BigTV English
Advertisement

Bigg Boss 9 Telugu Promo 2: నోటి కాడ కూడు లాగేసుకున్న బిగ్ బాస్.. మరీ దారణంరా బాబూ!

Bigg Boss 9 Telugu Promo 2: నోటి కాడ కూడు లాగేసుకున్న బిగ్ బాస్.. మరీ దారణంరా బాబూ!

Bigg Boss 9 Telugu Promo 2:బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కార్యక్రమం ఘనంగా సెప్టెంబర్ 7న ప్రారంభం అయింది. మొత్తం తొమ్మిది మంది సెలబ్రిటీలు, 6 మంది కామనర్స్ తో ఈ షో ఘనంగా ప్రారంభించారు. 6 మంది కామనర్స్ ను ఓనర్స్ గా ప్రకటిస్తూ.. వారికంటూ ఒక ఇంటిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అటు 9 మంది సెలబ్రిటీలను టెనెంట్స్ గా సంబోధిస్తూ వీరికి ఫామ్ హౌస్ ఇచ్చారు. ప్రస్తుతం అంతా కలిసి పని చేసుకుంటున్న నేపథ్యంలో తాజాగా విడుదల చేసిన ప్రోమో చూసే అభిమానులకి కూడా ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ముఖ్యంగా నోటి కాడ కూడు లాగేసుకున్నారు కదరా అంటూ బిగ్ బాస్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో రిలీజ్..

తాజాగా విడుదల చేసిన ప్రోమో విషయానికి వస్తే.. అటు సెలబ్రిటీలతోపాటు ఇటు కామనర్స్ అందరూ కూడా కిచెన్ లో భోజనం చేయడానికి సిద్ధమయ్యారు.. సడన్గా బిగ్ బాస్ మాట్లాడుతూ.. టెనెంట్స్.. ఇల్లు ఓనర్స్ కి మాత్రమే. మీరందరూ ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలి” అని చెబుతారు. దీంతో ప్లేట్లో బిర్యాని పెట్టుకుని ఇమ్మానుయేల్ బయటకు వెళ్తుండగా.. భరణి శంకర్ నీకు కొంచెం బిర్యాని కావాలా? రా ప్లేట్లో వేస్తాను అంటాడు. అయితే నోట్లో ముద్ద ఇమ్మానుయేల్ పెట్టుకుంటుండగానే.. బిగ్ బాస్ మీ చేతుల్లో ఉన్న ప్లేట్స్ కూడా అక్కడే వదిలేసి బయటకు వెళ్ళండి అంటూ చెబుతారు. ఇది చూసే ఆడియన్స్ కి కూడా కాస్త బాధను కలిగించింది. నోటికాడ కూడు తీస్తారేంటి అంటూ మండిపడుతున్నారు.

పాపం నోటికాడ కూడు లాగేసారుగా..


దాంతో టెనెంట్స్ అంతా హౌస్ వదిలి గార్డెన్ ఏరియాలోకి వెళ్ళిపోతారు. తర్వాత మాస్క్ మ్యాన్ హరీష్ కెమెరా ముందుకు వచ్చి.. నన్ను తినొద్దు అంటే చెప్పండి. నేను తినను. అంతేకానీ నోటి కాడ కూడు లాగేసుకోకండి.. నో మేటర్ ఏదైనా సరే అంటూ తెలిపారు. ఒక వెంటనే ఇమ్మానుయేల్ దగ్గరికి ఓనర్స్ అంతా వచ్చి.. ఆయనకు తినమని చెబుతారు. దానికి ఇమ్మానుయేల్ మాట్లాడుతూ.. తినొచ్చా.. దీనివల్ల ఏదైనా పరిణామాలు ఏర్పడితే ఎవరు బాధ్యత అని అడిగితే.. దానికి కామనర్ దమ్ము శ్రీజ మాట్లాడుతూ.. హా .. మీరు తినండి.. ఏదైనా జరిగితే మేము ఎదుర్కొంటాము.. అంటూ చెప్పడంతో కామనర్స్ ఎంత సహృదయులో అందరికీ అర్థమైపోయింది.

కంటెస్టెంట్స్ మధ్య చిచ్చు పెట్టిన బిగ్ బాస్..

బిగ్ బాస్ మాట్లాడుతూ ఇకనుండి ఓనర్స్ అనుమతి లేకుండా టెనెంట్స్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళకూడదు అంటూ కండిషన్ పెడతాడు. బిగ్బాస్ పంపిన ఆహారం మొత్తాన్ని స్టోర్ రూమ్ లో పెట్టండి అంటూ బిగ్ బాస్ ఆర్డర్స్ జారీ చేశారు. మీరు భోజనం చేయండి ఏదైనా సమస్య వస్తే మేము చూసుకుంటామని శ్రీజ చెబితే దానికి తనూజ మాట్లాడుతూ.. మేము భోజనం తింటాము.. కానీ పనిష్మెంట్ మీకు ఇవ్వకుండా మొత్తం హౌస్ కి ఇస్తే ఆ బాధ్యత ఎవరిది ? ” అంటూ ఆమె తన వేలో చెప్పుకొస్తుంది. బిగ్బాస్ పెట్టిన ఈ చిచ్చు అటు ఓనర్స్ కి.. ఇటు టెనెంట్స్ కి మధ్య గొడవ ఏర్పడేలా కనిపిస్తోందని కొంతమంది కామెంట్లు చేయగా.. మరికొంతమంది ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ కావాలి అంటే ఈ మాత్రం ఉండాల్సిందే అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ALSO READ:Raghava Lawrence: లారెన్స్ గొప్ప మనసు.. మొన్న కాలు.. నిన్న స్కూటీ.. నేడు ఇల్లు..!

 

Related News

Nagarjuna: బిగ్ బాస్ హోస్ట్ చేయడంలో నాగార్జున ఫెయిల్ అయ్యారా? ఎందుకంత నెగిటివిటీ వస్తుంది?

Duvvada Madhuri: ఒక్క వారంలో ఊహించని మార్పు, అంత తనూజ దయ

Bigg Boss 9 : బిగ్ బాస్ 9 యాజమాన్యంలో ఎంత మార్పు వచ్చిందో, దెబ్బకు అలా చేయడం ఆపేశారు

Bigg Boss 9 Promo: నువ్వు తోపు అయితే.. అది ఇక్కడ కాదు, మాధురికి నాగ్‌ వార్నింగ్

Ramya Moksha: తనూజ వల్లే రమ్య అవుట్.. పిక్కిల్స్‌ పాప ఎలిమినేషన్‌ కి కారణాలివే!

Bigg Boss 9 Promo: పోతూ పోతూ హౌస్ లో పెంట పెట్టిన పచ్చళ్ల పాప..పాపం బలైన మాధురి!

Bigg Boss 9 Elimination: ఈ వారం పచ్చళ్ల పాప రమ్య అవుట్‌.. డేంజర్‌లో జోన్‌ ఉంది వీరే!

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ లోకి వాళ్లు రీ ఎంట్రీ.. ఇదేం ట్విస్ట్ బాబోయ్..!

Big Stories

×