Aus vs Pak Women: వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ నేపద్యంలో ఇవాళ మరో కీలక మ్యాచ్ జరిగింది. ఈ వరల్డ్ కప్ లో భాగంగా ఇవాళ ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ పై ఆస్ట్రేలియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. అందరూ ఊహించినట్లుగానే దాదాపు 107 పరుగుల తేడాతో పాకిస్తాన్ పై విజయం సాధించింది ఆస్ట్రేలియా మహిళల జట్టు. దీంతో పాయింట్లు పట్టికలో ఆస్ట్రేలియా మొదటి స్థానానికి దూసుకువెళ్లింది. టీమిండియా మూడో స్థానానికి వచ్చింది.
Also Read: Gautam Gambhir: గంభీర్ మహాముదురు.. ట్రోలింగ్ కు చెక్ పెట్టేందుకు బీరు, బిర్యానీలు పెట్టి మరీ !
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో ఆస్ట్రేలియా మరో విజయాన్ని నమోదు చేసుకుంది. పాకిస్తాన్ మహిళల జట్టును చిత్తు చేసి, పాయింట్ల పట్టికలో నెంబర్వన్ స్థానానికి దూసుకు వెళ్లింది ఆస్ట్రేలియా. ఈ టోర్నమెంట్ లో రెండు వరుస విజయాలను నమోదు చేసుకుంది ఆస్ట్రేలియా. దీంతో ఐదు పాయింట్లు సాధించిన ఆస్ట్రేలియా నేరుగా నెంబర్ వన్ స్థానానికి వెళ్ళింది. ఇవాళ కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ మహిళల జట్ల మధ్య 9వ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో ఆస్ట్రేలియా మొదటి బ్యాటింగ్ చేయగా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 221 పరుగులు చేసింది.
పాకిస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపించే మరి ఈ స్థాయిలో ఆ మాత్రం పరుగులు చేశారు ఆస్ట్రేలియా ప్లేయర్లు. ఇది తక్కువ స్కోర్ అయినప్పటికీ, పాకిస్థాన్ ముందు అది ఎక్కువే. ఇక ఆస్ట్రేలియా బ్యాటర్లలో బెత్ ముని ఈ మ్యాచ్ లో 109 పరుగులతో రెచ్చిపోయింది. ఓపెనర్ హెలి 20 పరుగులు చేయగా 11వ వికెట్ కు ఎక్కిన అలానా కింగ్ 51 పరుగులతో దుమ్ము లేపింది. ఇక మిగతా ప్లేయర్లు పెద్దగా రాణించకపోయినా 221 స్కోర్ చేసింది ఆస్ట్రేలియా. ఈ స్కోరును ఆస్ట్రేలియా నిలబెట్టుకోగలిగింది. తక్కువ టార్గెట్ ఉన్నప్పటికీ పాకిస్తాన్ మాత్రం ఈ లక్ష్యాన్ని చేదించలేకపోయింది. లక్ష్య చేదనలో 36.3 ఓవర్లలో కేవలం 114 పరుగులు చేసిన పాకిస్తాన్ కుప్పకూలింది. సిద్ర అమిన్ ఒక్కరే 35 పరుగులు చేయగా మిగతా బ్యాటర్లందరూ అట్టర్ ప్లాప్ అయ్యారు. మరోసారి పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా 11 పరుగులకే అట్టర్ ఫ్లాఫ్ అయింది. ఫాతిమా అనే మరో బ్యాటర్ డకౌట్ అయింది. దీంతో 114 పరుగులు చేసిన పాకిస్తాన్ మహిళల జట్టు దారుణంగా ఓడిపోయింది. అటు ఆస్ట్రేలియా 107 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది.
Also Read: Inzamam-ul-Haq: రోహిత్ శర్మ ఓ ముసలోడు, పందిలాగా ఉంటాడు…అందుకే కెప్టెన్సీ పీకిపారేశారు !
వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో ఆస్ట్రేలియా ఐదు పాయింట్లతో నెంబర్ వన్ స్థానానికి దూసుకు వెళ్లింది. ఆ తర్వాత నాలుగు పాయింట్లు సాధించిన ఇంగ్లాండు రెండవ స్థానంలో ఉండగా టీమిండియా రన్ రేట్ తగ్గడంతో మూడో స్థానానికి దిగజారింది. నాలుగో స్థానంలో బంగ్లాదేశ్ మహిళల జట్టు రెండు పాయింట్లతో ఉంది. ఎప్పటిలాగే మూడు మ్యాచ్ లు ఆడిన పాకిస్తాన్ మూడు మ్యాచ్ లలో ఓడిపోయి చిట్ట చివరన నిలిచింది. ఈ లెక్కన చూస్తే వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ లో పాకిస్తాన్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.