Indian railways Round Trip Package: దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థగా ఉన్న భారతీయ రైల్వే నిత్యం లక్షలాది మంది ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చుతుంది. రోజూ సుమారు 13 వేల రైళ్లు, సుమారు 7,300 రైల్వే స్టేషన్లను కలుపుతూ సర్వీసులు అందిస్తున్నాయి. దేశంలోని అన్ని పట్టణాలకు రైలు సర్వీసులు అందిస్తున్నది. ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించేందుకు ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది భారతీయ రైల్వే. ఇందుకోసం అదిరిపోయే ఆఫర్లను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నది.
రిటర్న్ టికెట్లపై 20 శాతం తగ్గింపు
వరుస పండుగలు వస్తున్న నేపథ్యంలో ప్రయాణీకులకు భారతీయ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. రౌండ్ ట్రిప్ ప్యాకేజ్ ఫర్ ఫెస్టివల్ రష్ పేరుతో ఓ కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకం ప్రకారం రాను పోను ప్రయాణానికి రైలు టికెట్లు బుక్ చేసుకున్న చక్కటి తగ్గింపు అందిస్తుంది. తిరుగు ప్రయాణం చేసే టికెట్లలో బేస్ ఫేర్ లో 20 శాతం రిబేట్ ను ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇబ్బందులు లేని ప్రయాణానికి, ముందస్తు రిజర్వేషన్ చేసుకోవడాన్ని, రైళ్లలో ప్రయాణించడాన్ని ప్రోత్సహించడానికి, రద్దీని క్రమబద్దీకరించడానికి ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రైల్వే అధికారులు వెల్లడించారు.
ఆగష్టు 14 నుంచి బుకింగ్..
ఇక ఈ ప్రత్యేకమైన పథక ప్రత్యేక రైళ్లు సహా అన్ని రైళ్లలో, అన్ని తరగతులకూ వర్తిస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ పథకం కింద టికెట్లు ఆగస్టు 14 నుంచి బుక్ చేసుకోవచ్చన్నారు. అక్టోబరు 13 నుంచి 26 మధ్య ప్రయాణం చేయవచ్చని తెలిపారు. తిరుగు ప్రయాణం నవంబరు 17 నుంచి డిసెంబరు 1వ వరకు చేసుకోవచ్చు వివరించారు.
Read Also: హిల్ స్టేషన్స్ కు ఎగేసుకు వెళ్తున్నారా? అయితే, మీ పని అయిపోయినట్లే!
కొన్ని కండీషన్లు పెట్టిన ఇండియన్ రైల్వే
ఈ పథకాన్ని ఉపయోగించుకోవడానికి కొన్ని షరతులు వర్తిస్థాయని భారతీయ రైల్వే వెల్లడించింది. రెండు వైపుల కన్ఫర్మ్ టికెట్లు ఉండాలి చెప్పింది. అంతేకాదు, రెండు వైపుల గమ్యస్థానాలు ఒకటే అయు ఉండాలన్నది. ప్లెక్సీ ఫేర్ ఉన్న రైళ్లు… రాజధాని, శతాబ్ది, దురంతో రైళ్లలో ఈ పథకం వర్తించదని తెలిపింది. తిరుగు ప్రయాణానికి అడ్వాన్స్‌డ్ రిజర్వేషన్ పీరియడ్ వర్తించదని తెలిపింది. అలాగే కూపన్లు, ఓచర్లు, పాసులు పనిచేయవన్నది. ఈ పథకం కింద బుక్ చేసుకున్న టికెట్లకు డబ్బులు వాపసు చేయరని రైల్వే తెలిపింది. తాజా పథకంతో చాలా మంది రైల్వే ప్రయాణీకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తగ్గింపు ధరతో టికెట్లు బుక్ చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. రైల్వే అధికారులు సైతం ప్రయాణీకులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని, తక్కువ ఖర్చుతో ఆహ్లాదకరమైన ప్రయాణాలు సాగించవచ్చని సూచిస్తున్నారు. పండుగల వేళ టికెట్లు దొరక్క ఇబ్బంది పడటం కంటే, ముందుగానే తగ్గింపు ధరతో టికెట్లు బుక్ చేసుకుని హ్యాపీగా ప్రయాణాలు చేయడం మంచిదంటున్నారు.
Read Also: జర్నీకి పావుగంట ముందు.. IRCTCలో వందేభారత్ టికెట్స్ ఇలా బుక్ చేసుకోండి!