War 2: యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా (Adithya chopra) నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం వార్ 2. ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ (Ayan Mukherjee) దర్శకత్వం వహించారు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) హీరోగా, కియారా అద్వానీ (Kiara advani) హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా ఎన్టీఆర్ (NTR) బాలీవుడ్ కి పరిచయం కాబోతున్నారు. అంతేకాదు ఈ సినిమాలో ఎన్టీఆర్ విలన్ పాత్ర పోషిస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆగస్టు 10 హైదరాబాదులోని యూసుఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో సాయంత్రం ఐదు గంటలకు ప్రీ రిలీజ్ నిర్వహించనున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బ్రేక్..
ఇకపోతే ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అధికారికంగా పలు రోడ్లపై ఆంక్షలు కూడా విధించారు. కానీ నగరంలో భారీ వర్షాలు పడుతుండడంతో ఇప్పుడు ఈవెంట్ కి బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇకపోతే దీనిపై పూర్తి అధికారిక ప్రకటన వెలువడ లేదు. కానీ వర్షాలు సాయంత్రం వరకూ అలాగే కొనసాగితే ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఇక ఎన్టీఆర్ ను దగ్గరగా చూడాలనుకున్న అభిమానులకు ఇది భారీ షాక్ అని చెప్పవచ్చు. మరి వరుణుడి ప్రతాపం ఎలా కొనసాగుతుందో చూడాలి.
వార్ 2 సినిమా విశేషాలు.
ఇక వార్ 2 సినిమా విషయానికి వస్తే.. భారీ అంచనాల మధ్య వార్ చిత్రానికి కొనసాగింపుగా రాబోతోంది. హై యాక్షన్ పర్ఫామెన్స్ తో రాబోతున్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా నుండి విడుదలైన ‘ఊపిరి ఊయల’గా పాట అటు హిందీ ఇటు తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీనికి తోడు ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కాంబినేషన్లో వస్తున్న “జనాబ్ ఈ అలీ” సాంగ్ టీజర్ను కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే . ఇక ఈ పాట థియేటర్లలోనే విడుదల కాబోతోంది. ఈ పాట టీజర్ విడుదలైనప్పుడు కొంతమంది అద్భుతంగా ఉందని కామెంట్లు చేస్తే.. మరి కొంతమంది నాటు నాటు పాటను బీట్ చేయలేక పోయింది అని కూడా కామెంట్లు వ్యక్తం చేశారు. అటు ఎన్టీఆర్ ఇటు హృతిక్ రోషన్ ఇద్దరూ కూడా డాన్స్ లో ఐకాన్ గా పేరు సంపాదించుకున్నారు. మరి తెరపై వీరిద్దరి పర్ఫామెన్స్ ఎలా ఉండబోతుందో తెలియాలి అంటే ఆగస్టు 14 వరకు ఎదురు చూడాల్సిందే.
ALSO READ:Film industry: కాల్పుల్లో ప్రముఖ రాపర్ సింగర్ మృతి!