Bigg Boss 9 Telugu : తెలుగు ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్న బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్.. 8 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ప్రస్తుతం 9 వ సీజన్ జరుగుతుంది. ఇప్పటికే ఆరు వారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ లో ఏడో వారం ఆసక్తికరంగా మారింది.. గత వారాలతో పోలిస్తే ఈ వారంలో అనారోగ్య సమస్యలతో మిడ్విక్ ఎలిమినేషన్ జరిగిందా సంగతి తెలిసిందే. కంటెస్టెంట్ ఆయేషా తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. అలాగే ఈ వీకెండ్ మరో ఎలిమినేషన్ జరగబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఎవరు హౌస్ నుంచి బయటికి వెళ్తారు అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది.. ఇదిలా ఉండగా ఈ వారం మళ్లీ హౌస్ లోకి రీ ఎంట్రీలు ఉండబోతున్నాయంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. అందుతున్న సమాచారం ప్రకారం హౌస్ లోకి మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్న కంటెస్టెంట్లు ఎవరో ఒకసారి తెలుసుకుందాం..
బిగ్ బాస్ ప్రస్తుతం జనాల్లో వినిపిస్తున్న మాట ఇదే.. తెలుగులో 9వ సీజన్ ప్రసారమవుతుంది. వైల్డ్ కార్డు ఎంట్రీల తర్వాత హౌస్ లో గొడవలకు కేరాఫ్ గా మారింది. మామూలుగా మాట్లాడిన సరే బూతులుగా తీసుకుంటూ వాటిపై కూడా కొట్టుకున్నారు. మరీ ముఖ్యంగా తిండి కోసం హౌస్ లో ప్రతిరోజు ఏదో ఒక రచ్చ జరుగుతూనే ఉంటుంది. ఈ గొడవల మధ్య రెండు వారాలు గడిచిపోయాయి. ఈవారం మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగిన సంగతి తెలిసిందే. అనారోగ్యం కారణంగా ఆయేషా హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. అయితే ఈ వారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ ఓ వార్త సంచలనంగా మారింది. ఆదివారం రోజున భరణి, ఫ్లోరా, మర్యాద మనీష్, హరిత హరీష్, శ్రీజ దమ్ము, ప్రియా శెట్టి హౌస్ లోకి అడుగుపెడుతారట. వీళ్లంతా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని నామినేట్ చేస్తారట. ఈ వారం మొత్తం వీళ్లంతా హౌస్ లోనే ఉండబోతున్నారంటూ సమాచారం. మళ్లీ అందరూ ఒకే చోట చేరడం బాగానే ఉంది కానీ.. వీళ్ళందరి మధ్య మళ్లీ కొత్త గొడవలు క్రియేట్ అవుతాయేమో చూడాలి.
Also Read :ప్రేమ దెబ్బకు శ్రీవల్లికి షాక్.. బొమ్మ చూపించిన నర్మద.. అమూల్య కోసం విశ్వం మాస్టర్ ప్లాన్..?
ప్రతివారం వీకెండ్ ఎలిమినేషన్ జరుగుతుందన్న విషయం తెలిసిందే.. కానీ కొన్ని కారణాలవల్ల ఆయేషా బయటకు వచ్చేసింది. అయితే ఈమె మాత్రమే ఈ వారం ఎలిమినేట్ అవుతుందా..? మరొకరు హౌస్ నుంచి బయటకు వెళ్తారా అన్నది ఆడియన్స్ మైండ్ తినేస్తుంది. మొన్న అమర్ దీప్, అర్జున్ అంబటి రామ్ రాథోడ్ చెయ్యి పట్టుకుని బయటికి వెళ్దాం అని అన్నారు. అయితే వీళ్లు రామ్ ఎలిమినేట్ అయిపోతున్నారని ఇంటి ఇచ్చారా? మరి ఈ వారం అతని ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందా అన్నది తెలియాలంటే వీకెండ్ ఎపిసోడ్ని అస్సలు మిస్ అవ్వకుండా చూడాల్సిందే..