Film industry:ఈ మధ్యకాలంలో చాలామంది యువ నటీనటులు, సింగర్స్ కాల్పుల్లో మరణించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మొన్నటి వరకు చాలామంది అనారోగ్య సమస్యలతో, వృద్ధాప్య సమస్యలతో కన్నుమూస్తే.. ఇప్పుడు యువ నటులు ఇలా కాల్పుల్లో దుండగుల చేతుల్లో మరణించడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. నిన్నటికి నిన్న ప్రముఖ హీరోయిన్ హుమా ఖురేషి(Huma Qureshi) కజిన్ బ్రదర్ అయినా ఆసిఫ్ ఖురేషిని చిన్న వాగ్వాదంతో దుండగులు ఏకంగా కత్తిపోట్లతో అత్యంత దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే.. ఇక ఆ సంఘటన మరువకముందే ఇప్పుడు మరొక రాపర్ పై దుండగులు కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆయనను హాస్పిటల్ కి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించారు.
ప్రముఖ రాపర్ సింగర్ పై కాల్పులు..
అసలు విషయంలోకి వెళ్తే.. జార్జియా రాపర్ టి -హుడ్ (T- Hud) హత్యకు గురయ్యారు. శుక్రవారం సాయంత్రం గ్విన్నెట్ కౌంటిలోని తన ఇంట్లో హుడ్ ను కొంతమంది దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు. దీంతో ఆయనను హాస్పిటల్ కి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రస్తుతం దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఒక అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇకపోతే టీ హుడ్ మరణం అభిమానులను కలవరపాటుకు గురిచేస్తోంది. అసలు ఆయన ఇంట్లోకి దుండగులు వెళ్లి తుపాకితో కాల్పులు జరపడానికి అసలు కారణమేమిటి? అసలేం జరిగింది? అనే విషయాలపై అటు పోలీసులతో పాటు ఇటు అభిమానులు కూడా ఆరాతీస్తున్నారు. ఇకపోతే రెడీ 2 గో, బిగ్ బూటీ, పెర్కులేటర్ వంటి పాటలతో ప్రసిద్ధి చెందారు.
రాపర్ టీ హుడ్ కెరియర్..
రాపర్ టీ హుడ్.. అసలు పేరు ఆంటోయిన్ ఫ్రాంక్లిన్ మెక్ కోలిస్టర్. ప్రస్తుతం ఈయన వయసు 33 సంవత్సరాలు. ఈయన ఒక అమెరికన్ రాపర్ 1988 మే 11న జన్మించారు వృత్తిపరంగా ఈయనను టి హుడ్ అని కూడా పిలుస్తారు. ఇకపోతే ఈ కాల్పులు జరగడానికి కారణం ఇప్పటివరకు తెలియలేదు. ఇకపోతే ఈయన తల్లి యులాండా ఆగస్టు 9న అతని మరణాన్ని మీడియాతో పంచుకుంది.. ఆ సమయంలో ఇంటి లోపల పార్టీ జరుగుతోందనే వార్తలను కూడా ఆమె ఖండించారు. విచారణ కోసం ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇక ఈయన మరణాన్ని అభిమానులు , సంగీత కళాకారులు జీర్ణించుకోలేకపోతున్నారు. పలువురు సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా వేదికగా కన్నీటి పర్యంతం అవుతూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అటు వీరి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
ప్రముఖ సంగీత నిర్మాత డీడో ట్విల్ తన ఇంస్టాగ్రామ్ ద్వారా..” నేను నిన్ను ఇష్టపడుతూనే ఉంటాను బ్రదర్. శాంతితో విశ్రాంతి తీసుకోండి. నేను మీరు పోయారు అనే విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను” అంటూ తెలిపారు.
ALSO READ:Coolie Vs War 2: రాజకీయ చిచ్చు లేపిన లోకేష్.. ఎన్టీఆర్ ను దెబ్బతీయడానికేనా?