BigTV English

Allu Arjun: అల్లుఅర్జున్‌కు అధికారుల షాక్.. నేనొక ఫేమస్ నటుడ్ని, అయినా వినలేదు

Allu Arjun: అల్లుఅర్జున్‌కు అధికారుల షాక్.. నేనొక ఫేమస్ నటుడ్ని, అయినా వినలేదు

Allu Arjun: ఎవరైనా చట్ట ప్రకారం నిబంధనలు పాటించాలి. తాను సెలబ్రిటీని.. చేయనని మొండి కేస్తే ఇబ్బందులు తప్పవు. టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ విషయంలో అదే జరిగింది. ఎయిర్‌పోర్టులో ఆయనకు అధికారుల నుంచి ఊహించిన షాక్ తగిలింది. అసలేం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..


నటీనటులు ఎక్కడికి వెళ్లినా వారిని అభిమానులు చుట్టేస్తారు. వారి నుంచి తప్పించుకునేందుకు రకరకాల పద్దతులు అవలంభిస్తారు. కొంతమంది ముఖం గుర్తు పట్టకుండా వ్యవహరిస్తారు. ఈ విషయంలో రూల్స్ అధిగమిస్తే మాత్రం అధికారులు క్షమించరు. రాష్ట్ర స్థాయిలో అయితే పర్వాలేదు. కేంద్ర బలగాలున్న ప్రాంతంలో కచ్చితంగా రూల్స్ ఫాలో కావాల్సిందేనని చెబుతున్నారు.

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో హీరో అల్లుఅర్జున్‌కి ఊహించని ప్రతిఘటన ఎదురైంది. షూటింగ్ నిమిత్తం లేక మరో పని నిమిత్తం ఆయన వేరే ప్రాంతానికి లేకుంటే మరో దేశానికి వెళ్తున్నారు. శనివారం ఎయిర్‌పోర్టులో భద్రతా సిబ్బంది అల్లు అర్జున్‌ని ఆపారు. వ్యక్తిగత ఐడీ, ముసుగు తొలగించి ముఖం చూపించాలని కోరారు.  మొదట్లో అల్లుఅర్జున్ తన ముఖం చూపించడానికి ఇష్టపడలేదు.


కొద్దిసేపు సెక్యూరిటీ అధికారితో మాట్లాడిన తర్వాత తొలుత కళ్ల జోడు తీశాడు. అయినా ఆ సెక్యూరిటీ అంగీకరించలేదు. కచ్చితంగా ముఖానికి ఉన్న మాస్క్ తొలగించి ఫేస్ చూపించాలన్నారు. ఈలోగా అల్లు అర్జున్ సహాయకుడు ఆ అధికారిని కన్వీన్స్ చేసే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ ఆ అధికారి ముఖం చూడాలని పట్టుబట్టాడు.

ALSO READ: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి బ్రేక్

చివరికి చేసేదేమీ లేక స్టయిలిష్ స్టార్ మాస్క్ తీసి ముఖం చూపించాడు. అప్పుడు లోపలికి వెళ్లాడు. ఇది కేవలం అల్లు అర్జున్ మాత్రమేకాదు. మిగతా నటీనటులకు ఎయిర్‌పోర్టులో సెక్యూరిటీ కచ్చితంగా  ముఖానికున్న మాస్క్ తొలగించి ముఖం చూస్తారు.  ఆ తర్వాత పంపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

ముంబై ఎయిర్‌పోర్టులో నటీనటులకు అదే పరిస్థితి.  అక్కడ వాళ్లంతా ముఖానికున్న మాస్క్‌లు తొలగిస్తారు. అదే ఫారెన్‌ ఎయిర్‌పోర్టులో బాలీవుడ్ నటుల  బాడీ మొత్తం చెక్ చేసిన తర్వాత పంపించిన సందర్భాలు ఉన్నాయి. ఈ విషయంలో అనేకమంది బాలీవుడ్ నటులు తమ ఆవేదనను వెళ్లగక్కారు కూడా.

బన్నీ వ్యవహారం అభిమానులకు తెలిసి కాసింత ఆగ్రహం వ్యక్తం చేశారు.  దేశవ్యాప్తంగా బన్నీ ఫేమస్ నటుడని, అతడు చెప్పినా అధికారులు వినకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.  అన్నట్లు బన్నీ వెళ్తున్నది ఎక్కడికి అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు.

 

Related News

Chiranjeevi Vs Balakrishna: మరోసారి బయటపడ్డ మెగా నందమూరి విభేదాలు.. అసలు గొడవ అక్కడేనా?

OG Title: OG.. టైటిల్ ని ఆ నిర్మాత గిఫ్ట్ ఇచ్చారు.. అసలు నిజం చెప్పేసిన దానయ్య

OG Film: పవన్ అభిమానులకు బిగ్ షాక్… హెచ్డీ ప్రింట్ లీక్!

Pawan Kalyan: ఓజీ చూడాలంటే ఇది తప్పనిసరి… పవన్ ఫ్యాన్స్ కి ప్రసాద్ మల్టీప్లెక్స్ కండిషన్

Chiranjeevi: అసెంబ్లీలో బాలయ్య వ్యంగ్య కామెంట్స్‌పై చిరంజీవి స్పందన.. కీలక ప్రకటనతో..

Shah Rukh Khan: కొడుకు చేసిన పనికి షారుక్‌కి భారీ మూల్యం.. రూ. 2 కోట్లు పరువు నష్టం దావా!

OG Success Meet : థమన్ బాం*చ*త్ అన్నాడు… సక్సెస్‌మీట్‌లో నిర్మాత కామెంట్

Sujeeth: రాజమౌళికి పోటీగా సుజీత్… అంతా పవన్ వల్లే

Big Stories

×