Bigg Boss: ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతూ.. నెక్స్ట్ ఏం జరగబోతోంది అనే ఉత్కంఠ రేకెత్తిస్తూ ఆడియన్స్ లో మంచి పాపులారిటీ అందుకుంది బిగ్ బాస్. ఇప్పటికే తెలుగులో ఎనిమిదవ సీజన్ చివరి దశకు చేరుకోగా, కన్నడలో 11వ సీజన్ నడుస్తోంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ హీరో కిచ్చా సుదీప్ (Kiccha Sudeep)హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. తెలుగు మాదిరిగానే అక్కడ కూడా వైల్డ్ కార్డు ద్వారా కొంతమంది హౌస్ లోకి అడుగుపెట్టారు. వారిలో కార్తీకదీపం ఫేమ్ శోభా శెట్టి(Shobha Shetty)కూడా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. బుల్లితెర ఫేమ్ అయిన ఈమె బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో కంటెస్టెంట్ గా అవకాశం దక్కించుకొని, భారీ పాపులారిటీ అందుకుంది. ముఖ్యంగా ఈ సీజన్ విజయవంతం కావడానికి శోభ కూడా కారణం అనడంలో సందేహం లేదు. అరుపులు, కేకలు, చీటికిమాటికి తగాదాలు టాస్క్ ఆడినప్పుడు ఒకలాగా నామినేషన్స్ వచ్చినప్పుడు ఇంకోలాగా ప్రవర్తిస్తూ ఆడియన్స్ కి మంచి కంటెంట్ అందించింది. ఇక ఆడియన్స్ ను ఎంతలా ఇబ్బంది పెట్టింది అంటే ఈమెను ఎలిమినేట్ చేయండి మాస్టారు అంటూ కామెంట్స్ పెట్టేవారు నెటిజన్స్. దీన్ని బట్టి చూస్తే ఆమె ఏ రేంజ్ లో తన సైకోయిజం చూపించిందో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ఇంతగా ప్రేక్షకులను అలరించిన ఈమె టాప్ ఫైవ్ కి వెళ్లకుండానే ఎలిమినేట్ అయిపోయింది.
హౌస్ లో ఉండనంటూ ఒకటే ఏడుపు..
ఇకపోతే తెలుగులో బిగ్ బాస్ విన్నర్ అవాలనుకున్న కళ నెరవేరకపోవడంతో తన మాతృభాష కన్నడలో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చింది. అయితే రావడంతోనే భజన కార్యక్రమం మొదలుపెట్టడంతో పోస్ట్ సుదీప్ ఆమెకి షాక్ ఇచ్చారు. శోభ అడుగుపెట్టకు ముందు వరకు ప్రశాంతంగా ఉన్న హౌస్ ఒక్కసారిగా అల్లకల్లోలం అయిపోయింది. కంటెస్టెంట్స్ తో గొడవలు పెట్టుకోవడంతో అక్కడి వాళ్లకి కూడా ఆమె విసుగు పుట్టించింది. ఇదిలా ఉండగా తాజాగా బిగ్ బాస్ తాజా ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా అందులో శోభ ఏడవడం మనం చూడవచ్చు. హౌస్ లో ఉండలేకపోతున్నానని ఎలిమినేట్ చేసేయాలని పోస్ట్ సుదీప్ ని కోరుతూ కన్నీటి పర్యంతం అయింది.
శోభా శెట్టి సెల్ఫ్ నామినేట్..
ఇకపోతే నామినేషన్స్ ముగిసిన తర్వాత ఆమె సేఫ్ అయిందని హోస్ట్ తెలిపారు. అయితే ఆమె మాత్రం తాను ఉండనని, వెళ్లిపోతానని ఏడవడంతో.. మరొకసారి ఆలోచించుకోమని చెప్పాడు. అయినా సరే ఆమె తగ్గకపోవడంతో బిగ్ బాస్ తో చెప్పి తలుపులు తెరిపించాడు హాస్ట్ సుదీప్. దీంతో ప్రోమో కాస్త ఎండ్ అయ్యింది. మొత్తానికైతే ఆ తర్వాత ఏం జరిగింది..? శోభా శెట్టి సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యిందా? లేక ఇదంతా పబ్లిసిటీ స్టంటా? అన్నది తెలియక ప్రేక్షకులు టెన్షన్ లో పడ్డారు. వాస్తవానికి తెలుగులో అంత అద్భుతంగా ఫర్ఫామ్ చేసిన ఈమె, తన మాతృభాషా అయిన కన్నడలో ఎందుకు ఆడలేకపోతోంది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. నిజానికి శోభ హౌస్ లో ఉండడం వల్ల తెలుగు ప్రేక్షకులు కొంతమంది భాష తెలియకపోయినా షో చూస్తున్నారు. మరి టీఆర్పీ కోసం ఇలా ఏదైనా చేశారా అన్నది చూడాలి.