ఏ రెసిపీ అయిన చాలా ఇష్టంగా తింటారు. అయితే ఓ సారి కొబ్బరిపాలతో ఎగ్ కర్రీ ట్రై చేయండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరిపాలతో ఎగ్ కర్రీ బిర్యయానీలో కలిపి తింటే అస్సలు వదిలిపెట్టరు. ఇది నోరూరిపోయేలా ఉంటుంది. ఈ రెసిపీ చేయడం చాలా సులభం కూడా..  ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.


కావాల్సిన పదార్ధాలు

ఉడకబెట్టిన కోడిగుడ్లు నాలుగు లేదా ఐదు


నూనె సరిపడినంత

కొబ్బరి పాలు- అరకప్పు

చింతపండు నిమ్మకాయ సైజులో తీసుకోండి

ఉల్లిపాయలు- మూడు

అల్లం వెల్లుల్లి పేస్ట్- టేబుల్ స్పూన్

టొమాటోలు- రెండు

పసుపు – అర టీస్పూన్

కారం -రెండు స్పూన్లు

ధనియాల పొడి- అరటీస్పూన్

గరం మసాలా-అర టీస్పూన్

జీలకర్ర- టీస్పూన్

కొత్తిమీర, కరివేపాకు

పచ్చి మిర్చి రెండు

ఉప్పు సరిపడినంత

Also Read: ఈ 5 పదార్థాల్లో చికెన్ కంటే ఎక్కువ ప్రోటీన్

కొబ్బరిపాలతో ఎగ్ కర్రీ తయారు చేసే విధానం

ఉడకబెట్టిన కోడిగుడ్లను ముందుగా రెండు ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. చింత పండును నీటిలో నానబెట్టుకోవాలి. తాజాగా కొబ్బరి ముక్కలను తీసుకుని మిక్సీలో వేసి  అందులో కొంచెం వాటర్ పోసి పాలు తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేయాలి. ఆ నూనెలో జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి వేసి బాగా వేగనివ్వాలి. ఆ తర్వాత టొమాటో ముక్కలు వేసి అందులో పసుపు, కారం, సరిపడినంత ఉప్పు, ధనియాల పొడి, వేసి కొంచెం వేగినాక అందులో చింతపండు పులుసు వేసి బాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న కొబ్బరిపాలు వేసి బాగా దగ్గరయ్యేంత వరకు ఉడికించాలి. అందులో ముక్కలుగా కట్ చేసుకున్న కోడిగుడ్లను వేయాలి. చివర్లో కొత్తిమీర, కరివేపాకు, గరం మసాలా వేసి 10-15 నిమిషాల తర్వాత స్టవ్ కట్టేయాలి.

అంతే ఎంతో రుచికరంగా ఉండే టేస్టీ కొబ్బరిపాలతో ఎగ్ కర్రీ రెడీ అయినట్లే. దీనికి కాంబినేషన్‌లో బగారా రైస్ కానీ, బిర్యానీ లోకి కానీ చాలా రుచిగా ఉంటుంది. కొబ్బరి పాలు మంచి క్రిమీ టేస్ట్‌ని ఇస్తాయి. అంతేకాదండీ వీటిలో చాలా పోషకాలు ఉంటాయి. కోడి గుడ్లు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి ఈ రెసిపీని ఓసారి ట్రై చేసి చూడండి. రుచి పరంగా, ఆరోగ్యానికి ఈ రెసిపీ బెస్ట్ అని చెప్పొచ్చు.

Related News

Non-vegetarian food: ముక్క లేనిదే ముద్ద దిగడం లేదా ? అయితే జాగ్రత్త !

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Big Stories

×