E-Paper
Advertisement

Bigg Boss: కిర్రాక్ సీత ఎలిమినేట్.. 6 వారాలలో ఎంత రెమ్యునరేషన్ తీసుకుందంటే..?

Bigg Boss: కిర్రాక్ సీత ఎలిమినేట్.. 6 వారాలలో ఎంత రెమ్యునరేషన్ తీసుకుందంటే..?

Bigg Boss.. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ప్రేక్షకులను విపరీతంగా ఎంటర్టైన్ చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా హౌస్ లోకి 14 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టగా.. అందులో ఐదు వారాలలో 6 మంది ప్రేక్షకులను మెప్పించలేక ఎలిమినేట్ అయ్యారు. మరొకవైపు వైల్డ్ కార్డు ద్వారా మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ను ఏకంగా 8 మందిని హౌస్ లోకి దింపారు బిగ్ బాస్.. అలా ప్రస్తుతం హౌస్ లో ఓజీ క్లాన్ సభ్యులుగా యష్మీ, ప్రేరణ, కిర్రాక్ సీత, విష్ణు ప్రియ, పృథ్వీ, నిఖిల్, నబీల్, మణికంఠ ఉండగా.. వైల్డ్ కార్డు ద్వారా అడుగుపెట్టిన హరితేజ, నయనీ పావని, రోహిణి , గంగవ్వ, ముక్కు అవినాష్, మెహబూబ్, టేస్టీ తేజ, గౌతమ్ కృష్ణ లను రాయల్ క్లాన్ గా చేర్చారు. అలా మొత్తం ఇప్పుడు రెండు క్లాన్ లలో మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ తో హౌస్ లో సందడి చేస్తున్నారు.

ఆరవ వారం ఎలిమినేట్ అయిన సీత..

ఇకపోతే ఆరవ వారం నామినేషన్ ప్రక్రియ పూర్తయి ఎలిమినేషన్ కూడా మొదలైంది. అందులో భాగంగానే మొదట్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకొని ఓటింగ్ లో కూడా నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్న సీత చివరికి ఓటింగ్ లో చివరికి పడిపోయి ఎలిమినేట్ అయింది. హౌస్ లో స్ట్రాంగ్ అనిపించుకున్న సీత ఎలిమినేట్ అవ్వడంతో అభిమానులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు విషయంలోకెళితే, ఈ వారం నామినేషన్ ప్రక్రియ రెండు రోజులపాటు జరగడంతో ఓటింగ్ ప్రక్రియ కూడా మంగళవారం రాత్రి నుంచి మొదలై.. శుక్రవారం రాత్రి ముగిసింది. అనధికారిక ఓటింగ్ లెక్కలు చూస్తే గంగవ్వ టాప్ పొజిషన్లో ఉండగా.. ఆ తర్వాత స్థానంలో మహబూబ్, యష్మీ , విష్ణు ప్రియ ఉన్నట్లు సమాచారం.

ఆరు వారాలకు గానూ సీత రెమ్యునరేషన్..

ఇక విష్ణుప్రియ , పృథ్వీ, సీత డేంజర్ ట్రైన్ లో ఉన్నారని ప్రచారం జరగగా.. ఇప్పుడు బిగ్ బాస్ లీక్స్ ప్రకారం సీత ఎలిమినేట్ అయినట్లు సమాచారం. మొత్తానికైతే సీత ఎలిమినేషన్ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇకపోతే సీత ఎలిమినేట్ అవ్వడంతో ఆరు వారాలకు గానూ ఆమె ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంది అని వార్తలు వైరల్ గా మారుతున్నాయి. మరి ఆరు వారాలకు గానూ సీత ఎంత రెమ్యునరేషన్ తీసుకుంది అనే విషయానికి వస్తే.. వారానికి రూ.2 లక్షల ఒప్పందంతో హౌస్ లోకి అడుగుపెట్టింది సీత. ప్రస్తుతం ఆరువారాలు హౌస్లో కొనసాగింది కాబట్టి ఆరువారాలకు గాను మొత్తం రూ.12 లక్షలు రెమ్యునరేషన్ గా తీసుకున్నట్లు సమాచారం. ఇక రోజుకు రూ.28, 571 చొప్పున తీసుకుంది. ఈరోజు వరకు మనం లెక్క తీసుకున్నట్లయితే 42 రోజులు హౌస్ లో ఉంది సీత. మరి 42 రోజులకు గానూ మొత్తం రూ.12 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. ఏది ఏమైనా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకొని ఆ తర్వాత డల్ అయిపోయి ఎలిమినేట్ అయింది సీత.

Related News

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

ట్రోలర్స్ ఇనయా దిమ్మతిరిగే కౌంటర్.. కాన్ఫిడెంట్ కు మెచ్చుకోవాల్సిందే..!

Bigg Boss Soniya: గిన్నీస్ బుక్ లో సోనియా కూతురికి చోటు.. ఏం చేసిందో తెలుసా..?

Demon Pawan : వివాదంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ డిమాన్.. ఆగని ట్రోల్స్..!

బిగ్ బాస్ నటితో సిరాజ్ డేటింగ్.. సంచలనం సృష్టిస్తున్న వీడియో!

Big Stories

×