BigTV English

Shilpa Shetty: రూ. 60 కోట్లు కట్టాల్సిందే.. శిల్పా శెట్టికి షాక్ ఇచ్చిన బాంబే కోర్టు!

Shilpa Shetty: రూ. 60 కోట్లు కట్టాల్సిందే.. శిల్పా శెట్టికి షాక్ ఇచ్చిన బాంబే కోర్టు!

Shilpa Shetty: బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్స్ శిల్పా శెట్టి(Shipla Shetty) దంపతులకు ఇటీవల కాలంలో వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. గత కొంతకాలంగా ఈ దంపతులు పలు వివాదాలలో చిక్కుకుంటున్న సంగతి తెలిసిందే. ఇదివరకు 60 కోట్ల రూపాయల కేసులో భాగంగా ఈ దంపతులపై లుక్ అవుట్ నోటీసులను జారీచేసిన సంగతి తెలిసిందే. ఇలా వీరిపై లుక్ అవుట్ నోటీసులో ఉన్న తరుణంలోనే వీరు విదేశాలకు పయనం కావడంతో మరోసారి ఈ విషయంపై శిల్పా శెట్టి దంపతులకు ఎదురు దెబ్బ తగిలింది. త్వరలో శ్రీలంకలో జరిగిబోయే ఓ కార్యక్రమానికి శిల్పా శెట్టి దంపతులు హాజరు కానున్నారు.


విదేశీ ప్రయాణాలకు అనుమతి లేదు..

ఈ క్రమంలోని వీరు శ్రీలంకకు వెళ్లడానికి కోర్టులో అనుమతి కోరుతూ పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన బాంబే కోర్టు ఊహించని తీర్పు ఇచ్చింది. శిల్పా శెట్టి దంపతులపై 60 కోట్ల రూపాయల మోసం చేసిన కేసు ఉన్న నేపథ్యంలో వారు విదేశాలకు వెళ్లడానికి అనుమతి లేదని కోర్సు తీర్పునిచ్చింది. ఇలా శ్రీలంక వెళ్లడానికి అనుమతి తెలపకపోవడమే కాకుండా ముందుగా 60 కోట్ల రూపాయలు చెల్లించాలి అంటూ ఆదేశాలను జారీ చేసింది. దీంతో శిల్పా శెట్టి దంపతులకు ఊహించని షాక్ ఎదురైంది. మరి కోర్టు తీర్పుతో శిల్పా శెట్టి దంపతులు ఈ విదేశీ పర్యటనపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాల్సి ఉంది.

రూ. 60 కోట్ల రూపాయల మోసం..

ముంబైకి చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త దీపక్ కొఠారి(Deepak Kothari) వీరిపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తన వద్ద నుంచి వ్యాపారం కోసం సుమారు 60 కోట్ల రూపాయల వరకు డబ్బు తీసుకొని వాటిని తమ స్వప్రయోజనాల కోసం వాడుకున్నారని దీపక్ వీరిపై పోలీస్ కేసు నమోదు చేశారు. ఇలా వీరిపై కేసు నమోదు కావడంతో పలు సెక్షన్ల కింద రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి దంపతులపై మోసపూరిత కేసులు నమోదు అయ్యాయి. ఇలా ఈ దంపతులు పెద్ద ఎత్తున మోసానికి పాల్పడినట్లు ప్రాథమిక నివేదిక ద్వారా వెల్లడి కావడంతో ఈ కేసును ఈఓడబ్ల్యు దర్యాప్తు చేస్తోంది.


అక్టోబర్ 14న తదుపరి వాయిదా..

కేసు దర్యాప్తులో ఉన్న నేపథ్యంలోనే శిల్పా శెట్టి రాజుకుంద్రా దంపతులపై లుక్ అవుట్ నోటీసులను కూడా జారీ చేశారు. ఇలా వీరిపై లుక్ అవుట్ నోటీసులు ఉన్న సమయంలో ఇతర దేశాలకు ప్రయాణించడానికి తప్పనిసరిగా కోర్టు అనుమతి ఉండాల్సిందేనని తెలుస్తోంది. అయితే శ్రీలంక వెళ్లడానికి వీరు కోర్టు అనుమతి తీసుకోవడం కోసం పిటిషన్ దాఖలు చేయగా బాంబే కోర్టు ఈ పిటిషన్ కొట్టి వేసింది. ఈ కార్యక్రమం అక్టోబర్ 25వ తేదీ నుంచి 29వ తేదీ వరకు శ్రీలంకలోని కొలంబోలో జరగబోతున్నాయి. ఇలాంటి తరుణంలోనే వీరు కోర్టు అనుమతి కోరారు అయితే కోర్టు ఈ పిటిషన్ రద్దు చేస్తూ తదుపరి విచారణను అక్టోబర్ 14వ తేదీకి వాయిదా వేసింది. 14వ తేదీ కోర్టు నుంచి ఏ విధమైనటువంటి తీర్పు వస్తుందో ఎదురు చూడాలి.

Also Read: Zarina Wahab -Prabhas: ప్రభాస్ బాలీవుడ్ హీరోల మాదిరి కాదు.. ప్రశంసలు కురిపించిన నటి!

Related News

Tollywood hero: మిడ్ రేంజ్ హీరో కి దెబ్బ మీద దెబ్బ, వాయిదా పడ్డ మరో ప్రాజెక్ట్

Pawan Kalyan : మూడు సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్ కళ్యాణ్, మరోసారి పీపుల్ మీడియాలో

Deepika Padukone: ఛీ.. డబ్బుల కోసం ఇంత దిగజారతావా.. దీపికాపై నెటిజన్స్‌ ఫైర్‌

Kantara Chapter 2 : కాంతార ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్… సీక్వెల్ ఇప్పట్లో లేనట్లే

Bunny Vasu : త్రివిక్రమ్ ప్రాజెక్టు గురించి మాట్లాడకండి, వాళ్ళిద్దరు కూర్చుని మాట్లాడుకోవాలి

AA22xA6 : అట్లీ అల్లు అర్జున్ సినిమాపై నోరు విప్పలేదు, తెలివిగా ప్రశ్నను దాటేశారు

‎Zarina Wahab -Prabhas: ప్రభాస్ బాలీవుడ్ హీరోల మాదిరి కాదు.. ప్రశంసలు కురిపించిన నటి!

Big Stories

×