Bigg Boss 9 Promo:వీకెండ్ వచ్చేసింది.. శని, ఆదివారాలలో బిగ్ బాస్ హౌస్ లో వారం మొత్తంలో కంటెస్టెంట్స్ చేసిన తప్పులను ఎత్తి చూపిస్తూ సరి చేసే ప్రయత్నం చేస్తారు హోస్ట్. అందులో భాగంగా తాజాగా తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 కి సంబంధించి 48వ రోజు మొదటి ప్రోమోని నిర్వాహకులు విడుదల చేశారు. వీకెండ్ కాబట్టి హోస్ట్ నాగార్జున(Nagarjuna ) స్టేజ్ పైకి వచ్చి చిన్న చిన్న విషయాలకి కూడా గొడవలు జరిగేది ఒక బిగ్ బాస్ హౌస్ లోనే.. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూసి వాటిని సరిచేసే ప్రయత్నం చేద్దాం అంటూ హౌస్ లో జరిగే సంఘటనలను చూపించారు. కిచెన్ లో వర్క్ చేస్తున్న దివ్వల మాధురి(Divvala Madhuri) మరొకసారి తన వాయిస్ రైస్ చేసినట్లు అనిపించింది. అయితే ఇక్కడ తప్పు ఎవరిది అన్నది ఆడియన్స్ కి వదిలేశారు.. మరి ఈ ప్రోమో ఎలా ఉంది? ఆ ప్రోమో ని బట్టి చూస్తే తప్పు ఎవరిది? అనే విషయం ఇప్పుడు చూద్దాం.
చిన్న చిన్న పదాలతో కూడా ఆర్గ్యుమెంట్ చేసుకోవడం, అరవడం మనం బిగ్ బాస్ హౌస్ లోనే చూస్తాము. వెళ్దాం.. సెట్ చేద్దాం.. అంటూ తన డైలాగ్ తో స్టార్ట్ చేశారు నాగార్జున. కిచెన్ లో వంట చేస్తున్న దివ్వెల మాధురి.. బాయ్ అన్ని ఎదురుగా చెప్పడేమో.. పక్కకెళ్ళి చెప్తాడేమో అంటూ అక్కడే తనకు సహాయం చేస్తున్న దివ్యా నిఖితతో చెబుతూ ఉంటుంది. రమ్య దగ్గరకు వెళ్లి ఆవిడ చెప్పినట్టే ఎందుకు వింటున్నావ్ అని అన్నాడట.. అయినా నేను అందరికీ చెబుతున్నానా ఆ పని చేయండి అంటూ మాధురి చెబుతూ ఉండగానే.. మధ్యలో సాయి కలుగజేసుకొని మీరు చెప్పింది కూడా నేను చేయాల్సిన అవసరం లేదు అని అంటే.. మాధురి మీకెవరు చెప్పారు అంటూ ప్రశ్నించింది. నేను అదే చెబుతున్నాను అని సాయి అంటే.. మరైతే అందరి దగ్గరకు వెళ్లి నా గురించి చెప్పకు అని అంటుంది మాధురి.
ఇక సాయి నేను ఎవరికీ చెప్పలేదు.. ఆమెను కూడా మీరు బలవంతంగా లాక్కొని వచ్చి అని చెబుతుండగానే మధ్యలో మాధురి కలగజేసుకొని ఆమె నా దగ్గరకు వచ్చి అడిగింది కాబట్టే నేను చెప్పాను అంటూ చెబుతుండగానే సాయి ఒక్కసారిగా రెచ్చిపోయి అది మీ ఇద్దరి డిస్కషన్ నన్నెందుకు మధ్యలో లాగుతున్నారు అంటూ చాలా గట్టి గట్టిగా అరిచేసాడు. దీంతో మాధురి ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావ్ అంటుండగానే.. వాయిస్ మీరు పెంచారు నేను కాదు అంటూ మళ్ళీ రెచ్చిపోయాడు సాయి. వాళ్ల దగ్గరికి వీళ్ల దగ్గరికి వెళ్లి మాటలు మాట్లాడే రకం నేను కాదు అంటూ ఇచ్చి పడేసింది మాధురి. నోరు కాస్త అదుపులో పెట్టుకో గేమ్ ఆడడానికి వచ్చావా.. అందరి దగ్గర వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు చెప్పడానికి వచ్చావా అంటూ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది మాధురి.
అయితే వీరిద్దరి మధ్య వాగ్వాదానికి కారణం రమ్య మోక్ష అక్కడికి రాగానే నువ్విట్రా అంటూ మాధురి రమ్యను పిలిచింది. నువ్వు నా దగ్గరకు వచ్చి నీ లవ్ నాకు కావాలి నువ్వు ఎందుకు నాతో మాట్లాడడం లేదు.. నన్ను ఎందుకు దూరం పెడుతున్నావ్ అని అడిగావా.. నువ్వు సాయితో గేమ్ ఆడుతున్నావు కదా వెళ్లి అక్కడే ఆడు అని అన్నానా అంటూ ప్రశ్నించింది. రమ్య మాట్లాడుతూ నాకు వాడొక్కడే చెప్పాడని నేను మీతో చెప్పలేదే.. నలుగురు అన్నారు నేను మీ చుట్టూనే తిరుగుతున్నానని… అందుకే అవునా అని నేను మిమ్మల్ని అడిగాను అంటూ రమ్య అడిగింది.. మొత్తానికి మళ్లీ ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈవారం ఎలిమినేట్ కాబోతున్న రమ్య పోతూ పోతూ మళ్ళీ పెంట పెట్టేసింది. మొత్తానికైతే రమ్య మోక్షా కి మాధురి బలైపోయింది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
ALSO READ:K-Ramp: లాభాల బాట పట్టిన కే- ర్యాంప్.. కలిసొచ్చినట్టుందే?